నాడు జర్నలిస్టు.. నేడు సీఎం!

Publish Date:Dec 4, 2023

Advertisement

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రాష్ట్రం ఇచ్చిన పార్టీ అయినా దాదాపు పదేళ్లు అధికారానికి దూరంగానే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు దశాబ్దం తరువాత అధికారంలోకి వచ్చింది.  సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, విశ్లేషకులు పేర్కొన్నట్లే, తొలి నుండి అనుకున్నట్లే హాంగ్ కు ఆస్కారమే లేకుండా కాంగ్రెస్ 64 స్థానాల్లో సంపూర్ణ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. రెండుసార్లు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ పార్టీ కేవలం 39 స్థానాలకు పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్షం అవుతామని ఆశపడిన బీజేపీ ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేసి తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇక బీఆర్ఎస్‌లో దాదాపు ఆరుగురు మంత్రులతో పాటు మహామహులు కూడా ఓటమి పాలయ్యారు.   తెలంగాణ మూలాల నుండి పుట్టుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఓడించడం అంటే సామాన్య విషయం కాదు.  రాష్ట్రంలో పాతాళానికి పడిపోయిన ట్లుగా కనిపించిన కాంగ్రెస్  బీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి తీసుకురావడంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలకపాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహానికీ తావులేదు. కాంగ్రెస్ పార్టీ కురువృద్దులే ఈ విషయాన్నీ తేల్చి చెప్పేశారు.
 
కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలుపొందడం.. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తరువాయి. ఈ నేపథ్యంలో సీఎం ఎవరు అనేదానిపై కాంగ్రెస్ లో కసరత్తు జరుగుతుంది. టీపీసీసీ చీఫ్‌గా కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించడం వెనుక రేవంత్ రెడ్డి పాత్ర కీలకం కాబట్టే రేవంత్ రెడ్డే సీఎం అని కాంగ్రెస్ శ్రేణులూ, పార్టీ తరఫున గెలిచిన మెజారిటీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరన్నది హైకమాండ్ నిర్ణయానికి వదిలేసినా, సమావేశంలో రేవంత్ రెడ్డే సీఎల్పీ నేత అన్న విషయాన్ని దాదాపుగా ఖరారు చేసినట్లే చెబుతున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రేవంత్ వ్యక్తిగత జీవితం నుండి రాజకీయ అరంగేట్రం, ఆయన ఫైర్ బ్రాండ్ గా మారిన తీరు, తెలుగుదేశం పార్టీలో ఆయన పోషించిన పాత్ర, ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు రేవంత్ ను ప్రోత్సహించిన తీరు, కాంగ్రెస్ లో చేరిన నాటి నుండి నేడు అధికారం దక్కించుకునే స్థాయికి పార్టీని చేర్చిన వైనం ఇలా ఎన్నోరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడు సీఎం కాబోతున్న రేవంత్ రెడ్డి గతంలో జర్నలిస్ట్‌గా  పనిచేశారు. ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం ‘జాగృతి’అనే వార పత్రికలో రేవంత్ జర్నలిస్టుగా పని చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నిజానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాకే ఆ పార్టీకి మళ్ళీ ఊపు వచ్చింది. రేవంత్ తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ లోకి చేరిన తర్వాతే ఆ పార్టీకి జవసత్వాలు వచ్చాయి. స్వతహాగా దూకుడు స్వభావం కలిగిన రేవంత్ మాటల తూటాలు సూటిగా కేసీఆర్ గడీలను తాకాయి.   అదే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. అందుకే రేవంత్ పార్టీలోకి వచ్చాడనగానే కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపించింది.  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుండి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక  రేవంత్ జోరు ఇంకాస్త పెరిగింది. అయితే  తనను ఆక్షేపించేలా సీనియర్లంతా ముప్పేట దాడి చేస్తున్నా  రేవంత్ ఏమాత్రం తగ్గలేదు. ముందుగా యూత్ కాంగ్రెస్ ను టార్గెట్ చేసి చైతన్యవంతం చేసి ముందుండి నడిపించారు. నిరుద్యోగుల్లో ఆశలను రగిలించారు. అలకబూనిన నేతల ఇళ్లకి తానే స్వయంగా  వెళ్లి మాట్లాడి తన పట్ల వ్యతిరేకత లేకుండా చేసుకున్నారు. గాడినపడుతున్న పార్టీని చూసి మెల్లగా ఒక్కొక్క  సీనియర్లు కలిసి వచ్చారు. ఎన్నికలకు ముందే మొత్తం రాష్ట్ర పార్టీని రేవంత్ తన చేతుల్లోకి తీసుకున్న రేవంత్ ఎక్కడా, ఎన్నడూ హద్దు మీరతేదు. సీనియర్లను నొప్పించలేదు. సరికదా వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు.

