ఏపీలో రేమాండ్స్ ఇన్వెస్ట్ మెంట్

Publish Date:Nov 15, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక ప్రగతి మరో లెవెల్ కు చేరింది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా జరుగుతున్న  సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా  రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామిక టౌన్‌షిప్‌గా ఉన్న శ్రీసిటీకి అదనంగా 6 వేల ఎకరాల భూమిని కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. శ్రీసిటీని రాష్ట్ర అభివృద్ధికి ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామన్న ఆయన  సదస్సు వేదికపై నుంచే  రేమాండ్స్ గ్రూప్‌కు చెందిన 3 ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అలాగే శ్రీసిటీలో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన 5 కంపెనీలను లాంఛనంగా ప్రారంభించారు. శ్రీసిటీలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన పలు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవగాహన ఒప్పందాలు  కుదుర్చుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు   దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక టౌన్‌షిప్‌ అయిన శ్రీసిటీ  నుంచే  డైకెన్, ఇసుజు, క్యాడ్బరీ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు  తమ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నాయని చెప్పారు. మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు శ్రీసిటీకి రావాలన్నారు. ఇప్పటికే బెల్జియం, జపాన్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చెందిన హెల్త్‌కేర్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, మెడికల్ పరికరాల కంపెనీల నుంచి రూ.8.87 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు.  గత రెండు రోజులుగా జరిగిన సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, మొత్తంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో   22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించామని చంద్రబాబు వివరించారు. 

త్వరలోనే శ్రీసిటీకి మరో 6 వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో 50కి పైగా దేశాలకు చెందిన కంపెనీలు శ్రీసిటీ నుంచి పనిచేస్తాయనీ,  తద్వారా లక్షన్నర మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.  రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న చంద్రబాబు 2014-19 మధ్య కాలంలోనే కియా కార్ల ఫ్యాక్టరీని సీమకు తెచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ప్రాంతంలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ వంటివి ఏర్పాటు చేస్తున్నామనీ,  ఏరోస్పేస్, డిఫెన్స్ కారిడార్లు కూడా రాబోతున్నాయి తెలిపారు. అనంతపురం జిల్లాకు రేమాండ్స్ సంస్థ రావడం శుభపరిణామమన్న ఆయన,  కియా సమీపంలోనే రేమాండ్స్ ఆటో కాంపోనెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు.   

By
en-us Political News

  
ఆమె అనుభవిస్తున్న బాధను నిరంతరం గమనిస్తున్న దామోదర్ తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యాడు. భార్య అనారోగ్యంపై బెంగ పెట్టుకున్న ఆయన, తాము లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏమౌతుందోననే ఆందోళనతో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.
గోడౌన్‌లో నిల్వ ఉంచిన పెయింట్లు, ర రసాయనాల వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి అనూప్ ప్రధాన్ శరీనం ఛిత్రమై శరీర భాగాలు పది మీటర్ల దూరం వరకూ ఎగిరి పడ్డాయి.
ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగెస్
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పారుపూడి రాధాగాయత్రి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది.
తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం నాడు ఒక భారీ పారిశ్రామిక దుర్ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణలో ఆదివారం ఉదయం ఒక ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు భారత్‌ జట్టు ప్రకటన
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ అనేది కేవలం ఒక సాంకేతిక పరిజ్ఞానం
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు నగర అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు
బీజేపీ నా సీటు చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ అన్నారు.
నేను హోంమంత్రిని కాకపోవడం ఆ క్రిమినల్స్ అదృష్టం...
సమాజంలో నేరస్థులను కేవలం నేరస్థులుగానే చూడాలని, వారికి కులం లేదా మతం అనే ముసుగు
హైదరాబాద్‌లోని KBR పార్క్ సమీపంలో కొత్తగా అమల్లోకి వచ్చిన వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు పలువురు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.