స్థానిక సమరానికి రేవంత్ సర్కార్ రెఢీ?
Publish Date:May 26, 2025
Advertisement
తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసి ఏడాది పైనే అయినా, ప్రభుత్వం ఎన్నికల ఉసెత్తక పోవడంతో ఇటు పార్టీ నాయకులో, అటు గ్రామీణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యకతమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంకా ఆలస్యమైతే పార్టీకి, ప్రభుత్వానికి కూడా మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందనే సంకేతాలు అందడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాల సమాచారం. నిజానికి, జూన్ జూలై నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయిం చింది. అయితే.. గ్యారెంటీలు, హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యం ఎన్నికలపై ప్రభావం చూపు తుందని సొంత సర్వేలు తేల్చిచెప్పడంతో ముఖ్యమంత్రి ఎన్నికల నిర్వహణ విషయంలో తటపటాయిస్తూ వచ్చారని అంటున్నారు. అయితే.. అదే సమయంలో ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా, ఆలస్యం అయిన కొద్దీ పరిస్థితి మరింతగా విషమించే ప్రమాదం ఉందనే సంకేతాలు రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఎన్నికల నిర్వహించాలానే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 2.. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల గంట కొడతారని అంటున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగే వేడుకల్లో.. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో పంచాయతీ ఎన్నికల ప్రస్తావన చేస్తారని అంటున్నారు. ఆ తర్వాత జూన్ 5లోగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ (ఎస్‌ఈసీ) నుంచి ప్రకటన రావచ్చని అధికార వర్గాల సమాచారం. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్,ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి స్వయంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన తెచ్చినట్లు చెపుతు న్నారు. పంచాయతీ ఎన్నికలు జరపాలని ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వస్తున్నదని ముఖ్యమంతి అధికారులకు తెలుపగా, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్పినట్టు సమా చారం. అంతే కాకుండా ముఖ్యమత్రి సమీక్ష సమావేశం అనంతరం తొలిసారిగా కమిషనర్ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఇతర ముఖ్య అధికారులతో మాట్లాడినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఏ సమయంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చని, సిద్ధంగా ఉండాలని అధికారులను కమిషనర్ ఆదేశించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. సో.. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగనుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి ఎన్నికల పరీక్షకు వెళుతున్నారన్న మాట. సహజంగా స్థానిక సంస్థల ఎనికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందని అంటారు.అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు అందుకుభిన్నంగా కనిపి స్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హమీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందనే అభిప్రాయం బలంగా జనంలోకి వెళ్లిందని అంటున్నారు. ఇటీవల జరిగిన పట్ట భద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమైందని, అంటున్నారు. నిజానికి.. ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను తట్టుకోలేకనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫలితాలతో సంబం ధం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం పై వత్తిడి తెస్తున్నారని అంటు న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పంచాయతీరాజ్ అధికారులతో జరిపిన సమీక్ష సమా వేశంలోనూ ఎమ్మెల్యేల వత్తిడి అంశాన్ని ప్రస్తావించారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాగా.. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు తమ సమస్యలను స్థానిక ప్రజా ప్రతినిధులకు చెప్తారని, తమపై కాస్త ఒత్తిడి తగ్గుతుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అందుకే వెంటనే ఎన్నికలకు వెళ్లాలని కొందరు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులకు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. సన్నబియ్యం, రేషన్‌కార్డుల పంపిణీ, యువవికాసం వంటి పథకాల అమలు అంశం కలిసి వస్తుందని కూడా కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆ పథకాలపై ఇంటింటా ప్రచారం చేయాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పలు సూచనలు చేశారని అంటున్నారు. అదలా ఉంటే.. స్థానిక సమతల ఎన్నికలు సకాలంలో జరగక పోవడం వలన, కేంద్ర నిధులు, 15వ ఫైనాన్స్ నిధులు ఆగిపోయాయి. నిధులు రాక గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన నిలిచిపోయింది. మరోవంక గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు సంబదించిన బిల్లులు రాక మాజీ సర్పంచులు ఆందోళన బాట పట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలల పైనే అయినా, ఇంతవరకు పైసా విదల్చ లేదు. మరో వంక తమ పదవీకాలం ముగిసినా, తమ హయాంలో సొంత పూచికత్తుపై అప్పులు చేసి పూర్తి చేసిన పనులకు సంబందించిన బిల్లుకు మోక్షం రాక పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు ఆందోళన బాట పడ్డారు. ఎన్నికలు జరిగి స్థానిక సంస్థల పాలకవర్గాలు ఏర్పడితే, రాష్ట్ర నిధులు కాకున్నా, కేంద్ర నిధులు, 15 వ ఫైనాన్సు నిధులు అయిన వస్తాయని గ్రామీణ ప్రజలు, నాయకులు ఆశ పడుతున్నారు.
http://www.teluguone.com/news/content/revanth-government-ready-to-local-elections-39-198696.html





