భద్రాద్రి రాములోరి మీదొట్టు.. మళ్లీ మాదే అధికారం.. రేవంత్

Publish Date:Jul 11, 2026

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2028 ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాఇలా కాదు.. ఏకంగా భద్రాద్రి రాములోరి మీద ఒట్టేసి మరీ  ఈ విషయం చెప్పారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లా  జగన్నాథపురంలో నిర్వహించిన రైతు భరోసా చివరి విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నరేవంత్ రెడ్డి  రాబోయే ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని  చెబుతూ.. భద్రాచలం రాముడి మీద ఆన... వచ్చే ఎన్నికల్లో   117 స్థానాల్లో గెలిచి తీరుతాంమని ప్రకటించారు.  

రాష్ట్రంలో ప్రస్తుతం 119 శాసనసభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన లేదా స్థానాల పెంపు బిల్లు   ఆమోదం పొందితే, తెలంగాణలో సీట్లు దాదాపు 50 శాతం మేర పెరగనున్నాయన్న రేవంత్.. ఈ పెంపుదల ప్రకారంగా ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు భవిష్యత్తులో 182 స్థానాలకు చేరనున్నాయన్నారు.   

అలాగే.. ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం  స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని   స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.    తమకు ఏ రాజకీయ పార్టీతోనూ పంచాయితీ లేదని, ప్రజలే తమ బలమని, ప్రజలతోనే కలిసి నడుస్తూ విజయం అందుకుంటామని  పేర్కొన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పులమయం చేయడం వల్లే  కొంత ఇబ్బంది ఎదురౌతోందన్న రేవంత్.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా  తాము 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.

Revanth Reddy vow on Lord Ram, Telangana assembly seats increase 182, Revanth Reddy 117 seats Congress, Telangana early elections clarity

By
en-us Political News

  
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు ప్రస్తుత రాజకీయ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది.
అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు..  దేవతల రాజధాని కూడా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి , జలాలను సేకరించి ఇక్కడ పవిత్ర పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు.
జగన్ హయాంలో పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా పరిస్థితి ఉండేది. దాంతో జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి.
65 సెంట్ల భూమి విషయంలో కోర్టుకు వెళ్లిన రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదంటూ పేర్ని నాని ఈ సందర్భంగా విమర్శించారు. కానీ వేల ఎకరాలు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చిన రైతుల విషయంలో జగన్ హయాంలో జరిగిందేంటి?
ర్యాలీకి ముందుగానే గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ వీవీ సత్యనారాయణ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఖాతరు చేయకుండా..  వైసీపీ శ్రేణులు, మద్దతుదారులతో   పార్టీ క్యాంప్ ఆఫీస్ దిశగా ముందుకు సాగారు.
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.