ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆర్థిక పాఠాలు నేర్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో చాలా మంది కేవలం రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవాలనే ఏకైక లక్ష్యంతో వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. అయితే, ఇలా కేవలం డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకుని ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, వారు ఇప్పటికే చాలా పెద్ద చిక్కుల్లో పడ్డట్లేనని ఆయన తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మారుతున్న నేటి ఆర్థిక ప్రపంచంలో నిజమైన సంపద సృష్టి వెనుక ఉన్న రహస్యాలను వివరిస్తూ ఆయన సోషల్ మీడియాలో చేసిన ఒక సుదీర్ఘమైన పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది కేవలం వ్యాపారులకే కాదు, ఆర్థికంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక కళ్ళు తెరిపించే నిజంలా మారింది.
రాబర్ట్ కియోసాకి అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత రోజుల్లో మన చుట్టూ కనిపిస్తున్న చాలా డబ్బు నకిలీది, అలాగే మార్కెట్లో దొరుకుతున్న ఎన్నో పెట్టుబడి అవకాశాలు కూడా నకిలీ ఆస్తులే. అంతకంటే దారుణం ఏమిటంటే, ఈ రోజుల్లో ఆర్థిక సలహాలు ఇస్తూ సోషల్ మీడియాలో చలామణి అవుతున్న చాలా మంది నిపుణులు నకిలీ గురువులేనని ఆయన కుండబద్దలు కొట్టారు. మార్కెట్‌లో ఏం జరిగినా సరే, నెలాఖరుకు తమ చేతికి వచ్చే స్థిరమైన జీతం కోసం ఆశపడే కొందరు ఫైనాన్షియల్ ప్లానర్లు, మీ కష్టార్జితాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో మీకు సలహాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తున్నారు. అలాగే తమ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న సొంత వ్యాపారాన్ని కూడా నిర్మించని పాఠశాల ఉపాధ్యాయులు, నేడు తరగతి గదుల్లో కూర్చుని విద్యార్థులకు బిజినెస్ మేనేజ్‌మెంట్ గురించి బోధిస్తుంటారు. తమ జీవితంలో ఎన్నడూ ఎవరికీ జీతాలు చెల్లించని, నగదు ప్రవాహాన్ని (క్యాష్ ఫ్లో) నిర్వహించని, అలాగే ఎటువంటి ఆర్థిక రిస్క్ తీసుకోని వ్యక్తులు ఇతరులకు డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించడం నిజంగా ఒక పిచ్చిపని అని ఆయన అభివర్ణించారు.
మనం ఎంచుకునే ప్లాట్‌ఫారమ్ ఏదైనా కావచ్చు, అది ఇంటర్నెట్‌లో కోర్సులు అమ్మడం కావచ్చు, డిజిటల్ ప్రకటనలు నడపడం కావచ్చు లేదా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీని నిర్మించడం కావచ్చు, అది ఏదీ ముఖ్యం కాదు. మిమ్మల్ని నిజమైన ధనవంతులుగా మార్చేది మీరు ఎంచుకున్న రంగం కాదు, కేవలం మీ ఆలోచనా విధానం మాత్రమే. ఒక వ్యాపారాన్ని ప్రారంభించే ముందు దాని వెనుక ఒక బలమైన, స్పష్టమైన ఉద్దేశం ఉండాలి. సమాజంలో ఉన్న ఏదైనా ఒక పెద్ద సమస్యకు పరిష్కారం చూపుతూ, విలువను సృష్టించే ఆలోచన (Value Creation) మరియు సమాజానికి మేలు చేసే ఒక గొప్ప విజన్ ఉన్నప్పుడే ఆ వ్యాపారం దీర్ఘకాలంలో విజయవంతం అవుతుంది. అంతేకానీ, కేవలం లాభాల కోసమే చూస్తే మాత్రం పతనం తప్పదని ఆయన స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/robert-kiyosaki-entrepreneur-money-advice-telugu-36-222020.html
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్‌పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్‌పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.
కెప్టెన్‌గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్‌గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు.
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.