అసెంబ్లీ వేదికగా రేవంత్ సృష్టించిన ‘భూ’కంపం.. ఆత్మరక్షణలో కల్వకుంట్ల కుటుంబం.!

Publish Date:Sep 17, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో భూ వివాదాలు మరోసారి తారస్థాయికి చేరాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితికి   మధ్య మాటల యుద్ధం  ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.

అయితే  అసంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆన్ రికార్డ్ యటపెట్టిన భూముల వివరాలతో బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడినట్లే కనిపిస్తోంది. ఆ పార్టీ చేస్తున్న ఎదురుదాడి ఆత్మరక్షణ యత్నంగా కనిపిస్తోందే తప్ప ప్రజలను నమ్మించడంలో విఫలమైంది. మామూలుగా సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం వేరు.. సాక్షాత్తూ అసెంబ్లీ వేదికగా  సర్వే నంబర్లు, విస్తీర్ణాల ఆధారంగా లెక్కలు బయటపెట్టడం వేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పని చేశారు.   ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని పేద రైతుల భూములను లాక్కున్నారని, దీని వెనుక పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని సీఎం అన్నారు. ప్రాథమిక సమాచారం ఆధారంగానే ఈ వివరాలు బయటపెడుతున్నామని, పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్,  లోతైన విచారణ జరిగితే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని రేవంత్ రెడ్డి చెప్పారు.  

ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా రేవంత్ వెల్లడించిన వివరాలను ఖండిస్తూనే.. కేసీఆర్ కుటుంబం ఆ భూములన్నీ నిజమే, వాటిని  మేం దాచిపెట్టిందేమీ లేదు, ఎన్నికల అఫిడవిట్లలో స్వయంగా పొందుపరిచినవే అని చెప్పుకుంటోంది. అవన్నీ తమకు తరతరాలుగా వస్తున్న వేల ఎకరాల వారసత్వ భూములున్నాయనీ, తమది జమీందారీ నేపథ్యమని చెప్పుకుంటోంది. అయితే.. ఇక్కడ కేసీఆర్ కుటుంబం మరీ ముఖ్యంగా కేసీఆర్ చిన్న లాజిక్ మరిచిపోయారు.

1973 నాటి భూమి పరిమితి చట్టం  ప్రకారం ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు మించి ఉండటానికి లేదన్న విషయాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగానో లేదా నిజంగానే అయినా మరచిపోయారు.  దీంతో కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ రేవంత్ ఆరోపణలను తిప్పి కొట్టే ప్రయత్నం పెద్దగా ఫలిచడం లేదని పరిశీలకులు అంటున్నారు.  

ఇక పోతే ఆ ఆరోపణల తీవ్రతను తగ్గిండానికి, ప్రస్తుతానికి తప్పించుకోవడానికి కేటీఆర్ పొలిటికల్ అస్త్రంగా సిట్టింగ్ జడ్డి విచారణ అంటూ సవాల్ చేస్తున్నారు.  అయితే..  సిట్టింగ్ జడ్జి విచారణ డిమాండ్ అనేది సమస్యను పక్కదారి పట్టించే, పాతచింతకాయపచ్చడి వ్యూహంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  కేటీఆర్ డిమాండ్ కేవలం కాలయాపనకే తప్ప.. రేవంత్ రెడ్డి ఆరోపణలకు సమాధానం కాదని అంటున్నారు.  అన్నిటికంటే ప్రధానంగా... ఆ భూములు తమవేననీ, వాటిని చట్టబద్ధంగా కొన్నామనీ చెప్పుకుంటున్న కేటీఆర్   భూములు ఎవరి హయాంలో, ఎంత ధరకు  కొన్నారు అన్న వివరాలను వెల్లడించాల్సి ఉంది.  వాటిని కొనుగోలు చేయడానికి వెచ్చించిన నిధులు, అవి వచ్చిన మార్గం, దాని మూలాలు అన్నీ వివరించాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి.. వ్యక్తిగత దూషణలు, ప్రత్యారోపణలు చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ప్రత్యారోపణలు, వ్యక్తిగత దూషణలు ప్రజలలో కల్వకుంట్ల కుటుంబ వాదనను బలహీన పరుస్తాయో తప్ప మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు అంటున్నారు.  అన్నిటికీ మించి అవి వారసత్వ భూములు అన్న ఒక్క మాటతో ఈ వివాదాన్ని ముగించేయడం కల్వకుంట్ల కుటుంబానికి అంత తేలిక కాదు. ఏది ఏమైనా అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి సృష్టించిన ‘భూ’ కంపం కేసీఆర్ కుటుంబాన్ని, అలాగే బీఆర్ఎస్ పార్టీనీ ఆత్మరక్షణలో పడేసిందన్నది మాత్రం ఎవరూ కాదనలేని వాస్తవమని చెప్పాలి. 

[Revanth Reddy, KCR Family Lands, BRS Counter Attack, Telangana Politics, Dharani Portal Row]

By
en-us Political News

  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.