క్రికెట్ ఆడటానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి..!

Publish Date:Jul 26, 2026

Advertisement

 

కూకట్‌పల్లిలో టిప్పర్ ఢీకొని యువకుల దుర్మరణం..!

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ స్కూటీని బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువ కుడు తీవ్రంగా గాయప డ్డాడు. మహేష్ (17), లక్ష్మీ తేజ (17)తో పాటు మరో యువకుడు ఆదివారం ఉదయం స్కూటీపై క్రికెట్ ఆడేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డుపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన టిప్పర్ లారీ వారి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. 

ఢీకొన్న వేగానికి స్కూటీ నుజ్జు నుజ్జు కాగా, మహేష్, లక్ష్మీ తేజ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో స్థాని కులు వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న కూకట్‌పల్లి పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివే గమే ఈ ప్రమాదానికి కారణమా అనే కోణంలో విచారణ చేపట్టారు. అలాగే ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొనగా, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు

By
en-us Political News

  
బీజేపీ ఎంపీ ఇంట్లో చెలరేగిన పొలిటికల్ రచ్చ..!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు విస్తృతంగా కురు స్తున్నాయి.
అదనపు కట్నం కోసం వేధించి, చంపేందుకు చూశారు.. సంచలన ఫిర్యాదు..!
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా నిర్వహిస్తున్న పోలీసులపై ఓ యువకుడు కారుతోనే దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం
మానవ మెదడు తరంగాలు Brain Waves ఫిజికల్ ఏఐ రంగంలో సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తున్నాయి. ఆలోచనల ద్వారా రోబోలను నియంత్రించే అధునాతన సాంకేతికత మరియు దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
బ్లూటూత్ సెక్యూరిటీ లోపాల వల్ల ఏకంగా 22 లక్షల కార్లు హ్యాక్ అయ్యే ప్రమాదంలో ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. KARR యాంటీ థెఫ్ట్ సిస్టమ్ ద్వారా కారు డోర్లు అన్‌లాక్ చేసే ముప్పుపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆనంద్ రాఠీ వెల్త్ Q1 FY27 ఆర్థిక ఫలితాలలో 24% లాభాల వృద్ధితో రూ. 116 కోట్ల నికర లాభాన్ని మరియు రూ. 1.06 లక్షల కోట్ల AUM మైలురాయిని సాధించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఎంఆర్‌ఎఫ్ MRF కంపెనీలో ప్రమోటర్ కుటుంబం ఎంత వాటా కలిగి ఉందో తెలుసుకోండి. మామ్మన్ ఫ్యామిలీ, రిటైల్ ఇన్వెస్టర్లు మరియు FIIల షేర్‌హోల్డింగ్ వివరాలతో కూడిన సమగ్ర కథనం!
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షపాతం లోటు కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్‌నినో పరిస్థితులను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తూ రైతుల పంటలను రక్షించేందుకు సమగ్ర కార్యాచరణ
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే శాకంబరీ మహోత్సవాలు జూలై 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరగనున్నాయి
టీ20 ఫార్మాట్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు మెరుపు ఆరంభం ఇవ్వడమే తన లక్ష్యమని సూర్యవంశీ చెప్పాడు. ఈ సిరీస్ లో సూర్యవంశీ రెండు హాఫ్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గత నాలుగేళ్లుగా సరికొత్త రికార్డులు సృష్టించిన ఆపిల్ ఐఫోన్ సేల్స్ 3% క్షీణించాయి. ఐఫోన్ 17 స్టాక్ కొరత, మార్కెట్ సవాళ్లు మరియు భారతదేశంలో ఆపిల్ సాధిస్తున్న బిలియన్ డాలర్ల ప్రయాణంపై సమగ్ర కథనం ఇక్కడ చదవండి.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్, యువ సంచలనం, బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ ఆట స్వరూపాన్నే మార్చివేశాడు. వైభవ్ మైదానం నలుమూలలా విరుచుకుపడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 49 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు సాధించాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.