హామీల అమలు .. బాబు ముందు భారీ టాస్క్!

Publish Date:Jun 19, 2024

Advertisement

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముందు భారీ టాస్క్ ఉంది. జగన్  తన అరాచక పాలనతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసేశారు. పాలన సాగించేందుకు అవసరమైన రోజు వారీ సొమ్ము కోసం కూడా అప్పులపైనే అధారపడేంత అద్వాన్నంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చేశారు. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కొలువుతీరడంతో  చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాల్సి ఉంటుంది.

అంత కంటే ముందు ఆయన ఎదుట భారీ టాస్క్ ఒకటి ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జూలై మొదటి తేదీకి వృద్ధాప్య పింఛన్లు చెల్లించాల్సి ఉంది. అలాగే ఉద్యోగుల జీతాలు చెల్లించాల్సి ఉంది. ఈ రెండింటికీ రూ.11500కోట్లు సమీకరించాల్సి ఉంది. చంద్రబాబు ఉద్యోగుల జీతాలు 1వతేదీన వేస్తారని పేరు ఉంది. దాన్ని ఆయన అధికారంలో వచ్చిన తరువాత మొదటి నెలలోనే నిలుపుకోవాల్సిఉంది. జీతాలు రూ.6000కోట్లు కావాల్సిఉంది. అలాగే వృద్ధాప్య పింఛన్లకు రూ.5500కోట్లు కావాలి.  జులై 1వతేదిన  ఏప్రిల్ నెలలనుంచి వేయి చోప్పున మూడు నెలలకు మూడువేలు, జులై నెలది నాలుగువేలు కలిపి మొత్తం రూ.ఏడువేలు ఇస్తామని బాబు హామీ ఇచ్చారు.

అలాగే  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాల్సి ఉంది. తెలంగాణలో లాగా ఆర్టీసీకి ప్రతినెల ఉచిత ప్రయాణ ఖర్ఛును చెల్లించాలి. అలాగే 18ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న హామీ  ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను ఇస్తామని హామీ , రైతులకు పెట్టుబడి రూ.20వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పింది.ఖరీఫ్ సీజన్ ముంచుకొచ్చింది కావున రైతులకు వెంటనే ఇవ్వాల్సిఉంది.  ఇవే కాక విద్యాదీవెన పథకం. ఈ పథకం కింద తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ చెల్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక  నిరుద్యోగ భృతి నెలకు రూ.3000 ఇస్తామని హామీ ఇచ్చారు.అదీ వెంటనే ప్రారంభించాల్సి ఉంది. వీటన్నింటినీ అమలు చేయాలంటే రూ.1.75లక్షల కోట్లు అవసరం.

ఇక మెగా డీఎస్సీ నియామకాలు జరిగితే వేతనాల భారం మరింత పెరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు ముందున్న టాస్క్ నిధుల సమీకరణ. చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన గతంలో అలా చేసి చూపించారు. అయితే ఇప్పుడు సమస్య ఏమిటంటే.. జగన్ హయాంలో అరకొర సంక్షేమంతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. ఇప్పుడు చంద్రబాబు అభివృద్ధి కోసం ప్రణాళికలు అమలు చేసి రచించినా, వాటి ఫలాలు అందిరావడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఇచ్చిన హామీల అమలు మాత్రం సత్వరమే ఇంకా చెప్పాలంటే వెంటనే జరగాల్సి ఉంటుంది.  అదే ఇప్పుడు సీబీఎన్ ముందున్న పెద్ద సవాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.