తమిళనాడులో రోడ్డు ప్రమాదం… ఐదుగురు ఏపీ వాసులు మృతి
Publish Date:Dec 5, 2025
Advertisement
తమిళనాడులో శనివారం (డిసెంబర్ 6) తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులూ కూడా ఏపీ వాసులే. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు తిరుచిరా పల్లి–సేలం జాతీయ రహదారిప్రమాదానికి గురైంది. ఈ ఏడుగురు యువకులూ ప్రయాణిస్తున్న కారును ఆపి రోడ్డు పక్కన విశ్రాంతి తీసుకుంటుండగా, లారీ అతి వేగంగా వచ్చి ఢీ కొంది. ఈ సంఘటనలో కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. సంఘటనా స్థలంలోనే ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మిగిలిన ఇద్దరూ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను విజయనగరం జిల్లా కొరప కొత్తవలస, మరుపల్లి గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. మృతులలో కొరప కొత్తవలస వాసులు వంగర రామకృష్ణ), మార్పిన అప్పల నాయుడు, మరాడ రాము, గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన బండారు చంద్రరావు ఉన్నారు.
http://www.teluguone.com/news/content/road-accident-in-tamilnadu-36-210564.html





