జియో ... జీనే ( నహీ ) దో!
Publish Date:Sep 5, 2016
Advertisement
కొన్ని రోజుల కిందటి దాకా ఇండియాలో అందరి నోటా వినిపించిన మాట రియో! ఇప్పుడు అందరూ పలవరిస్తోన్న మాట జియో! ఇంతకీ జియో స్టోరీ ఏంటి? ఆల్రెడీ కొంత వరకూ అందరికీ తెలిసిపోయింది కాని తెర వెనుక కథనమే అందరికీ తెలియటం లేదు! జియో పైకి కనిపించినంత సింపుల్ వ్యవహారం కాదు! లక్షల కోట్ల బిజినెస్ కి ప్రాతిపదిక! అందుకే, ఢిల్లీలోని భారత ప్రభుత్వం మొదలు అందరూ దీంట్లో తలదూర్చాల్సి వస్తోంది! అసలు జియో అనేది మన ఇండియన్ టెలికామ్ ముఖ చిత్రమే మార్చేసే బిగ్ డీల్...
జియో మిగతా డేటా ప్రొవైడరస్ లాంటి ఓ కంపెనీ కాదు. రిలయన్స్ వారి ప్రతిస్ఠాత్మక ప్రాడక్ట్. అందుకే, దీనిపై ఇంత చర్చ జరుగుతోంది. అంతే కాక వినాయక చవితి సందర్భంగా తమ సర్వీసులు మొదలు పెడతామని ప్రకటించిన ముఖేష్ అంబానీ నిర్ద్వంద్వంగా ఇతర సర్వీస్ ప్రొవైడర్స్ పై యుద్ధం ప్రకటించాడు. జియో కస్టమర్స్ అసలు ఎంతసేపు మాట్లాడుకున్నా ఫ్రీ అంటూ దిమ్మతిరిగిపోయే స్టేట్మెంట్ ఇచ్చాడు! కాని, ఇక్కడే అసలు కిటుకు వుంది!
జియో మిగతా 4జీ సర్వీసుల్లాంటిది కాదు. ఎయిర్ టెల్, ఐడియా, ఓడాఫోన్ కంపెనీలు ఇచ్చే డేలా సర్వీస్ లో కాల్స్ చేసుకోవటం కుదరదు. కాని, జియో మాత్రం డేలానే కాల్స్ గా మార్చేస్తుంది. అంటే మొబైల్ డేటా ఆప్షన్ అన్ చేసుకుని వున్నప్పుడే జియో లో కాల్స్ మాట్లాడుకోవచ్చు. లేదంటే సపరేట్ గా టాక్ టైం వేసుకుని మాట్లాడుకోటానికి వీలుండదు. దీన్నే ముఖేష్ అంబానీ ఫ్రీ ఔట్ గోయింగ్ కాల్స్ అని కలరింగ్ ఇచ్చాడు. యాక్చువల్లీ అది ఫ్రీ ఏం కాదు. టాక్ టైం బదులు డేటా ఖర్చవుతుంది. అదీ తేడా!
చిన్నా చితకా పబ్లిసిటీ స్టంట్లు అన్ని టెలికాం కంపెనీలు వేస్తుంటాయిలే అనుకుని కూడా మనం సరిపెట్టుకోవచ్చు. కాని, జియో అసలు సమస్య ఢిల్లీలో స్థాయిలో వుంది.ఏకంగా ఎన్డీఏ సర్కారే రంగంలోకి దిగి ముఖేష్ అంబానీకి అనుకూలంగా పావులు కదుపుతోందని అంటున్నారు విమర్శకులు.
జియో కొత్తగా మార్కెట్లోకి రావటంతో ఎయిర్ టెల్, ఐడియా, ఓడాఫోన్ లాంటి ఇతర నెటవర్క్ లకి ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జెస్ ( ఐయుసీ ) చెల్లించాల్సి వుంటుంది. ఐయుసీ అంటే జియో కస్టమర్ తన ఫోన్ నుంచి ఇతర నెట్ వర్క్ ల ఫోన్స్ కి కాలు చేసినందుకు గాను... జియో కంపెనీ ఆ ఇతర నెట్ వర్స్స్ కి పే చేయాల్సిన సర్వీస్ ఛార్జ్! మొదట్లో తన జియో కస్టమర్స్ ఎలాగూ తక్కువ వుంటారు కాబట్టి ఇతర నెట్ వర్క్స్ కి కాల్స్ వెళ్లినప్పుడల్లా భారీగా డబ్బులు కడుతూనే వుండాలి. అయితే, ఇక్కడే అంబానీ తన మనీ పవర్ చూపించాడు!
