Publish Date:Jul 13, 2022
టూవీలర్ మీద గాళ్‌ఫ్రెండ్‌తో అలా రయ్‌మని వెళ్లే కుర్రకారంతా ఇయర్ సెట్ పెట్టుకుని మరీ పాటలు వింటూ అలా అలా తిరిగేస్తున్నారు. కార్లో ఆఫీసులకు వెళ్లేవారు, లాంగ్ డ్రైవ్‌కి వెళ్లేవారూ అంతే. ఈరోజుల్లో సినిమా పాటలు ఆ విధంగా బాగా పనికివస్తున్నాయి. హుషారుగా ప్రయాణించడానికి అదో మందు. ఉత్తేజా న్నిస్తున్న గొప్ప టానిక్! ఆ పాటల వినే మోజులో వీళ్లెవరికీ చాలాసార్లు స్పీడ్ బ్రేకర్ల ధ్యాసా వుండదు. ఆ కారణంగా ప్రమాదాలూ జరుగుతున్నాయి.
అమెరికాలో ఈ ప్రమాదాలను అరికట్టేందుకే కొన్ని ప్రాంతాల్లో స్పీడ్‌బ్రేకర్లను సంగీతం వినిపించే గీతలు గా చేస్తున్నారు. వాహన దారులకు ఇబ్బంది లేకుండా, పాటలు వింటూ వేగంగా వెళ్లేవారు ప్రమాదాలకు గురికాకుండా వుండేందుకు ఈ కొత్త మార్గం కనుగొన్నారు. అసలు రోడ్లే సంగీతం వినిపిస్తే!! అవును చాలా చిత్రంగా వుంది గదా ఈ ఆలోచన. ఇదేలా సాధ్యం? ఈ అసాధ్యాన్నే సుసాధ్యం చేశారు లాంకెస్టర్ సిటీ సరిహద్దుల్లో.
రోడ్లమీద ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతాల్లో కొన్నిచోట్ల స్పీడ్ బ్రేకర్ లాంటి గీతలు ఏర్పాటు చేస్తారు. కొన్ని రోడ్లు సంగీత ధ్వనులు ప్రసారం చేసేలా తయారు చేస్తున్నారట. వీనుల విందుగా సంగీతం వినిపించేలా కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధుర తరంగాలు వాహనాల చక్రాల మీంచి వాహనా ల్లోకి వచ్చి వాహనదారులకు వీనుల విందు చేస్తాయని హోండా సంస్థ అధికారులు తెలియజేశారు.
సంగీత ధ్వనులు ప్రసారమయ్యే విధంగా స్పీడ్ బ్రేకర్ గీతలు అమరుస్తారు. వీటిని స్లీపర్ లైన్స్ అంటారు. అయితే ఆ గీతలూ అన్ని ఒకే రకంగా శబ్దాన్ని వినిపించవు. ఒక్కోటి ఒక్కో రకంగా వీనులవిందు చేయడం ఇందులో విశేషం. దీనివల్ల వాహనదారులు ఆ చక్కటి సంగీతధ్వనులు వినగానే వేగాన్ని కూడా తగ్గించు కోను వీలవుతుందని సాంకే తిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం లాంకెస్టర్ సిటీ సరిహద్దుల్లో ప్రయోగా త్మకంగా ఏర్పాటు చేశారు. ఇది తప్పకుండా విజయవంతమవుతుందని అక్కడి ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. క్రమేపీ దీన్ని మన దేశంలో అమలుచేస్తే ప్రయాణాలు సుఖవంతమవుతాయి, అనేకానేక ప్రమాదాలు నివారించవచ్చు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/road-can-play-music-25-139619.html
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.