Rock Salt వాడి చూడండి – జీవితం మారిపోతుంది

Publish Date:Aug 10, 2018

Advertisement

 


ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే పసిపిల్లవాడు కూడా సముద్రం నుంచి అని ఠక్కున చెప్పేస్తాడు. కానీ గనుల నుంచి కూడా ఉప్పు దొరుకుతుందని చాలామందికి తెలియదు. దీనినే రాతి ఉప్పు- రాక్‌ సాల్ట్‌ అని పిలుస్తారు. రాళ్ల ఉప్పులో చాలా ఖనిజాలు ఉంటాయి. వీటితో సాధారణ ఉప్పు వల్ల ఏర్పడే చెడు ఫలితాలు రావు సరికదా... ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవేంటో ఓసారి మీరే చూడండి...


- ఉప్పు అనగానే మనకి బీపీనే గుర్తుకి వస్తుంది. సాధారణ ఉప్పులో ఎక్కువగా ఉండే సోడియం వల్ల, మన రక్తపోటు పెరిగిపోతుంది. కానీ రాక్‌ సాల్ట్‌ అలా కాదు. సాధారణ ఉప్పుతో పోల్చుకుంటే- ఇందులో సోడియం క్లోరైడ్ తక్కువగా ఉండి, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఉప్పుని వాడితే రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది.


- రాతి ఉప్పులో 80కి పైగా ఖనిజాలు ఉంటాయని చెబుతున్నారు. అందుకని ఈ ఉప్పుని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి, ఎలాంటి వ్యాధులూ మన దగ్గరకి రావని హామీ ఇస్తున్నారు.


- అజీర్ణానికి ఉపయోగించే చాలా ఎంటాసిడ్స్‌లో మెగ్నీషియం ఉంటుంది. రాతి ఉప్పులోనూ మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి ఇది ఒక నేచురల్‌ ఎంటాసిడ్‌లా పనిచేస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. గ్యాస్ ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉంటే... కొంచెం రాతి ఉప్పుని, కాస్త జీలకర్రతో తీసుకుంటే సరి!


- ఒంట్లో ఉన్న కఫాన్ని కరిగించేందుకు రాక్‌ సాల్ట్‌ అమృతంలా పనిచేస్తుంది. రాతి ఉప్పుని నీళ్లలో వేసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి, పొడి దగ్గు, టాన్సిల్స్ వాపు తగ్గుతాయి. రాతి ఉప్పు వేసిన నీటిని ఆవిరి పట్టడం వల్ల సైనస్, ఆస్తమా, చెవి పోటు లాంటి తీవ్రమైన వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.


- రాతి ఉప్పుతో ఒళ్లు రుద్దుకోవడం వల్ల చర్మం మీద ఉన్న మలినాలన్నీ పోతాయి. ఇక ఒక చెంచాడు రాతి ఉప్పు నీళ్లో వేసుకుని స్నానం చేస్తే... ఎలాంటి ఒంటి నొప్పులైనా తగ్గిపోయి, హాయిగా నిద్ర పట్టేస్తుంది.


- ఇప్పటి కూరగాయల్లో పెస్టిసైడ్స్‌ చాలా ఎక్కువగా ఉంటున్నాయన్న విషయం తెలిసిందే! అందుకే వాటిని తరిగే ముందు రాతి ఉప్పు వేసిన నీటితో కడిగితే, కూరగాయల పై పొరల్లో ఉండే పెస్టిసైడ్స్ కొట్టుకుపోతాయని చెబుతున్నారు.


- రాతి ఉప్పుతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రక్తప్రసరణ మెరుగ్గా ఉంటే ఒంట్లో మెటబాలిజం కూడా బాగుంటుంది. దాని వల్ల మనిషి ఆరోగ్యంగా, చురుగ్గా పనిచేయగలుగుతాడు. ఇలాంటి శరీరంలో క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు కూడా తక్కువ అని పరిశోధనలు చెబుతున్నాయి.