కేంద్రంలో యూపీఏ వున్నా, ఎన్డీఏ వున్నా అంబానీలకు అనుకూలంగానే పని చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న సర్కార్ కూడా ముఖేష్ కి అనుకూలంగా ఓ నిర్ణయం తీసుకుంది. జియో ఐయుసీ కింద కట్టాల్సిన ధరల్ని బాగా తగ్గిస్తూ 20శాతం నుంచి 14శాతానికి ట్రాయ్ తగ్గించింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కేంద్రం వున్నదనేది బహిరంగ రహస్యమే!
తమకు రావాల్సిన ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జెస్ కి భారీగా గండి పడటంతో ఎయిర్ టెల్ రైవల్ కంపెనీలు జియో కాల్స్ ను సరిగ్గా కనెక్ట్ చేయకుండా ఇబ్బంది పెట్టాయి. జియ ఫోన్స్ నుంచి ఇప్పటి వరకూ కాల్ చేసిన చాలా మంది యూజర్స్ కి ఇతర నెట్ వర్క్స్ తో మాట్లాడుతుంటే మధ్యలో కట్ అయిపోతున్నాయట. ఇది ఎయిర్ టెల్, ఐడియా లాంటి కంపెనీలు జియోపై కోపంతో చేసిన పనే!
తమ కాల్స్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవటంతో అంబానీ మరోసారి కేంద్రాన్ని కదిలించాడు. ఈ సారి ట్రాయ్ మరీ దారుణంగా ఐయుసీ నే తీసిపారేసింది! అంటే జియో కోసం తమ మౌలిక సదుపాయాలు ఉపయోగించి ఎయిర్ టెల్ లాంటి కంపెనీలు కాల్స్ కనెక్ట్ చేస్తున్నా కూడా ఒక్క పైసా రాదన్నమాట! ఈ పరిణామంతో జియో ప్రత్యర్థి కంపెనీలన్నీ నెత్తీ నోరు బాదుకుంటున్నాయి!
జియో కోసం ఏకంగా కేంద్ర ప్రభుత్వమే పావులు కదుపుతున్నప్పుడు సహజంగానే మిగతా కంపెనీలకు చుక్కలు కనిపిస్తున్నాయి. అంతే కాదు, 1.34లక్షల కోట్ల పెట్టుబడితో 10కోట్ల మంది యూజర్స్ టార్గెట్ గా రంగంలోకి దిగిన జియోని ఇప్పుడున్న బడా నెట్ వర్క్ లు ఏ మాత్రం తట్టుకోలేకపోవచ్చు కూడా! ఫలితంగా ముందు ముందు టెలికాం రంగంలో ఎయిర్ సెల్, యూనినార్ వగైరా వగైరా చిన్న చితకా కంపెనీలు కనిపించకపోవచ్చు. జియోలోనో , లేక ఇతర పెద్ద కంపెనీల్లోనూ విలీనం అవ్వొచ్చు. చివరకు, అంబానీ మనీ పవర్ , పొలిటికల్ పవర్ తో మొత్తం రంగమే మోనోపలీ అయిపోవచ్చు! అంటే జియో ఏకచ్ఛాత్రిధిపత్యం వహించటం అన్నమాట! అదే జరిగితే ఇప్పుడు ఇస్తున్న ఆఫర్లు అన్నిటికి పది రెట్లు ఎక్కువ డబ్బులు కస్టమర్ల నుంచి ముక్కు పిండి వసూలు చేసే ప్రమాదం కూడా వుంది! అలా జరగకూడదనే కోరుకుందాం...
http://www.teluguone.com/news/content/reliance-jio-4g-37-66079.html





