భారతీయ స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఒడిదుడుకుల మధ్య ప్రయాణిస్తోంది. గ్లోబల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) రేంకింగ్స్‌లో భారత్ ఏడో స్థానానికి పడిపోయింది. తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లు మనకంటే ముందంజలోకి దూసుకెళ్లాయి. గత పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా నిఫ్టీ 50 ఇండెక్స్ ఈ ఏడాది దాదాపు 8 శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. అయితే, ఈ గండం నుంచి మార్కెట్ త్వరలోనే గట్టెక్కుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) సంక్షోభం ముగిసి, కంపెనీల ఆదాయాలు స్వల్పంగా పెరిగినా.. నిఫ్టీ తిరిగి డబుల్ డిజిట్ లాభాల బాట పడుతుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ఒమ్నిసియెన్స్ క్యాపిటల్ ప్రెసిడెంట్ అశ్విని షామీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత మార్కెట్ పతనానికి వాల్యుయేషన్లు కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. నిఫ్టీ 50 ప్రస్తుతం 20.3 రెట్లు ప్రైస్-టు-ఎర్నింగ్స్ (P/E) మల్టిపుల్‌తో ట్రేడవుతోంది, ఇది దాని దీర్ఘకాలిక సగటు కంటే తక్కువ. ద్రవ్యోల్బణం కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీల మార్జిన్లపై కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, సింగిల్ డిజిట్ వృద్ధి నమోదైనా మార్కెట్ పుంజుకుంటుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గి, క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 60 నుంచి 80 డాలర్ల స్థాయికి స్థిరపడితే ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతుంది. దీనివల్ల నిఫ్టీ ప్రస్తుత స్థాయిల నుంచి రెండంకెల లాభాలను (Double-digit gains) అందుకోవడం ఖాయమని ఆయన విశ్లేషించారు.
ఇక తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లు భారత్‌ను దాటినప్పటికీ, ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అశ్విని షామీ సూచించారు. ఎందుకంటే ఆయా దేశాల మార్కెట్లు కేవలం ఒకటి లేదా రెండు దిగ్గజ స్టాక్‌లపైనే 50 నుంచి 60 శాతం వరకు ఆధారపడి ఉన్నాయి. కానీ భారత మార్కెట్‌లో వైవిధ్యం (Diversification) ఎక్కువ. ఐటీ రంగాన్ని పరిశీలిస్తే, ఈ ఏడాది అత్యంత పేలవమైన ప్రదర్శన చేసిన రంగంగా ఇది నిలిచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల వస్తున్న మార్పుల వల్ల ఐటీ రంగంలో వృద్ధిపై అనిశ్చితి కొనసాగుతోంది. చమురు ధరలు తగ్గడం వల్ల రూపాయి బలపడినప్పటికీ, ఐటీ కంపెనీల ఆదాయాలకు తక్షణమే పెద్ద అండ లభించకపోవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు సైంటిఫిక్ ఇన్వెస్టింగ్ ఫ్రేమ్‌వర్క్ (Scientific Investing Framework) ఎంతగానో ఉపయోగపడుతుంది. వివిధ రంగాలకు చెందిన 25 నుంచి 30 నాణ్యమైన స్టాక్స్‌ను ఎంచుకుని ఇన్వెస్ట్ చేయడం మంచి వ్యూహం. ప్రస్తుత తరుణంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలను అందిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nifty-double-digit-gains-expert-view-36-222016.html
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్‌కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్‌పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్‌పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.
కెప్టెన్‌గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్‌గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు.
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.