Publish Date:May 16, 2025
భారత క్రికెట్ కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. ముంబైలోని వాంఖడేలో భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద స్టాండ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. నా పేరు మీద ఒక స్టాండ్ కలిగి ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభూతి అవుతుంది. భారతదేశం ఇక్కడ ఏ జట్టుతో ఆడినా, అది మరింత ప్రత్యేకంగా ఉంటుందన్నారు.
ఈ పెద్ద గౌరవం లభించినందుకు నేను కృతజ్ఞుడను’’ అని అన్నాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రోహిత్ శర్మ తల్లిదండ్రులు నేడు ఈ స్టాండ్‌ను ఆవిష్కరించారు. రోహిత్ శర్మతో పాటు అతడి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు మైదానం మధ్యలో నుంచి రోహిత్ శర్మ స్టాండ్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, భారత జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్‌లతో పాటు రోహిత్ సతీమణి రితికా సజ్దే పాల్గోన్నారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rohit-sharma-39-198201.html
క్రికెట్ అభిమానుల్లో.. ఐపీఎల్ పైనల్ ఉత్కంఠ పెంచుతోంది. ఈసారి కప్ కొట్టేది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరా.. పంజాబ్ కింగ్సా? అనేది మోస్ట్ ఇంట్రస్టింగ్‌గా మారింది. ఐపీఎల్ మొదలై 18 ఏళ్లు అవుతున్నా.. ఈ రెండు టీమ్‌లూ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. కాబట్టి.. ఏ టీమ్ గెలిచినా.. కొత్త చరిత్ర సృష్టిస్తుంది.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్ కు బంపరాఫర్ ఇచ్చారు. ఇష్టారీతిగా ఆరోపణలు చేయడం కాదు.. వాటికి తగిన ఆధారాలు కూడా చూపించాలని చెబుతూనే.. జగన్ చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారం చూపినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
తుని రైలు దగ్ధం కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాపు ఉద్యమ నేలతపై వైసీపీ సర్కార్ ఎత్తివేసిన కేసుల పునర్విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించనుంది.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు కావడం తథ్యం.. ఈ మాట అన్నది ఎవరో కాదు.. వైసీపీ హయాంలో ముఖ్య సలహాదారుగా, సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పి.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ కోటరీలో ముఖ్యభూమిక పోషిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి.
ఆంధ్రప్రదేశ్ లో పర్యావరణానికి పెద్ద పీట వేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సంకల్పించింది.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం (జూన్ 3) స్వామివారు దేవేరులతో కలసి చిన్నశేష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
పాకిస్థాన్ నీటి కొరతతో విలవిలలాడుతోంది. ఇంత కాలంగా జలవనరుల విషయంలో భారత్ ఉదారతపై ఆధారపడి ఉన్న పాకిస్థాన్.. ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు అండదండలు అందిస్తూ భారత్ లో హింసను ప్రేరేపిస్తూ వచ్చింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు.
రెండు పార్టీలు రెండు తెలంగాణ తల్లి విగ్రహాలు, రెండు జాతీయ గీతాలంటూ తీవ్రంగా కొట్టుకు ఛస్తున్నాయి కదూ. అయితే వీరు పెట్టుకుని నిజానికి పెట్టుకోవల్సింది వైయస్ విగ్రహానికి. వైయస్ ఆనాడు చంద్రబాబును ఏమీ చేయలేక.. చిన్నారెడ్డి అనే ఒక కాంగ్రెస్ నాయకుడి ద్వారా నలభై మంది వరకూ పోగేసి.. ఢిల్లీకి పంపారు.
తెలంగాణ రాజ్‌భవన్‌లో మిస్‌వరల్డ్-2025 విజేత ఓపల్ సుచాత, ముగ్గురు రన్నరప్‌లకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఏర్పాటు చేశారు
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయటపెడతాని రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఏపీలో జలరవాణా ద్వారా అధిక పెట్టుబడులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, జల రవాణా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బి.సి. జనార్థన్ రెడ్డి అన్నారు.