జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో గ్యాంగ్ రేప్.. రేవంత్ సంచలన ఆరోపణ.. విష్ణు ఖండన

Publish Date:Aug 29, 2022

Advertisement

 తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ రేప్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసారు. జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం గురించి మాట్లాడిన బిజెపి నాయకులు హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలొ గ్యాంగ్ రేప్ జరిగితే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎఐంఎం నాయకుల పిల్లలు పెద్దమ్మతల్లి గుడి ప్రాంగణంలో గ్యాంగ్ రేప్ కు పాల్పడితే హిందూ మతానికి వారసులుగా చెప్పుకునే బిజెపి నరాయకులు పల్లెత్తు మాట అనలేదనీ, కంటే దుర్మార్గం వుంటుందా అని ప్రశ్నించారు. ఆ సమయంలో ఎలాంటి ఉప ఎన్నికలు లేవు కాబట్టి రాజకీయ లబ్ధి ఉండదు కనుకే  బిజెపి నాయకులు ఈ రేప్ కేసు గురించి పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. రేవంత్ ఆరోపణలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరో సంచలనానికి వేదికయ్యాయి. పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేత, దివంగత పీజేఆర్ కుమారుడు పి. విష్ణువర్ధన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను విష్ణువర్ధన్ రెడ్డి  ఖండించారు. పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఆ దారుణం జరిగిందంటూ అసంబద్ధంగా మాట్లాడటం సరికాదని, పవిత్ర ఆలయంపై అసత్యాలు ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ ఏసీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.  వివరాలిలా ఉన్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండు రోజుల కిందట   జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో సంచలన ఆరోపణలు చేశారు. పెద్దమ్మ గుడి ప్రాంగణంలోనే బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపించారు.

హై ప్రొఫైల్ కేసు అయినప్పటికీ ఈ విషయంలో బీజేపీ నేతలు మౌనం వహించడానికి కారణమేమిటని నిలదీశారు. అయితే ఈ విషయంలో బీజేపీ నేతల నుంచి ఎటువంటి స్పందనా రాకపోయినప్పటికీ రేవంత్ రెడ్డి సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఆరోపణలు సత్యదూరమంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేశారు.

జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం ఛైర్మన్‌గా ఉన్న  విష్ణువర్ధన్ రెడ్డి  పెద్దమ్మ గుడిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదని  స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగేలా ఇష్టారీతిన మాట్లాడితే సొంత పార్టీ వారినైనా సహించేది లేదని విష్ణువర్థన్ రెడ్డి అన్నారు.  జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి.. పీసీసీ చీఫ్‌పై ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. 

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.