రుషికొండ ప్యాలెస్ నిర్వహణ బాధ్యతలు టాటా గ్రూప్ కు?

Publish Date:Jun 19, 2024

Advertisement

సీఎంగా మాజీ ముఖ్యమంత్రి జగన్  హయాంలో జరిగిన అవకతవకలు, నిష్పూచీగా తీసుకున్న నిర్ణయాలు, అవలంబించిన విధానాల కారణంగా రాష్ట్రం 20 ఏళ్లు వెనుకబడింది. బాధ్యత లేని వ్యక్తులు పాలకులు రాష్ట్రం ఏ స్థాయిలో వెనుకబడుతుందో  జగన్ హయాంలో ఏపీ పరిస్థితిని చూస్తే అర్ధమౌతుంది.  జగన్  నిర్వాకాల కారణంగా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కొత్తగా కొలువుదీరిని కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా రుషికొండకు బోడి గుండు కొట్టేసి, ఆ కొండపై గతంలో ఉన్న రిసార్టును కూల్చేసి  మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కట్టించిన ప్యాలస్ ఎందుకూ కొరగాకుండా ఉంది. ప్రజలకు ఉపయోగపడే కట్టడాలను కూల్చేసి మళ్లీ టూరిజం ప్రాజెక్టు కడతామంటూ అబద్ధాలు చెప్పి, అత్యంత రహస్యంగా అక్కడో రాజభవనం లాంటి ప్యాలెస్ కట్టేసింది. ఇప్పుడు జగన్ సర్కార్ కూలిపోయింది. కూటమి సర్కార్ కొలువుదీరింది. జగన్ పదవీచ్యుతుడైన తరువాతే రుషికొండ రాజభవనం రహస్యాలు బయటకు వచ్చాయి.  జనం డబ్బుతో జగన్ తన జల్సాల కోసం కట్టుకున్న ప్యాలెస్ అన్నది వెల్లడైంది.  జనం విస్తుపోయారు. ఎన్నికల ముందే ఈ బండారం బయటపడి ఉంటే.. జగన్ పార్టీకి ఆ పదకొండు స్థానాలూ కూడా వచ్చి ఉండేవి కాదని అంటున్నారు. సరే అదంతా పక్కన పెడితే..

ఇప్పుడా ప్యాలెస్ ను ఏం చేయాలన్నది కొత్త ప్రభుత్వం ముందున్న సమస్య. స్టార్ హోటల్ గా చేద్దామంటే ఆ ప్యాలెస్ లో ఉన్నది 12 బెడ్ రూంలే.  టూరిజం భవనంగానూ పనికిరాదు. పోనీ సీఎం విశాఖ క్యాంప్ ఆఫీసుగా వినియోగిద్దామంటే సింప్లిసిటీకి ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు అంత ఖరీదైన ప్యాలెస్ ను వినియోగించడానికి అంగీకరించరు.  550 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టిన ఆ భవనాన్ని  ఉపయోగకరంగా మార్చాలంటే ఏం చేయాలి? ఎవరికీ అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ విలాస భవనం వినియోగం విషయంలో టాటా గ్రూప్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.  ఎందుకంటే టాటా గ్రూపు మూడు బ్రాండ్ల కింద హోటల్స్ ను నడుపుతోంది. అందులో పెద్ద బ్రాండ్  ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్. ఆ కంపెనీకి ఈ రుషికొండ ప్యాలెస్ నిర్వహణ బాధ్యత అప్పగించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.  

ఈ మేరకు ఇప్పటికే టాటా గ్రూప్ లో సంప్రదించినట్లు చెబుతున్నారు. అలా టాటా గ్రూప్ కు అప్పగించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని అన్నా క్యాంటీన్లకు వినియోగించాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.   

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.