సంక్రాంతి తరువాత ఏ క్షణంలోనైనా రేవంత్ కేబినెట్ విస్తరణ!

Publish Date:Jan 12, 2025

Advertisement

దాదాపు ఏడాది కాలంగా రేవంత్ తన కేబినెట్ ను ఎప్పుడు విస్తరిస్తారా అన్న దానిపై తెలంగాణ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇదిగో అదిగో అంటూ పలు ముహూర్తాలు కూడా తెరమీదకు వచ్చాయి. కేబినెట్ విస్తరణే లక్ష్యంగా రేవంత్ పలుమార్లు హస్తిన వెళ్లి పార్టీ హైకమాండ్ తో భేటీ అయ్యారు కూడా. ఇంత జరిగినా తన కేబినెట్ విస్తరణ విషయంలో రేవంత్ అడుగు ముందుకు వేయలేకపోయారు.

అయితే ఇప్పుడు తాజాగా రేవంత్ కేబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపుగా ఖరారైనట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి తరువాత ఏ క్షణంలోనైనా తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని వెల్లడించారు. అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని చెప్పారు. కేబినెట్ విస్తరణతో పాటు ఇదే నెలలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్ పదవుల భర్తీ కూడా ఉంటుందని చెప్పారు. 

గతంలోనూ చాలా సార్లు   కేబినెట్ విస్తరణపై వార్తలు వచ్చినప్పటికీ విస్తరణ మాత్రం ముహూర్తం జరగలేదు. కేబినెట్ విస్తరణపై చర్చించేందుకు పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన వెళ్లి వచ్చారు. అయినా హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్  ఇవ్వలేదు. దాంతో ఇంత కాలంగా కేబినెట్ విస్తరణ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. నామినేటెడ్ పదవుల విషయంలోనూ అదే పరిస్థితి. ఈ లోగా ఏడాది కాలం గడిచిపోవడం.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు , హైడ్రా కూల్చివేతలు వంటి విషయాలలో రేవంత్ సర్కార్ తడబాటు ఆయన ప్రభుత్వ ప్రతిష్ఠను ఒకింత మసకబార్చింది. ఇక పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తరువాత.. రేవంత్ అసెంబ్లీ వేదికగా కొత్త సినిమాల బెనిఫిట్ షోలకు, టికెట్ల ధర పెంపునకు తెలంగాణలో అనుమతించేదే లేదని ప్రకటన చేశారు.

అయితే ఆ మాటకు ఆయన కట్టుబడలేదు. దీంతో రేవంత్ సర్కార్ కు కోర్టు అక్షింతలు వేసింది. జనబాహుల్యంలో కూడా రేవంత్ మాట మీద నిలబడలేదన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలోనే మరోసారి కేబినెట్ విస్తరణ అంశం తెరమీదకు వచ్చింది. రేవంత్ సర్కార్ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కేబినెట్ విస్తరణ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారని పరిశీలకులు అంటున్నారు. సంక్రాంతి తరువాత కేబినెట్ విస్తరణ, ఈ నెలలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ అనగానే.. పదవులు ఎవరెవరిని వరించబోతున్నాయి, ఎవరెవరికి నిరాశ మిగులుతుందన్న చర్చ మొదలౌతుంది. ఈ ఉద్దేశంతోనే సరిగ్గగా సంక్రాంతి పండుగకు ముందు కేబినెట్ విస్తరణపై ఫీలర్ వదిలారని అంటున్నారు.  కేబినెట్ విస్తరణ తరువాత పార్టీలో ఒకింత అసంతృప్తి, అసమ్మతి రేగే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే పార్టీ హైకమాండ్ ఇంత వరకూ మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. 

గతంలో ఎన్నడూ లేని విధంగా అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెడుతున్న రేవంత్ కు అసమ్మతి బెడద ఉండకూడదన్న ఉద్దేశంతోనే హైకమాండ్ విస్తరణను పెండింగ్ లో పెట్టిందని పరిశీలకులు విశ్లేషించారు. అదే కారణంతో నామినేటెడ్ పోస్టుల భర్తీని కూడా వాయిదా వేస్తూ వచ్చిందంటున్నారు. అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ అధికారపగ్గాలు చేపట్టి ఏడాది గడిచిపోవడం, మంత్రిపదవులు, నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న వారిలో అసంతృప్తి పీక్స్ చేరుతున్న సంకేతాలు కనిపించడంతో ఏదైతే కానీ ముందు కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయాలన్న నిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్లు చెబుతున్నారు.   

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.