విద్యుత్ బ‌కాయిల‌పై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ హెచ్చ‌రిక‌

Publish Date:Aug 23, 2022

Advertisement

చుట్టంలాగా వ‌చ్చాడ‌ని చెప్పాల్సిన  నాలుగు మాట‌లు  చెప్ప‌కుండా ఎలా ఉంటారు. మ‌న‌వాడు మ‌న‌సు గాయ‌ప‌డుతుంది, ఇంటికి వెళ్లాక తీరిగ్గా చెబుతామంటే అదేమ‌న్నా చిన్న స‌మ‌స్యా.. అందుకే నిక్క‌చ్చిగా తేల్చి చెప్పారు, కేంద్ర మంత్రి రాజ్‌కుమార్ సింగ్‌. 

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఈసారి గ‌ట్టిగానే మొట్టికాయ‌లు తినే వ‌చ్చార‌నాలి. ప్ర‌ధాని మోదీని క‌లిసి బొకే ఇచ్చి చిర్న‌వ్వులు చిందించినా, ఆ త‌ర్వాత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్ మాత్రం సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీలు విద్యుత్ బ‌కాయిలు 75 రోజుల్లో చెల్లిం చా లని లేక‌పోతే విద్యుత్‌ కొనుగోలు చేసే అవకాశాన్ని కోల్పోతాయని మంత్రి హెచ్చ‌రించారు. 

సోమవారం (ఆగ‌ష్టు 22)ఢిల్లీలో ఆర్కేసింగ్‌తో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ భేటీ అయ్యారు. సుమారు అర్ధగంట పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. అనంతరం.. ఆర్కేసింగ్‌ విలేకరులతో మాట్లాడారు. విద్యుత్‌ రంగా నికి సబంధించిన పలు సమస్యలపై ఇద్దరం చర్చించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు రూ.6 వేల కోట్ల విద్యుత్‌ బకాయిలు రావలసి ఉందని ఈ సమస్య తొందరగా పరిష్క రించేందుకు చొరవ చూపాలని జగన్‌ కోరారని తెలిపారు. 

అయితే ప్రస్తుతం ఈ విషయం సొలిసిటర్‌ జనరల్‌ వద్ద ఉదందని, త్వరలో దీనిపై ఒక నిర్ణయం తీసు కుంటామని హామీ ఇచ్చారు. చట్ట ప్రకారం ఎవరు బకాయిలు  చెల్లించాలనే దానిని పరిష్కరిస్తామని కూడా చెప్పారు. పవర్‌ ఎక్స్చేంజీల్లో కొనుగోళ్ల బకాయిలపై సమాచారంలో పొరపాట్లు లేవని ఆర్కే సింగ్‌ స్పష్టం చేశారు. 

By
en-us Political News

  
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.