Publish Date:Jul 14, 2022
భారత సంతతికి చెందిన వారు విదేశాల్లో రాజకీయాల్లో చక్రం తిప్పడం ఈమధ్య వింటున్నాం. అమెరికా లో, బ్రిటన్‌లోనూ భారత సంతతికి చెందినవారినే వారి మంత్రిమండలిలో కీలక పదవుల్లోకి తీసుకోవడం భారత్‌కు ఎంతో గర్వకారణం. ఇపుడు తాజాగా రిషి సునాక్ ఏకంగా బ్రిటన్ ప్రధాని పీఠాన్ని ఎక్కడానికి అవకాశాలున్నాయని తెలుస్తోంది. బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ స్థానాన్ని భర్తీ చేసేదెవరనేది తేల్చేం దుకు ఎన్నికలు మొదలయ్యాయి.
జాన్సన్ ప్రధానిగా వున్నపుడు ప్రీతీ పటేల్‌ను హోం సెక్రటరీగా, అలోక్ శర్మను ఇంటర్నేషనల్ డెవల ప్మెంట్ సెక్రటరీగా, రిషి సునాక్‌ను ట్రజరీ ఛీఫ్ సెక్రటరీగా బ్రిటన్ రాణి నియమించారు. అప్పట్లో ఆయన కొత్త ఛాన్సలర్ సాజిద్ జావిద్ వద్ద పనిచేశారు. అనంతరం జరి గిన రాజకీయ పరిణామాల్లో జాన్సన్ తన పదవి కోల్పోయారు. ఇపుడు ప్రధాని రేసులో వున్న ప్రముఖ నాయకులలో రిషి ఒకరు. పటేల్ యుకే సెక్యూరిటీ, ఇమిగ్రేషన్, వీసా పాలసీల ఇన్‌ఛార్జ్‌గా వున్నారు. కాగా 39 ఏళ్ల కన్సర్వేటివ్ పార్టీ ఎంపి రిషి ఇన్‌ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కుమార్తె అక్షతను వివాహం చేసుకున్నారు. ఆమె ఎంబిఏ చదివారు, పెట్టుబడుల అంశంలో నిపుణురాలుగా సుపరిచితురాలు.
భారత సంతతికి చెందిన రిషి సునాక్ (42) బ్రిటన్ ప్రధాని పీఠమెక్కబోయే కీలకమైన కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నిక రేసులో ముందున్నారు. తొలి రౌండ్ లో ఆయన ఆధిక్యం సాధించారు. అత్యధికంగా 88 మంది పార్టీ ఎంపీల ఓట్లను గెలుచుకోగా.. ప్రధాన పోటీదారు పెన్నీ మోర్డంట్ 67 ఓట్లతో గట్టి పోటీ ఇస్తున్నారు. మిగతా అభ్యర్థులైన లిజ్ ట్రస్ (50 ఓట్లు), కేమీ బదెనోక్ (40)తో పాటు భారత సంతతికి చెందిన అటార్నీ జనరల్ సుయెల్లా బ్రేవర్మన్ (32) కూడా తొలి రౌండ్‌లో మంచి ఫలితాలనే సాధించారు. ఇదిలా ఉంటే, కనీసం 30 మంది ఎంపీల మద్దతు కూడగట్టడంలో విఫలమైన నదీం జహావీ, జెరెమీ హంట్ రేసు నుంచి నిష్క్రమించారు. అలా ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో మిగిలారు.
ఎంపీల మద్దతులో రిషి దూసుకుపోతుండగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో పెన్నీకి మద్దతు పెరుగుతున్నట్టు వస్తున్న సమాచారంతో ఎన్నికపై ఉత్కంఠత పెరిగిపోతుంది గురువారం కన్జర్వేటివ్ ఎంపీలు తమ ఫేవ రెట్ అభ్యర్థులను ఎన్నుకుంటారు. జూలై 21కల్లా ఇద్దరు అభ్యర్థులు మాత్రమే మిగులుతారు. టాప్ 2 లో ఉన్న రిషి, పెన్నీయే రేసులో ఉంటారని అంచనా. తర్వాత 2 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో అత్యధిక మంది సపోర్ట్ కూడగట్టుకునే వారే పార్టీ నేతగా ఎన్నికై సెప్టెంబర్ 5న ప్రధాని పదవిని అందు కుంటారు. కాగా, ప్రధాని రేసులో నిలిచే అభ్యర్థులకు కనీసం 20 మంది ఎంపీల మద్దతు ఉండాలి. పలు రౌండ్లలో జరిగే ఓటింగ్‌లో కనీసం 30 ఓట్లు సాధించని అభ్యర్థులు పోటీ నుంచి ఎలిమినేట్ అవుతారు. ఇలా చివరకు తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారిలోంచి ఒకరిని ప్రధానిగా ఎన్నుకుంటారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rishi-leading-in-pm-race-25-139716.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.