రేవంత్ తో వెంటకరెడ్డి భేటీ.. కాంగ్రెస్ సీనియర్లకు షాక్

Publish Date:Jan 21, 2023

Advertisement

రాజకీయాలలో శాత్వత శతృత్వం, శాశ్వత మితృత్వం అంటూ ఉండవు. నేడు బద్ధ శత్రువుల్లా ఉన్న వారు రేపు ఆప్త మిత్రులుగా మారి ఆలింగనం చేసుకుంటారు. నిన్న ఆప్త మిత్రులుగా ఉన్న వారు నేడు ఆగర్భ శతృవులుగా మారి కత్తులు దూసుకుంటారు.

రాజకీయాలలో ఇది సహజం. కానీ అలా ఎంతలా సరిపెట్టుకుందామనుకున్నా వీలుకాని సంఘటనకు గాంధీ భవన్  వేదికైంది. ఆ ఇరువురి భేటీ కాంగ్రెస్ శ్రేణులనే కాదు.. సామాన్య జనాలను సైతం ఆశ్చర్య చకితులను చేసింది. ఔను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్ వేదికగా కలుసుకున్నారు. కరచాలనం చేసుకున్నారు. కొద్ద సేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా గతం గత: అన్న వెంకటరెడ్డి.. తానెప్పుడూ గాంధీ భవన్ ముఖం చూడనని అన్న పాపాన పోలేదన్నారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా తన విధులు తాను నిర్వర్తిస్తానని చెప్పారు.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గా మాణిక్ రావు ఠాక్రే బాధ్యతలు తీసుకున్న తరువాత జరిగిన ఈ పరిణామం కాంగ్రెస్ లో గ్రూపుల సంస్కృతికి చరమగీతం పాడేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయా అన్న ఆశలను పార్టీ వర్గాల్లో రేకెత్తిస్తున్నాయి.  

ఎందుకంటే ఇద్దరి మధ్యా కొంత కాలంగా ఎడముఖం, పెడముఖంగా పరిస్థితి ఉంది. అటువంటిది ఇరువురూ సడన్ గా కలిసి కూర్చుని మనసు విప్పి మాట్లాడుకున్నారు. పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావు  థాక్రే గాంధీ భవన్ కు వచ్చారు. థాక్రే ఆహ్వానం తో గాంధీ భవన్ కు కోమటిరెడ్డి వచ్చారు. రేవంత్ తో కలిసి భేటీ  కావడం పార్టీలో రేవంత్ వ్యతిరేకులకు మింగుడు పడటం లేదు అది వేరే సంగతి. ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిందేమిటంటే..

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతల చేపట్టిన నాటి నుంచీ కోమటిరెడ్డి విభేదిస్తూనే ఉన్నారు.  వేరే పార్టీ నుంచి వచ్చి చేరిన వ్యక్తిగా పార్టీ పగ్గాలప్పగించడమేమిటని అధిష్ఠానాన్ని నిలదీశారు.  మునుగోడు ఉప ఎన్నిక వేళ సహాయ నిరాకరణ చేశారు. స్టార్ క్యాంపెయినర్ అయి ఉండీ  మునుగోడు ప్రచారానికి వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు. రాహుల్ జోడో యాత్ర హైదరాబాద్ చేరుకున్నా  కోమటిరెడ్డి హాజరు కాలేదు. అంతే కాకుండా మునుగోడు ఉప ఎన్నిక వేళ ఆయన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి అక్కడ చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చాయి. దీంతో కాంగ్రస్ నాయకత్వం వెంకటరెడ్డికి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే తెరవెనుక ఏం జరిగిందో కానీ..  గాంధీ భవన్ కు వచ్చి రేవంత్ తో చేతులు కలిపి.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటించారు.  కాంగ్రెస్ లో సీనియర్, జూనియర్ విభేదాలకు కారణమైన వెంకటరెడ్డి రేవంత్ తో చేయి కలపడంతో కాంగ్రెస్ లో సంక్షోభం ప్రస్తుతానికి టీ కప్పులో తుపానుగా చల్లారిపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.