పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మంది దుర్మరణం
Publish Date:Jul 17, 2024
Advertisement
దక్షిణ అమెరికాలోని పెరూలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 మంది దుర్మరణం పాలయ్యారు. పెరూ రాజధాని లిమా నుంచి 40 మందికి పైగా ప్రయాణికుల తో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 200 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 26మంది మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయ పడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అక్కడి కాలమాన ప్రకారం బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనాస్థలా నికి చేరుకున్ని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఘాట్ రోడ్డుపై అతివేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
http://www.teluguone.com/news/content/road-accident-in-peru-25-180889.html