కాంగ్రెస్ పార్టీలో ఈ స్థాయి క్రమశిక్షణ కనిపించడం  ఇదే తొలిసారని ఆ పార్టీ సీనియర్లే అంగీకరించారు.  గతంలో మహానేతని చెప్పుకున్న వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగానే వ్యతిరేకించిన వారుండగా.. ఈసారి ఎన్నికల సమయం వచ్చేసరికి ఏ కాంగ్రెస్ నేతా ఎక్కడా ధిక్కార స్వరం వినిపించలేదంటే.. పార్టీ రాష్ట్రనాయుడిగా రేవంత్ ఏ స్థాయి క్రమశిక్షణను తీసుకువచ్చారో ఇట్టే చేప్పేయవచ్చు.  

రెండు చోట్ల పోటీచేసిన రెండు నియోజకవర్గాల బాధ్యతను తన సోదరులకు అప్పగించి.. రేవంత్ మాత్రం రాష్ట్రాన్ని చుట్టేసి తన అధ్యక్ష పదవికి పూర్తి స్థాయి న్యాయం చేశారు. ప్రచార భారాన్ని ఒంటి చేత్తో మేశారు. రాష్ట్ర పార్టీలో  అతిరథ మహారథులుగా గుర్తింపు పొందిన సీనియర్ నేతలంతా తమ తమ నియోజకవర్గాలకే పరిమితమై ప్రచారం చేస్తే, చేసుకుంటే.. టీపీసీసీ చీఫ్ గా, నిజమైన నేతగా రాష్ట్ర ప్రచార సారథ్యాన్ని ఆయన చేపట్టి పూర్తి న్యాయం చేశారు.  మొత్తానికి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటే దానికి రేవంతే కారణమనడంలో సందేహం లేదు. అందుకే ఫలితాల తర్వాత కూడా ఏ ఒక్కరూ కూడా రేవంత్ సీఎం అంటే అభ్యంతరం చెప్పడం లేదు.  వీహెచ్ వంటి నేతలు ఒక వైపు ఫలితాలు వెలువడుతుండగానే తెలంగాణ కాబో యే సీఎం రేవంత్ రెడ్డే అని ప్రకటనలు చేశారు.

కాంగ్రెస్ పార్టీని రేవంత్ అధికారంలోకి తీసుకురావడం గురించి చెప్పాలంటే ఓ మనుభావుడి కవితను గుర్తు చేసుకోవాలి. చుట్టూ కారు చీకట్లు.. చేతిలో దీపం లేదు.. వెళ్లాల్సిందేమో దూరం.. దారంతా గోతులు.. కానీ, మనసు నిండా ధైర్యం. ఆయన ధైర్యమే ఓ మహాద్భుత కవచంగా పని చేసింది. ఆయన లక్ష్యమే ఓ కాంతిపుంజమై మిరుమిట్లు గొలిపేలా ‘కారు ’మబ్బులను  పంటాపంచలు చేసింది.  ఫలితం.. తెలంగాణ గడ్డ మీద సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. మహోజ్వల చరిత్ర సృష్టించి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరేశారు రేవంత్.  ఒక్కడిగా మొదలైన రేవంత్ ప్రయాణం మహా శక్తిగా మారి దొరల గడీలను బద్దలు కొట్టింది. ఫలితంగా ఇప్పుడు ఆ ఒక్కడే జనంతో జయహో అనిపించుకున్నాడు. శత్రువు ఎంతటి బలవంతుడైనా మనో ధైర్యమనే ఆయుధంతో కదనరంగంలో దిగి విజేతగా నిలిచారు రేవంత్ రెడ్డి. 

By
en-us Political News

  
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.