- డయాబెటిస్‌ ఉన్నవారు సముద్రపు ఉప్పుకంటే రాతి ఉప్పుని వాడటం మంచిదని సూచిస్తున్నారు. రాతి ఉప్పుని వాడటం వల్ల ఒంట్లో షుగర్‌ లెవెల్స్ అదుపులో ఉండి, ఇన్సులిన్ అవసరం కూడా తగ్గుతుందట.

మన వంటల్లో రాతి ఉప్పు వాడటం వల్ల వాటి రుచి పెరుగుతుందే కానీ తగ్గదు. పైగా దీని ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. మరి ఏ ఉప్పు వాడితే మంచిదో మీరే చెప్పండి!               


  - నిర్జర.

By
en-us Political News

  
ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ అంటారు, కానీ నేటి వేగవంతమైన జీవనశైలిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. చాలామంది ఆరోగ్యం అంటే కేవలం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా కఠినమైన ఆహార నియమాలు పాటించడమే అని అనుకుంటారు.
అంజీర్ పండు (Fig Fruit) ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే పండు. తాజా అంజీర్ అయినా, ఎండిన అంజీర్ అయినా సరైన పద్ధతిలో తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
భారతీయ సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో పిప్పళ్లకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. నల్లగా, చిన్న పొడుగు ఆకారంలో ఉండే ఈ పిప్పళ్లు కేవలం వంటగదిలోని దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న దివ్యౌషధం.
కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది శరీరంలోని కణాల నిర్మాణానికి మరియు కొన్ని రకాల హార్మోన్ల తయారీకి ఎంతో అవసరం.
ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో , శరీరంలో మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మారుతున్న వాతావరణంతో, పిల్లల నుండి పెద్దల వరకు ప్రతిఒక్కరినీ కడుపునొప్పి, గ్యాస్, దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.
పంటి నొప్పి, పిప్పిపంటి, పంటి సెన్సిటివిటీ, చిగుళ్ల నుంచి రక్తం రావడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఒత్తిడి, ఆందోళన, అలసట, ఏకాగ్రత తగ్గడం వంటి ఇబ్బందులు కనిపించవచ్చు. ఇలాంటి సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు యోగా, ప్రాణాయామం కూడా కొంతమందికి ఉపయోగకరంగా ఉండొచ్చు.
సూపర్‌మార్కెట్‌లో, షాప్స్ లో, చిన్న అంగళ్లలో కొనుగోలు చేసే బిస్కెట్లు, ప్యాకెట్ ఫుడ్స్, పాల ఉత్పత్తులు, జ్యూస్‌లు, సాస్‌లు, రెడీ టు ఈట్ ఆహార పదార్థాలపై Best Before,Use By, Expiry Date వంటి పదాలు కనిపిస్తుంటాయి,చాలామందికి వీటి మధ్య తేడా స్పష్టంగా తెలియదు.
ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి? అనే విషయాలను ఈ వీడియోలో డాక్టర్ ఆర్. బాలాజీ సులభంగా వివరిస్తున్నారు.
మునగాకు (Moringa Leaves) మనకు ప్రకృతి అందించిన పోషక విలువలు ఉన్న ఆహారాల్లో ఒకటి. మునగాకులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.
దాహంగా అనిపించినప్పుడు, గొంతు పొడిగా మారినప్పుడు నీరు తాగడం సహజం.  అయితే ఇలా నీరు తాగగానే.. మళ్లీ కాసేపటికే వెంటనే దాహం వేస్తుంది కొందరికి.
రెస్టారెంట్లలో భోజనం తర్వాత స్వీట్ సొంపు ఇస్తుంటారు.  చాలామందికి ఈ సొంపు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది.  కొందరు ఇంట్లో కూడా భోజనం తర్వాత స్వీట్ సొంపు తినడం లేదా సొంపు కండ చెక్కర కలిపి తినడం చేస్తుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.