నయీంతో పోలిక..

Publish Date:May 5, 2023

Advertisement

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర యాదాద్రి జిల్లాలో కొనసాగుతోంది. గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ జరిగా సంవత్సరాలు గడుస్తున్నా అతని డైరీని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ముందు ప్రవేశ పెట్టడం లేదని భట్టి ఆరోపిస్తున్నారు. ప్రజల నుంచి  దోచుకున్న బంగారం,నగదు, భూములను తిరిగి ప్రజలకే ముట్టజెప్పాలని భట్టి వాదన. నయీం సంపాదించిన ఆస్తులను అతని కుటుంబ సభ్యులు, ముఠాసభ్యులే అనుభవిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నిందిస్తుంది. 
  నయీం చోటామోటా గ్యాంగ్ స్టర్ కాదు. గుజరాత్ లో సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్లో నయీం పాత్ర కీలకం. సోహ్రబుద్దీన్ తో నయీంకు ఉన్న పరిచయంతోనే గుజరాత్ పోలీసులకు ఇన్ ఫార్మర్గా మారి ఎన్ కౌంటర్ చేయించినట్లు సమాచారం.   నయీంను షాద్ నగర్ లో 2016 ఆగస్టులో ఎన్ కౌంటర్ చేశారు.     తెలంగాణ పోలీసులు . ఎపిసిఎల్ సి నేత  కరణం పురుషోత్తం హత్య కేసులో నయీం ముద్దాయిగా  ఉన్నాడు. ఐపీఎస్ అధికారి కెఎస్ వ్యాస్ హత్య కేసులో నయీం ముద్దాయి. నయీం ఎన్ కౌంటర్ జరిగి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం నయీం డైరీని బయట పెట్టడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  నయీంకు బీఆర్ ఎస్ ప్రభుత్వానికి పెద్ద తేడాలేదని మిలియన్ మార్చ్ పాదయాత్రలో భట్టి సంచలన ఆరోపణ చేశారు. నయీం దోచుకున్న తీరులోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని భట్టి అంటున్నారు.    మార్చి 16న యాత్ర ప్రారంభమై మొత్తం 90 రోజుల పాటు యాత్ర సాగనుంది. 39 నియోజకవర్గాల్లో భట్టి కలియ తిరుగుతున్నారు. భట్టి దాదాపు 1,365 కిలో మీటర్ల మేర పాదయాత్ర జరపనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర తర్వాత భట్టి చేపడుతున్న పాదయాత్ర రెండో అతి పెద్ద యాత్ర అని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి 50 అసెంబ్లీనియోజకవర్గాల్లో పర్యటించారు. 5 బహిరంగ సభలు నిర్వహించారు. భట్టి దళిత కమ్యూనిటీ నుంచి వచ్చారు. మునుపటి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. భట్టి చేపట్టిన పాదయాత్ర ఖమ్మం జిల్లాలో జూన్ 15న ముగుస్తుంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను స్పూర్తిగా తీసుకుని భట్టి ఈ యాత్రను చేపట్టారు. గడప గడపకు పాదయాత్ర వెళ్లడం వల్ల ప్రజా సమస్యలు తెలుసుకోవచ్చని ఎ ఐసీసీ భావిస్తుంది. రాష్ట్రంలోబీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ఇస్తున్న బూటకపు వాగ్దానాలను కాంగ్రెస్ ఎండగట్టడానికి ఈ పాదయాత్ర దోహదపడుతుంది. ఇరు ప్రభుత్వాలు యువత కు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఈ యాత్రలో ఆరోపిస్తుంది. తెలంగాణ ఏర్పాటు కాకమునుపు 12 లక్షల మంది ఉన్న నిరుద్యోగులు ప్రస్తుతం 30 లక్షలకు చేరుకున్నారని కాంగ్రెస్ లెక్కలేసి చెప్పింది. 

భట్టి విక్రమార్క  కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.  విద్యార్థులు కొలువులు రాక ఇబ్బందులు పడుతుంటే కేసిఆర్ అద్భుతంగా సెక్రటేరియట్ కట్టామని మట్లాడటం బాధాకరమన్నారు. నిజాం రాచరిక నియంతృత్వ నిరంకుశ మనస్తత్వం కలిగిన కేసీఆర్ ను గద్దె దించటానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో ప్రజలు మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. దివంగత నేత వైఎస్ ఆర్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర వల్లే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో రాగలిగింది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలో రావడానికి ఈ పాదయాత్ర దోహదపడుతుందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. 
 

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.