రేవంత్ దెబ్బ‌కు కాంగ్రెస్‌లో క‌ట్ట‌ప్ప‌లు విల‌విల‌!

Publish Date:Oct 5, 2024

Advertisement

కాంగ్రెస్ పార్టీలో క‌ట్ట‌ప్ప‌ల జాబితా ఎక్కువే ఉంటుంది.. ఇప్పుడ‌నే కాదు.. గ‌తంలోనూ ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. కాంగ్రెస్ లో ఉంటూ పార్టీలో సీనియ‌ర్ నేత‌ల‌మ‌నే ట్యాగ్ త‌గిలించుకొని ఇత‌ర పార్టీల‌కు స‌హాయ‌ స‌హ‌ కారాలు అందించ‌డం వారికి అల‌వాటుగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావం త‌రువాత కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు కేసీఆర్ తో స‌న్నిహితంగా ఉంటూ వ‌చ్చారు. పైకి మాత్రం తాము కాంగ్రెస్ పార్టీలో ద‌శాబ్దాలుగా ఉంటున్నాం, పార్టీకి ఎన‌లేని సేవ‌లు అందించామ‌ని చెప్పుకుంటూ పెత్త‌నం చెలాయించేవారు. అధికారంలోలేని ప‌దేళ్ల కాలంలో వీరి ఆట‌లు సాగాయి. కానీ, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత తెర‌ వెనుక పార్టీకి ద్రోహం చేస్తున్న‌వారికి చెక్‌పెడుతూ వ‌స్తున్నారు. బీఆర్ఎస్ ప‌దేళ్ల‌ హయాంలో కొంద‌రు పార్టీ సీనియ‌ర్లు కేసీఆర్‌తో స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉండ‌టంతో పాటు.. త‌మ స‌న్నిహితుల‌కు ప్ర‌భుత్వం నుంచి కాంట్రాక్టులు ఇప్పించుకొని ల‌బ్ధిపొందారు. రేవంత్ రెడ్డి అలాంటి వారి గుట్టును ర‌ట్టు చేస్తుండ‌టంతో ల‌బోదిబోమంటున్నారు. రేవంత్ సీఎం అయిన త‌రువాత సీనియ‌ర్‌, జూనియ‌ర్ల‌ను క‌లుపుకొని పోతూ పార్టీ బ‌లోపేతంతోపాటు..ప్ర‌భుత్వంలోనూ వారి సేవ‌ల‌ను వినియోగించుకుం టున్నారు. కానీ, కొంద‌రి తీరులో మాత్రం మార్పురావ‌డం లేద‌ని పార్టీ శ్రేణుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

 సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైద‌రాబాద్ న‌గ‌రంలోని చెరువులు, నాళాలు ఆక్ర‌మించి అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్టిన వారిపై కొర‌డా ఝుళిపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సినీ న‌టుడు నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత జరిగింది. పార్టీల‌ కు అతీతంగా, ప‌లుకుబ‌డి క‌లిగిన‌వారు అని చూడ‌కుండా చెరువు, నాళాలు ఆక్రమించి నిర్మించిన ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేస్తోంది. దీనికితోడు చెరువుల‌ను ఆక్ర‌మించి నిర్మాణం చేసిన ఫామ్ హౌస్‌ల‌ను కూడా కూల్చేస్తామ‌ని రేవంత్ ప‌లుసార్లు ప్ర‌స్తావించారు. మ‌రోవైపు.. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నదీపరీవాహక ప్రాంతంలోని ఇళ్లను మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్‌ కూల్చివేస్తోంది. మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా రివర్ బెడ్ పరిధిలో సుమారు 55 కిలోమీట‌ర్ల‌ పరిధిలో 40 వేల ఆక్రమణలను కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. చాదర్‌ఘాట్‌ మూసీ పరీవాహక ప్రాంతాల్లోని మూసానగర్‌, రసూల్‌పుర, వినాయక్‌నగర్‌ పరిసరాల్లో ఇళ్లకు రెవెన్యూ అధికారులు మార్కిం గ్ చేశారు. ఇందులో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వారి ఇళ్ల కూల్చివేత‌లు చేప‌ట్టారు. అయితే, కొంద‌రు స్థానికులు మూసి ప‌రివాహ‌క ప్రాంతంలోని త‌మ ఇళ్ల‌ను కూల్చివేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. ప్ర‌భుత్వం తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో బీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు సైతం మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లోని బాధితుల‌కు అండ‌గా నిల‌వ‌డంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్నది. 

మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లోని ఇళ్ల‌ను కూల్చేస్తే చూస్తూ ఊరుకోబోమ‌ని, ఇళ్ల‌ను కూల్చాలంటే ముందుగా బుల్డోజ‌ర్లు త‌మ‌పై నుంచి పోనివ్వాలంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లోని నేత‌లు స‌వాళ్లు చేశారు. దీంతో మూసి ప్రాంతంలో కూల్చివేత‌ల వ్య‌వ‌హారం రాజ‌కీయంగా పెద్ద‌ ర‌చ్చ‌కు దారితీసింది. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుంద‌రీక‌ర‌ణ పనుల విష‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లో వెనుక‌డుగు వేసేది లేద‌ని తేల్చి చెప్పారు. ఇళ్లు న‌ష్ట‌పో యిన వారికి డ‌బుల్ ఇళ్లు ప్ర‌భుత్వం క‌ట్టించి ఇస్తుంద‌ని, ప‌రిహారం కూడా అందించేలా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తామ‌ని, అంద‌రికీ న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలో అనేకమంది పెద్దలు ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని చెబుతూ  వారి పేర్లను కూడా ప్రస్తావించారు. ఆయన అలా ప్రస్తావించిన పేర్లలో బీఆర్‌ఎస్‌ నేతలతో పాటు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రాంచందర్‌రావు పేరు కూడా ఉంది. కేవీపీ అక్రమంగా ఫామ్‌హౌస్‌ నిర్మించుకున్నారని రేవంత్ అన్నారు.   కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కేవీపీ పేరు నే రేవంత్‌ ఉటంకించడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ కేవీపీ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీలో తాను సీనియ‌ర్ లీడ‌ర్ని అని ఆ లేఖలో చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. పార్టీకి చెడ్డ పేరు వస్తే, తన కాంగ్రెస్ రక్తం సహించదు అని పేర్కొన్న కేవీపీ,  తన ఫామ్ హౌస్‌కు అధికారులను పంపించండి.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణం ఉంటే మార్క్ చేయించండి,  సొంత ఖర్చులతో ఆ నిర్మాణాలను కూల్చివేయిస్తా అని  ఆ లేఖలో స్పష్టం చేశారు.  అయితే, కేవీపీ లేఖ కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ లీడ‌ర్‌ నైన నా ఫామ్ హౌస్ నే కూల్చేస్తావా అన్న హెచ్చరికను రేవంత్ కు పంపినట్లు ఉందని  కాంగ్రెస్ పార్టీ శ్రేణులే అంటున్నాయి. 

అయితే అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మాణం అంటూ రేవంత్ కేవీపీ పేరును ప్ర‌స్తావించ‌డం వెనుక పెద్ద‌కార‌ణ‌మే ఉంద‌న్న చర్చ కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కేవీపీ రామచంద్రరావు హవా నడిచిం దన్న ఆరోపణలున్నాయి. వాటిని రేవంత్ నమ్ముతున్నారు. ముఖ్యంగా కాంట్రాక్టులు.. ఇతర విషయాల్లో కేసీఆర్ కు కేవీపీ అన్ని విధాలుగా సహకారం అందించారనీ, ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు ఉండటంతోనే   రేవంత్ కేవీపీ పేరు ప్రస్తావిస్తూ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం తప్పదని హెచ్చరించారనీ పరిశీలకులు భావిస్తున్నారు.   గతంలో కూడా రేవంత్‌ కేవీపీపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయాన్నిగుర్తు చేస్తున్నారు.  

కేవీపీ, కేసీఆర్‌ది ఒకే సామాజికవర్గం కావడంతో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేవీపీ కేసీఆర్ కు అన్ని విధాలుగా సహకరించారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.   ఇప్ప‌టికే కేవీపీ వ్య‌వ‌హారాన్ని రేవంత్ అధిష్ఠానం దృష్టికి తీసు కెళ్లార‌ని.. బీఆర్ ఎస్ హయాంలో కేవీపీ కేసీఆర్ కు ఏ విధంగా అండ‌గా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేశారో వివ రించారని  కాంగ్రెస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  హైకమాండ్ అనుమతితోనే రేవంత్  అక్రమ నిర్మాణాలు చేసిన వారిలో కేవీపీ కూడా ఉన్నారని వెల్లడించారని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ లో సీనియ‌ర్లుగా చ‌లామ‌ణి అవుతూ ప‌దేళ్ల‌ పాటు బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారికంగా స‌హ‌కారం అందించిన కొంద‌రు సీనియర్ల ను రేవంత్ టార్గెట్ చేశారనీ, వారిలో  కేవీపీ కూడా ఒక‌ర‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది. మొత్తానికి కేవీపీ ఎపిసోడ్ తో  కాంగ్రెస్ పార్టీ లోని క‌ట్ట‌ప్ప‌ల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 

By
en-us Political News

  
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
భౌగోళికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినా, భాష, సంస్కృతి పరంగా తెలుగు ప్రజల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు. తెలుగు సినిమా రంగానికి ప్రజలను ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.
తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ నేతల సమావేశం ఉద్రిక్తంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి.
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.