హస్తినలో తెలంగాణ సీఎం.. కేంద్ర మంత్రులు, సోనియాతో భేటీలతో బిజీబిజీ

Publish Date:Dec 16, 2025

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారానమ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొల్పనున్న 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సహకారం అందించాలని కోరారు.  వీటి ద్వారా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా నాలుగు లక్షల మంది విద్యార్థుల‌కు మెరుగైన విద్య అందుతుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు.  వీటి నిర్మాణం,   ఇత‌ర విద్యా సంస్థ‌ల ఏర్పాటుకు దాదాపు 30 వేల కోట్ల రూపాయలు అవసరమౌతాయని తెలిపిన ఆయన వీటి ఏర్పాటు కోసం తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని కేంద్ర మంత్రిని కోరారు.  

అదే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయిన సీఎం రేవంత్.. ఆ సందర్భంగా  హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయాల‌ని విజ్ణప్తి చేశారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని గుర్తించామని తెలియజేశారు. అలాగే అవసరమైతే వెంటనే తరగతులు ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ కూడా రెడీగా ఉందని తెలిపారు.  ఐఐఎం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తే.. అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉ:దన్నారు.  అదే వి ధంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా తొమ్మది కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహార్  నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీగా ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ కు తెలిపారు రేవంత్ రెడ్డి.  

ఇక పోతే కాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గంధీతో  సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా తెలంగాణలో ఈ నెల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వివరాలను తెలిపారు. అలాగే..  తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2024ను సోనియాకు అందజే శారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనతో గత రెండేళ్లుగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, భవిష్యత్ ప్రణాళికలను రేవంత్ ఈ సందర్భంగా సోనియాగాంధీకి వివరించారు.  ఈ సందర్భంగా తెలంగాణలో రేవంత్ సర్కార్ పాలన, రాష్ట్ర అభివృద్ధి విషయంలో  రేవంత్ రెడ్డి దూరదృష్టిపై సోనియాగాంధీ అభినందించారు.   

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.