ప్రమాదాలు జరిగినప్పుడే ఆర్టీఏ హడావిడి!

Publish Date:Jul 25, 2014

Advertisement

 

‘హడావిడి’ అనే మాటకు అర్థం తెలుసుకోవాలంటే ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆర్టీఏ అధికారులు చేసే పనులని చూడాలి. దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతూవున్నాయంటే దానికి ప్రధాన కారణం ఆర్టీఏ వ్యవస్థలో విపరీతంగా వున్న అవినీతే. దేశంలో అత్యంత భారీగా అవినీతి జరిగే ప్రభుత్వ వ్యవస్థల్లో ఆర్టీయే మొదటి వరుసలో వుంటుంది. డ్రైవింగ్ పరీక్షలు సరిగ్గా నిర్వహించకుండానే లైసెన్సులు ఇవ్వడం, ఫిట్‌నెస్ సరిగా లేని వాహనాలకు కూడా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేయడం ఇలాంటి ఆర్థిక బలహీనతలు ఆర్టీఏకి చాలా వున్నాయి. ఇలాంటి అవినీతి ప్రమాదాల రూపంలో తన రియాక్షన్‌ని చూపిస్తూ వుంటుంది.

 

ఏదైనా ప్రమాదం జరగ్గానే ఆర్టీఏ అధికారులు హడావిడి మొదలు పెడతారు. అప్పటి వరకూ లంచం కోసం ఎన్ని సంతకాలు పెట్టినవాళ్ళయినా అర్జెంటుగా స్ట్రిక్ట్ ఆఫీసర్లయిపోతారు. కనిపించిన వాహనాన్నల్లా ‘అన్‌ఫిట్’ అంటూ సీచ్ చేసేస్తుంటారు. జరిమానాలు విధించేస్తూ వుంటారు. అలాంటి సమయంలో తాము గతంలో తిన్న లంచాలన్నిటినీ మరచిపోతూ వుంటారు.

 

2012 సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో ఒక స్కూలు బస్సు నీళ్ళలో పడిపోయి ఎనిమిది మంది చిన్నారులు మరణించారు. ఆ ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరగడంతో ఆర్టీఏకి కళ్ళు అకస్మాత్తుగా తెరుచుకున్నాయి. వెంటనే కనబడిన స్కూలు బస్సునల్లా తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. బస్సులో ఆలోపం.. ఈలోపం వుందని చెబుతూ వందలాది బస్సులను సీజ్ చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ బస్సులన్నీ రోడ్లమీద మామూలుగానే తిరిగాయి. ఆ బస్సులన్నీ ఎంచక్కా రోడ్డుమీద తిరగడం వెనుక ఎంత డబ్బు చేతులు మారిందో పరమాత్ముడికే ఎరుక.

 

అలా ఎప్పుడు ఏ భారీ రోడ్డు ప్రమాదం జరిగినా ఆ తరహా వాహనాల మీద ‘ప్రత్యేక శ్రద్ధ’ చూపించి సీజ్‌ చేస్తూ వుండటం, ఆ తర్వాత డబ్బులు చేతులు మారగానే చూసీ చూడనట్టు వదిలేయడం. ఆమధ్య పాలెం ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఆర్టీఏ అధికారులు పనికిమాలిన హడావిడి చేసి వందలాది బస్సులను సీజ్ చేశారు. మా అంతటి నిజాయితీపరులు ఎవరూ లేరన్నట్టు బిల్డప్పు ఇచ్చారు. ఆ తర్వాత సీజ్ చేసిన బస్సులన్నీ రోడ్ల మీద తూనీగల్లా తిరుగుతున్నాయి. అధికారులెవరూ వాటిని పట్టించుకోవడం లేదు. అలా పట్టించుకోకుండా ఉండటానికి ఎంత డబ్బు పట్టుకున్నారో ఎవరికి ఎరుక?

 

అలాగే రీసెంట్‌గా మెదక్ జిల్లాలో ఒక స్కూలు బస్సుని రైలు ఢీకొనడంతో 18 మంది మరణించారు. వారిలో 16 మంది చిన్నారులే. ఈ దుర్ఘటన జరగగానే ఆర్టీఏ అధికారులలో ఎక్కడలేని కదలిక వచ్చింది. శుక్రవారం నాడు తెల్లవారగానే డ్యూటీలో దిగిపోయి ఒక్క హైదరాబాద్ పరిసరాల్లోనే 120 స్కూలు బస్సులను కండీషన్‌లో లేవంటూ సీజ్ చేశారు. ఈ తనిఖీలు, సీజ్‌లు ప్రమాదాలు జరగకముందు చేస్తే ప్రమాదాలనేవే జరగవనే కనీస జ్ఞానం అధికారులకు కొరవడుతోంది. ఇప్పుడు సీజ్ చేసిన 120 బస్సులు ఓ వారం పదిరోజులు గడిచిన తర్వాత, తడవాల్సిన వారి చేతులు తడిసిన తర్వాత మళ్ళీ రోడ్ల మీద తిరుగుతూనే వుంటాయి. మళ్ళీ ప్రమాదాలు మామూలుగానే జరుగుతూనే వుంటాయి. ఇంకోసారి ఆర్టీఏ అధికారుల తనిఖీలు, సీజ్ చేయడాలు షరా మామూలుగానే జరుగుతూనే వుంటాయి. ఈ ‘చక్ర’భ్రమణానికి అంతే లేదా!

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.