ఏపీలోనూ కాంగ్రెస్ తురుఫుముక్క రేవంత్!?

Publish Date:Mar 9, 2024

Advertisement

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిలో సూపర్ స్టార్ అంటూ ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే. కర్నాటకలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డికే ఇటు ప్రజలలో, అటు పార్టీ అధిష్ఠానం దృష్టిలో కూడా మంచి మార్కులు పడ్డాయి.  తెలంగాణలో అసలు ఆశలే లేని స్థితి నుంచి రేవంత్ పార్టీని ఒక్కో అడుగూ విజయం దిశగా పార్టీని నడిపించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. 

అసలు ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను అధిష్ఠానం అప్పగించిన తరువాత పార్టీలో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమని లేచింది. పార్టీ సీనియర్లంతా తమతమ విభేదాలను పక్కన పెట్టి మరీ ఐక్యంగా రేవంత్ ను వ్యతిరేకించారు. రాజీనామాల హెచ్చరికలకు కూడా వెనుకాడలేదు. అయితే నెమ్మది నెమ్మదిగా రేవంత్ తన కలుపుగోరు తీరుతో సీనియర్లందరినీ కలుపుకుని ముందుకు సాగారు. అదే సమయంలో అప్పటి అధికార బీఆర్ఎస్ పై విమర్శల దూకుడును మరో రేంజ్ కు తీసుకు వెళ్లారు. అప్పటి వరకూ ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ ఓటమి ఖాయం అన్నట్లుగా ఉండే పరిస్థితి మారింది. డీలా పడిన కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. రేవంత్ పని తీరు చూసిన తరువాత పార్టీలో విజయంపై ఆశ మొలకెత్తింది. దీంతో పార్టీలో అసమ్మతి రాగాలు సద్దుమణిగాయి. ఒకసారి టీపీసీసీ అధ్యక్షుడిగా కుదురుకున్న తరువాత రేవంత్  అప్పటి అధికార బీఆర్ఎస్ అవినీతిని ఎండగట్టడంపై దృష్టి పెట్టారు. అప్పటి వరకూ కేసీఆర్ వాగ్ధాటి ముందు కాంగ్రెస్ నేతలు తేలిపోతున్నారా అనిపించే పరిస్థితి మారింది. కేసీఆర్ కు దీటుగా రేవంత్ తన వాక్పటిమతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఒక సారి పార్టీ విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగిన తరువాత సీనియర్ నేతలంతా తమ గొంతు సవరించుకుని రేవంత్ తో కలిసి నడిచారు. ఎవరినీ నొప్పించకుండా, అలాగని ఎక్కడా తగ్గకుండా టీపీసీసీ చీఫ్ గా రాష్ట్ర పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి, ఆ తరువాత ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా తనదైన ముద్ర వేశారు. మొహమాటాలకు తావివ్వకుండా కచ్చితంగా గెలుపు గుర్రం అయితేనే రంగంలోకి దింపాలన్న కండిషన్ తో అధిష్ఠానాన్ని కన్విన్స్ చేయగలిగారు. దీంతో విపక్షంలో ఉండి కూడా అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక విషయంలో పెద్దగా సమస్యలు లేకుండానే కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసింది. ఇక ఆ తరువాతి నుంచి ఎన్నికల ప్రచార బాధ్యతలన్నీ దాదాపు ఒంటి చేత్తో రేవంత్ మోశారు. సీనియర్లంతా తమతమ నియోజకవర్గాల్లో గెలవడంపైనే దృష్టినంతా కేంద్రీకరించే పరిస్థితుల్లో ఉండే రేవంత్ ఒక్కడే సుడిగాలిలా రాష్ట్రమంతా చుట్టేశారు.

సరే కాంగ్రెస్ విజయం తరువాత ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రెండు రోజుల పాటు హై డ్రామా నడిచినా, ఉత్తమ్, భట్టి మేం రేసులో బలంగా ఉన్నామంటూ ముందుకు వచ్చినా రేవంత్ మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోకుండా నిబ్బరంగా ఉన్నారు. అధిష్ఠానం చివరకు రేవంత్ ను సీఎంగా ఎంపిక చేసింది. ఇక కేబినెట్ కూర్పు నుంచి ప్రతి విషయంలోనూ రేవంత్ సమష్టి బాధ్యతను విస్మరించలేదు. సీఎం పదవి కోసం తనతో పోటీ పడిన వారికి కీలక మంత్రిపదవులు కట్టబెట్టడం ద్వారా  టీం కాంగ్రెస్ స్ఫూర్తిని పార్టీ క్యాడర్ లోనూ, నాయకులలోనూ నింపడంలో సఫలీకృతులయ్యారు. అటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు విషయంలోనూ తనదైన మార్క్ చూపి ప్రజలలోనూ మంచి మార్కులు కొట్టేశారు. 

దీంతో అత్యంత ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకుని తెలంగాణలో కాంగ్రెస్ నే రేవంత్ అధికారంలోకి తీసుకువచ్చిన తీరు ఆయన ప్రత్యర్థులను సైతం అచ్చెరువందేలా చేసింది. దీంతో సహజంగానే రేవంత్ నాయకత్వ సమర్ధతపై అధిష్ఠానం నమ్మకం పెరిగింది. దీంతో త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కూడా రేవంత్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. అందుకే ఏపీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలతో పాటే జరగనున్నాయి. అంటే ఒక వైపు తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక లోక్ సభ స్థానాలలో గెలుచుకునేలా పార్టీని నడిపిస్తూ, ప్రచార బాధ్యతలు మోస్తూ, అదే సమయంలో ఏపీలో కూడా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన గురుతర బాధ్యతను పార్టీ హై కమాండ్ రేవంత్ భుజస్కంధాలపై పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ ఎన్నికలలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డే అని అధిష్ఠానం చెప్పకనే చెప్పింది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వెనుక రేవంత్ స్పీడ్, అందరినీ కలుపుకుపోయే తత్వం, ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే వాగ్ధాటి కీలకం అని భావిస్తున్న అధిష్ఠానం ఇప్పుడు ఏపీలో పార్టీని ఎన్నికల యుద్ధంలో ముందుండి నడిపించాల్సిన బాధ్యతను కూడా రేవంత్ కు కట్టబెట్టింది. అధిష్ఠానం నిర్ణయంతో ఏపీ కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి సారిగా   మార్చి15 న ఏపీలో పర్యటించనున్నారు. ఆ రోజు విశాఖపట్నంలో కాంగ్రెస్ నిర్వహించనున్న బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించనున్నారు.  

By
en-us Political News

  
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.