హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఉపశమనం...రెండో దశ వన్‌వే ట్రయల్ రన్ ప్రారంభం

Publish Date:Jun 21, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు నగర అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఆదివారం రెండో దశ వన్‌వే ట్రయల్ రన్‌ను పోలీసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్ మీడియాతో మాట్లాడారు. సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నగర అభివృద్ధి కోసం ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా గత ఏప్రిల్ 5న తొలి విడత వన్‌వే ట్రయల్ రన్ నిర్వహించామని, ఆ సమయంలో ఎదురైన సమస్యలు, లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దిన తర్వాత ఇప్పుడు రెండో దశ ట్రయల్ రన్‌ను చేపట్టినట్లు తెలిపారు.

మొదటి ట్రయల్ రన్ వేసవి కాలంలో నిర్వహించడంతో వాహనాల రద్దీ తక్కువగా ఉందని, అయితే ప్రస్తుతం సాధారణ పరిస్థితులకు దగ్గరగా ట్రాఫిక్‌ను అంచనా వేసేందుకు మరోసారి ట్రయల్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈరోజు ఆదివారం కావడంతో ట్రాఫిక్ కొంత తక్కువగా ఉన్నప్పటికీ, సాధారణ పనిదినాల్లో వాహనాల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ట్రయల్ రన్ విజయవంతం కావాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని సజ్జనార్ అన్నారు. గతంలో సహకరించినట్లుగానే ఈసారి కూడా ట్రాఫిక్ పోలీసులు సూచించే మళ్లింపులు, సైన్‌బోర్డులను గమనించి వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

నగరంలోని కీలక కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిబ్బంది, సైన్‌బోర్డులు ఏర్పాటు చేసి వాహనదారులకు మార్గనిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల వల్ల భవిష్యత్తులో ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాసులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దీంతో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనాలు నిలిచిపోవడం గణనీయంగా తగ్గి, సుదూర ప్రయాణాలు కూడా నిరాటంకంగా సాగుతాయని చెప్పారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంబులెన్స్‌ల రాకపోకలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు. 

అలాగే కేబీఆర్ పార్క్‌కు వచ్చే వాకర్ల కోసం రోడ్డు దాటేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని, ఇకపై పార్క్‌కు వచ్చే వారు తమ వాహనాలను ప్రధాన రహదారులపై నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ పార్కింగ్‌ను వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం ట్రాఫిక్ నియంత్రణ కోసం 150 మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉన్నారని, అవసరమైతే గ్రేహౌండ్స్, ఆక్టోపస్ సిబ్బంది సేవలను కూడా వినియోగిస్తామని తెలిపారు. నగర ప్రజలందరూ పోలీసులకు సహకరించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు తోడ్పడాలని కోరారు. 

ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్ మాట్లాడుతూ రెండో దశ వన్‌వే ట్రయల్ రన్‌లో ట్రాఫిక్ మళ్లింపులు ఎలా పనిచేస్తున్నాయో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ట్రయల్ సందర్భంగా ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటికి వెంటనే పరిష్కారాలు అమలు చేస్తామని తెలిపారు. అవసరమైన చోట్ల రోడ్ల వెడల్పు పెంచడం, యూ-టర్న్‌లను విస్తరించడం వంటి ఇంజినీరింగ్ మార్పులు కూడా చేపడతామని వెల్లడించారు. ఈ ట్రయల్ ద్వారా వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తుది ట్రాఫిక్ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు.

By
en-us Political News

  
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.