చిక్కుల్లో సర్కార్.. సందిగ్ధంలో విపక్షం!

Publish Date:Mar 13, 2025

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో ఏమి జరుగుతోంది? ఓ వంక అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక విధమైన  గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికార పగ్గాలు చేపట్టి 14 నెలలు పూర్తయినా, ఆయనకు, పరిపాలనపై పూర్తి పట్టు చిక్కినట్లు లేదు. మంత్రుల పరిస్థితి కూడా ఇంచుమించుగా అంతే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్ మంత్రులు సైతం, ఎందుకనో అంటీ ముట్ట నట్లే ఉంటున్నారు. ఇగో ప్రాబ్లమో, స్టేచర్  సమస్యో తెలియదు కానీ, ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సయోధ్య  ఉన్నట్లు కనిపించడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కూడా అదే పరిస్థితి. ఓవరాల్ గా ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో ఏదో జరుగుతోంది. అదేమిటో తెలియదు కానీ, అంతా బాగుంది అనుకునే పరిస్థితి అయితే లేదు. ఇది కళ్ళ  ముందు కనిపిస్తున్న సత్యం.  

 నిజానికి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనితీరు పట్ల, ఇంటా బయటా పెదవి విరుపులే కానీ, ప్రశంసలు పెద్దగా వినిపించడం లేదు. ముఖ్యమంత్రి  విమర్శలు చెవిలో, ప్రశంసలు మైకులో చెప్పాలని మైకులో వేడుకున్నా, కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నట్లు  ఇటుదటు, అటు దిటు చేసి పార్టీ నాయకులు బహిరంగంగా  విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి  స్థానిక నాయకులే కాదు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ పార్టీ  ఢిల్లీ పెద్దలకూ  నచ్చడం లేదు. ప్రజల సంగతి అయితే చెప్పనే అక్కర లేదు. మాటలు కోటలు దాటినా చేతలు గడప దాటడం లేదు అన్నట్లు  రేవంత్ రెడ్డి పాలన ఉందని సామాన్య జనం, పెదవి విరుస్తున్నారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పని చేసిన తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉందని అంటున్నారు. 

ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఎంత అద్వానంగావుందో  స్వయంగా ముఖ్యమంత్రే, ఢిల్లీ వెళ్లి డప్పు కొట్టి మరీ  దేశం మొత్తానికి వినిపించేలా చెప్పి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నెలసరి ఆదాయం గత ప్రభుత్వ హాయంలో చేసిన అప్పుల పై కడుతున్న వడ్డీలు, ప్రభుత్వ ఉద్యోగుల భత్యాలకే  సరిపోతోందని, ఆ రెండు పద్దులకూ పోను   కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే ఆభివృద్ధి, సంక్షేమం, ఇతర రోజువారీ ఖర్చులకు మిగులుతున్నదని  ‘ఇండియా టుడే’ గోష్టిలో చెప్పి వచ్చారు. అదే విషయాన్ని ఇంకొంచం క్లారిటీతో బుధవారం (మార్చి 12), జరిగిన సభలో వివరించారు.  రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కాన్సర్  సోకిందని,  సవివరంగా వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ  ఎంత అద్వాన్నంగా వుందో కళ్ళకు కట్టి నట్లు చెప్పారు. ఇదలా ఉంటే  ముఖ్యమంత్రి మార్పు అనివార్యం అంటూ వస్తున్న వార్తలు రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచుతున్నాయి. 

అధికార పార్టీ, ప్రభుత్వం పరిస్థితి ఇలా ఉంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్  కూడా ఎందుకో, అంతగా దూకుడు చూపడం లేదు. ముఖ్యంగా, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్  నిన్నమొన్నటివరకు రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్న సందేహం వచ్చే విధంగా, పర్ణశాల (ఫార్మ్ హౌస్)కే పరిమితం అయ్యారు. ఇంచుముంచుగా ఆరేడు నెలలకు పైగా  అసెంబ్లీకి  అయినా రాలేదు. సభకు ముఖం చూపలేదు. ఇంతలో, ఓ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దీంతో సభలో ప్రతిపక్షం బలం పలచ బడింది.  అలాగే,  ప్రతిపక్ష నేత కేసీఆర్  సభకు రాకుండా ముఖం చాటేయడంతో  ప్రతిపక్షం వాయిస్ మరింత బలహీనపడింది. అయితే, గత కొద్దిరోజులుగా, కీసీఆర్   రీ ఆక్టివ్  అవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, కేసీఆర్  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు, మార్చి 12 న ఏదో మొక్కుబడిగా సభకు వచ్చి సంతకం చేసి వెళ్ళారే కానీ , బడ్జెట్ సమావేశాలు చివరి వరకు క్రియాశీల పాత్ర పోషించక పోవచ్చని పార్టీ వర్గాల సమాచరం. ఏప్రిల్ 27న, వరంగల్ లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభ తర్వాతనే కేసీఆర్  రీ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. అయితే, కాంగ్రెస్ నాయకులు తమ చేతకాని తనంతో అధికారాన్ని ఫార్మ్ హౌస్  కు వచ్చి మరీ బంగారు పళ్ళెంలో పెట్టి. ఇచ్చిపోతారని, కేసీఆర్  సార్ .. గట్టిగా నమ్ముతున్నారని అంటున్నారు. అందుకే, అప్పుడైనా వస్తారా.. అనేది అనుమానమే అంటున్నారు. అలాగే,   ఈ లోగా. రాష్ట్ర రాజకీయాలు, ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో అప్పటికి రాజెవరో .. రెడ్డెవరో ...?

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.