ఆర్టీజీఎస్ ద్వారా శాఖల సమీక్ష.. ప్రభుత్వ సేవల్లో జవాబుదారీతనం పెంచడమే లక్ష్యం!

Publish Date:Feb 23, 2026

Advertisement

ఏపీ ప్రభుత్వం పారదర్శక పాలన దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, వేగం, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు, టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సోమవారం (ఫిబ్రవరి 23) రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ద్వారా వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ముఖ్యమైన అంశాలపై  చర్చించారు. ఇకపై ఉద్యోగుల పనితీరును శాస్త్రీయంగా విశ్లేషించి వారికి వెయిటేజ్ ఇస్తారు. అద్భుతమైన పనితీరు కనబరిచే అధికారులకు, సిబ్బందికి ప్రభుత్వం నుంచి అధికారికంగా అభినందన లేఖలు అందజేస్తారు. ఇది ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతుందని సీఎం ఆకాంక్షించారు.

ఆస్పత్రుల్లో వైద్యుల కొరత లేకుండా చూడాలని, రోగులకు మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి నాణ్యతను పరీక్షించేందుకు మొబైల్ ల్యాబ్స్ అందుబాటులోకి తేవాలని, తద్వారా పలు వ్యాధులను అరికట్టవచ్చని సూచించారు. రెవెన్యూ శాఖలో పారదర్శకత పెంచాల్సిన అవసరం ఉందని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవలందించేలా ఆ శాఖకు సరికొత్త రూపు తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. ఇకపై ఆర్టీజీఎస్ ద్వారా ప్రతి శాఖ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. ప్రభుత్వం టెక్నాలజీ ద్వారా అందిస్తున్న సేవలను సామాన్యులు కూడా సులభంగా వినియోగించుకునేలా ప్రత్యేక అవగాహన కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు.

By
en-us Political News

  
మూసీ పునరుజ్జీవన పథకం లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు కోసం భూసేకరణ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసి, అభిప్రాయ సేకరణ కోసం సమావేశాలను కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి, సీఎంవోను ట్యాగ్ చేస్తూ ఓ పోస్టు పెట్టారు.
భువన ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. అయితే  భువన మృతి చెందిన విషయాన్ని హాస్టల్ యాజమాన్యం ఆలస్యంగా తమకు తెలిపిందని, పోలీసులకు కూడా వెంటనే సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  
అదే పులి అంతలోనే మళ్లీ జనావాసాలవైపుగా కదలడం ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ పులి సంచారాన్ని రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు గుర్తించారు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఇక్కడ నుంచి రిలీవ్ అయి బీహార్ కువెళ్లారు. ఆయనను ఇప్పుడు బీహార్ లో అరెస్టు చేసిన పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్ కోరుతూ బీహార్ కోర్టును ఆశ్రయించారు. అయితే సునీల్ నాయక్ కు ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చేందుకు బీహార్ కోర్టు నిరాకరించింది.
క్షతగాత్రుల పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనాకి వచ్చారు.
రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ సీ90 ఎయిర్ అంబులెన్స్ నిన్న రాత్రి రాంచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. తీవ్ర గాయాలపాలైన సంజయ్ కుమార్ అనే రోగికి మెరుగైన చికిత్స అందించేందుకు ఢిల్లీకి తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
తనను రకీబ్, సోహైల్, రస్సెల్ అనే ముగ్గురు అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించింది. తనను చిత్రహింసలకు గురిచేసి గాయపరిచినట్లు తెలిపింది. ప్రస్తుతం బాధితురాలు భోలా సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
కల్తీ పాల కారణంగా రాజమహేంద్రవరం చౌడేశ్వరనగర్, స్వరూప్ నగర్ లకు చెందిన నలుగురు వ్యక్తులు ఇప్పటికే మృతి చెందారు. వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు.
ఒకప్పుడు ఎల్ మోంచో కూడా పోలీసే. 1980ల్లో అందరు మెక్సికన్ యువకుల్లాగానే.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి.. కాలిఫోర్నియాలో హెరాయిన్ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. కొన్నాళ్ల పాటు అమెరికన్ జైళ్లలో జైలు శిక్ష అనుభవించిన ఇతడ్ని ఆ తర్వాతి కాలంలో మెక్సికోకి అప్పగించింది. స్వదేశానికి వచ్చిన కొత్తల్లో మోంచో మంచి బాలుడిలా పోలీసు జాబులో చేరాడు. ఆ తర్వాత డ్రగ్ మాఫియాతో చేతులు కలిపాడు.
ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో జరిగింది. తండ్రి తనను నీట్ పరీక్షకు సిద్ధం కావాలికి పదేపదే చెబుతుండటాన్ని ఆ కొడుకు సహించలేకపోయాడు. తుపాకితో తండ్రిని కాల్చి చంపడమే కాకుండా, మృతదేహాన్ని ముక్కలు చేసి ఇంట్లోని డ్రమ్ములో దాచిపెట్టాడు.
ఇరాన్ పై అమెరికా ఏ క్షణమైనా దాడి చేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ సిటిజన్స్ కు అక్కడి భారత ఎంబసీ కూడా అడ్వైజరీ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రవాసులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ ప్రకటనలో కోరారు.
దాదాపు రెండు అడుగుల మేరకు మంచు పేరుకుపోయింది. న్యూయార్క్ నగరంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.