బీపీ ఎక్కువైతే ఏకంగా ఇన్ని ప్రమాదాలు ఉంటాయని తెలుసా?

Publish Date:Jan 12, 2024

Advertisement

అధిక రక్తపోటు అంటే హైపర్‌టెన్షన్ అనేది నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి. రక్తపోటు సాధారణ పరిమితిని మించిపోయినప్పుడు  శరీర అవయవాలను  ప్రభావితం చేస్తుంది. అధిక రక్తపోటు రోగులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. సాధారణ అధికరక్తపోటు ఉన్నవారికి గుండెపోటు సమస్య పొంచి ఉంటుందని అంటారు. అయితే కేవలం గుండె మాత్రమే కాకుండా మరిన్ని విషయాల మీద బీపీ ప్రభావం ఉంటుంది.  బీపీ ఎక్కువైతే శరీరంలో ఏ ఏ అవయవాల మీద దారుణమైన ప్రభావం ఉంటుందో తెలుసుకుంటే వాటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

గుండె సంబంధ సమస్యలు..

రక్తపోటు పెరగడం  గుండెకు అస్సలు మంచిది కాదు, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, స్ట్రోక్,  హార్ట్ ఫెయిల్యూర్‌తో సహా హైపర్‌టెన్షన్ గుండెకు పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుంది.  రక్తపోటు పెరిగినప్పుడు   గుండె వేగం పెరుగుతుంది. ఈ సమయంలో శరీరంలోని మిగిలిన భాగాలకు  రక్తం ప్రవహించడం కష్టం అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో హార్ట్ అటాక్ సమస్య వస్తుంది.

కరోనరీ ఆర్టరీ..

కరోనరీ ఆర్టరీ  అనేది గుండె సంబంధిత సమస్య. అధిక రక్తపోటు కారణంగా ధమనులు ఇరుకుగా మారి దెబ్బతింటాయి.  దీని కారణంగా  గుండె నుండి రక్తాన్ని సరఫరా చేయడంలో ఇబ్బంది పడతాయి. ఇలాంటి  పరిస్థితిలో గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది.

కంటి సమస్యలు..

హైపర్‌టెన్షన్ కంటిలో రక్తస్రావాన్ని ప్రభావితం చేయడం ద్వారా రెటినోపతి,  గ్లాకోమా వంటి కంటి సమస్యలను కలిగిస్తుంది. గ్లాకోమా అనేది కంటిలోపల రక్తపోటు పెరగడం వల్ల వచ్చే కంటి వ్యాధి. గ్లాకోమాకు హైపర్‌టెన్షన్ ఒక ముఖ్యమైన ప్రమాద కారకంగా వైద్యులు చెబుతున్నారు.

మానసిక సమస్యలు..

రక్తపోటు వల్ల మొదట గుండెకు ముప్పు కలిగినా గుండె తర్వాత ఇది  మెదడుకు  పొంచి ఉంటుంది. హైపర్‌టెన్షన్ మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  స్ట్రోక్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. అధిక రక్తపోటు కారణంగా జ్ఞాపకశక్తి కోల్పోవచ్చు. మెదడుకు రక్తం,  ఆక్సిజన్ సక్రమంగా ప్రసరణ కావడం  అవసరం.కానీ అధిక రక్తపోటు  ఈ ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా  తీవ్రమైన మానసిక  సమస్యలు  తలెత్తుతాయి.

మెటబాలిక్ సిండ్రోమ్..

అధిక రక్తపోటు  మెటబాలిక్ సిండ్రోమ్‌ సమస్యను కలిగిస్తుంది. ఇది మధుమేహం, ఊబకాయం,  కొలెస్ట్రాల్ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలన్నింటినీ నివారించడానికి, రక్తపోటుకు  సకాలంలో చికిత్స తీసుకోవడం  చాలా ముఖ్యం.

                                      *నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.