పాటలు వినిపించే రోడ్లు!
Publish Date:Jul 13, 2022
Advertisement
టూవీలర్ మీద గాళ్‌ఫ్రెండ్‌తో అలా రయ్‌మని వెళ్లే కుర్రకారంతా ఇయర్ సెట్ పెట్టుకుని మరీ పాటలు వింటూ అలా అలా తిరిగేస్తున్నారు. కార్లో ఆఫీసులకు వెళ్లేవారు, లాంగ్ డ్రైవ్‌కి వెళ్లేవారూ అంతే. ఈరోజుల్లో సినిమా పాటలు ఆ విధంగా బాగా పనికివస్తున్నాయి. హుషారుగా ప్రయాణించడానికి అదో మందు. ఉత్తేజా న్నిస్తున్న గొప్ప టానిక్! ఆ పాటల వినే మోజులో వీళ్లెవరికీ చాలాసార్లు స్పీడ్ బ్రేకర్ల ధ్యాసా వుండదు. ఆ కారణంగా ప్రమాదాలూ జరుగుతున్నాయి. అమెరికాలో ఈ ప్రమాదాలను అరికట్టేందుకే కొన్ని ప్రాంతాల్లో స్పీడ్‌బ్రేకర్లను సంగీతం వినిపించే గీతలు గా చేస్తున్నారు. వాహన దారులకు ఇబ్బంది లేకుండా, పాటలు వింటూ వేగంగా వెళ్లేవారు ప్రమాదాలకు గురికాకుండా వుండేందుకు ఈ కొత్త మార్గం కనుగొన్నారు. అసలు రోడ్లే సంగీతం వినిపిస్తే!! అవును చాలా చిత్రంగా వుంది గదా ఈ ఆలోచన. ఇదేలా సాధ్యం? ఈ అసాధ్యాన్నే సుసాధ్యం చేశారు లాంకెస్టర్ సిటీ సరిహద్దుల్లో. రోడ్లమీద ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతాల్లో కొన్నిచోట్ల స్పీడ్ బ్రేకర్ లాంటి గీతలు ఏర్పాటు చేస్తారు. కొన్ని రోడ్లు సంగీత ధ్వనులు ప్రసారం చేసేలా తయారు చేస్తున్నారట. వీనుల విందుగా సంగీతం వినిపించేలా కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధుర తరంగాలు వాహనాల చక్రాల మీంచి వాహనా ల్లోకి వచ్చి వాహనదారులకు వీనుల విందు చేస్తాయని హోండా సంస్థ అధికారులు తెలియజేశారు. సంగీత ధ్వనులు ప్రసారమయ్యే విధంగా స్పీడ్ బ్రేకర్ గీతలు అమరుస్తారు. వీటిని స్లీపర్ లైన్స్ అంటారు. అయితే ఆ గీతలూ అన్ని ఒకే రకంగా శబ్దాన్ని వినిపించవు. ఒక్కోటి ఒక్కో రకంగా వీనులవిందు చేయడం ఇందులో విశేషం. దీనివల్ల వాహనదారులు ఆ చక్కటి సంగీతధ్వనులు వినగానే వేగాన్ని కూడా తగ్గించు కోను వీలవుతుందని సాంకే తిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం లాంకెస్టర్ సిటీ సరిహద్దుల్లో ప్రయోగా త్మకంగా ఏర్పాటు చేశారు. ఇది తప్పకుండా విజయవంతమవుతుందని అక్కడి ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. క్రమేపీ దీన్ని మన దేశంలో అమలుచేస్తే ప్రయాణాలు సుఖవంతమవుతాయి, అనేకానేక ప్రమాదాలు నివారించవచ్చు.
http://www.teluguone.com/news/content/road-can-play-music-25-139619.html





