ఉద్ధవ్ శివసేనలో తిరుగుబటు?

Publish Date:Jun 17, 2026

Advertisement

మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.  గతంలో శివసేనను నిలువునా చీల్చిన ఏక్‌నాథ్‌ షిండే, ఇప్పుడు ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన  విభాగానికి మరో భారీ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన పలువురు  లోక్‌సభ సభ్యులు షిండే నేతృత్వంలోని  శివసేనతో   సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పరిణామాలు మరవకముందే..  ఇప్పుడు మహారాష్ట్రలో  అదే  తరహా రాజకీయ ప్రకంపనలు  దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. 

ఉద్ధవ్ శివసేన హైకమాండ్  తమ పార్టీ లోక్‌సభ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పుడు వారి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్‌  రావడంతో ఉద్ధవ్‌ ఠాక్రే శిబిరంలో  ఆందోళన, అలజడి మొదలైంది. పరిస్థితి చేతులు దాటిపోకముందే అప్రమత్తమైన ఉద్ధవ్‌ ఠాక్రే, స్వయంగా రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.  

రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ మేరకు. శివసేన (ఉద్దవ్ ) పార్టీకి చెందిన ఆరుగురుర ఎంపీలు,  ఇప్పుడు అధికార శివసేన వైపు చూస్తున్నారు. సంజయ్‌ దినా పాటిల్‌, సంజయ్‌ దేశ్‌ముఖ్‌, నగేశ్‌ పాటిల్‌ అష్టికర్‌, ఓంరాజే నింబాల్కర్‌, భౌసాహెబ్‌ వక్చౌరే,   సంజయ్‌ జాధవ్‌ లు షిండే వర్గంతో నిరంతరం టచ్‌లోకి వెళ్లినట్లు చెబుతున్నారు.  వీరితో పాటు రాజాభౌ వాజే పేరు కూడా ఈ తిరుగుబాటు జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఉద్ధవ్ ఠాక్రేకు లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నఎంపీలలో  సగానికి పైగా బలం చేజారిపోయే ప్రమాదం పొంచి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

శివసేన (ఉద్దవ్) ఎంపీలు ఢిల్లీలో ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు, లోక్‌సభ సభ్యుడు  శ్రీకాంత్‌ షిండే అధికారిక నివాసంలో రహస్యంగా సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ సమావేశంలో  విలీన వ్యూహాన్ని ఖరారు చేసుకున్న అనంతరం.. వీరంతా కలిసి,  లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్లమెంటులో పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక పార్లమెంటరీ వర్గాన్ని ఏర్పాటు చేయాలని వీరు స్పీకర్ ను కోరే అవకాశం ఉందంటున్నారు.  ఆ తర్వాత చట్టబద్ధంగా షిండే నేతృత్వంలోని  శివసేనలో ఈ గ్రూపును విలీనం చేసే ప్రక్రియను పూర్తి చేయాలని వ్యూహం పన్నినట్లు చెబుతున్నారు. 

మరోవైపు అ షిండే వర్గం ఈ పరిణామాలను బాహాటంగానే సమర్థిస్తోంది. మహారాష్ట్ర మంత్రి ప్రతాప్‌ సార్నాయక్‌ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. దివంగత బాల్‌ ఠాక్రే ఆశయాలను, సిద్ధాంతాలను నిజాయితీగా నమ్మి, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే సమర్థవంతమైన నాయకత్వంపై విశ్వాసం ఉంచే ఏ నాయకుడికైనా శివసేన తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన అన్నారు.  తిరుగుబాటు ఆలోచనతో వస్తున్న ఎంపీలను తాము సాదరంగా ఆహ్వానిస్తామని ఆయన ప్రకటించడంతో విలీన ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. 

అయితే..  ఎంపీ సంజయ్‌ రౌత్‌.. ఈ తిరుగుబాటు వార్తలన్నీ   మైండ్ గేమ్‌లో భాగమేనని, తమ పార్టీ ఎంపీలంతా  ఉద్ధవ్‌ ఠాక్రే వెంటే   నిలబడతారని స్పష్టం చేశారు. అదే సమయంలో అధికార పక్షంపై ఆయన సంచలన ఆరోపణలు గుప్పించారు. తమ పార్టీకి చెందిన ఎంపీలను ప్రలోభపెట్టి కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికీ ఏకంగా  15 కోట్ల చొప్పున   ఆఫర్ చేస్తున్నారని సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు.  

By
en-us Political News

  
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
ప్రముఖ సామాజిక విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రుషికొండ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ఈ విలాసవంతమైన భవనాన్ని కేవలం ఆలోచనలకే పరిమితం చేయకుండా.. తక్షణమే ప్రజోపయోగంలోకి తీసుకురావాలన్నారు.
సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలో 1 నుంచి 8000 లోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కలేదనీ, 8000 దాటి ఆ పైన దారుణమైన ర్యాంకులు వచ్చిన వారికి ఉద్యోగాలు కేటాయించారనీ, ఈ విషయాన్ని బాధితులే తనతో స్వయంగా చెప్పారనీ రవిశంకర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే.. వైసిపి నాయకులు విమర్శలతో చెలరేగిపోయారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు అలవాటుగా తన నోటికి పని చెప్పారు
బీజేపీ, ఎన్‌డీఏ నైతిక మద్దతుతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నత్వానీ.. ఇండియా కూటమికి గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల కంటే అధికార కూటమికే స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను మట్టికరిపించి నత్వానీ విజేతగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది.
2024 ఎన్నికలలో పరాజయం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని.. ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన దశకు చేరుకున్నాయి
ఈ భవనాన్ని అలాగే వదిలేయడం వల్ల ఇప్పటివరకు 6 కోట్ల రూపాయల ప్రజాధనం బుడిదలో పోసిన పన్నీరైందన్నారు.
సూర్యనారాయణ రెడ్డికి సొంతంగా మాట్లాడే శక్తి లేదని, చేతిలో స్క్రిప్ట్ ఉంటే తప్ప ఆయన ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడలేరని ఎద్దేవా చేశారు. ఆయన ప్రవర్తనను సినీ నటుడు బ్రహ్మానందం హావభావాలతో పోలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.