గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు రేహాన్ వాధ్రా గాంధీయేనా?
Publish Date:Dec 31, 2025
Advertisement
రాహుల్ గాంధీ నెహ్రూ గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం పెద్ద దిక్కు. దశా దిశా దిస్కూచి కూడా రాహుల్ గాంధీయే. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి కూడా ఆయనే. అందులో సందేహం లేదు. అయితే.. రాహుల్ తరువాత కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా చూసిన ఆయన సోదరి ప్రియాంక వధేరా గాంధీ కుమారుడు రేహాన్ వాద్రానే వారసుడు. అందుకు కారణం రాహుల్ గాంధీ అవివాహితుడిగా ఉండటమే. ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు. అదే రాహుల్ గాంధీకి వివాహమై ఉంటే.. ఆయన తనయులే తర్వాతి తరం వారసులు అయి ఉండేవారు. కొద్ది కాలం కిందటి వరకూ రాహుల్ గాంధీ వివాహం అన్నదే వారి కుటుంబంలోనే కాక, రాజకీయవర్గాలలో కూడా హాట్ టాపిక్ గా ఉండేది. అయితే.. రాహుల్ వివాహం పట్ల సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆ చర్చ క్రమంగా ఆగిపోయింది. ఇప్పుడు రాహుల్ మేనల్లుడు రేహాన్ తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడానికి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని పెళ్లి పీటలెక్కుతున్నారు. అయితే రాహుల్ గాంధీకి కూడా ఓ ప్రియురాలు ఉండేదని గట్టిగా వినిపించేది. అయితే ఆయన రేహాన్ లా ధైర్యం చేయలేదు. అందుకు ప్రధాన కారణం సెక్యూరిటీ థ్రేట్ అంటారు. అప్పట్లో సోనియా గాంధీ ప్రధాని కావల్సిన వారు.. ఆమె ప్రధాని కాలేక పోవడానికి, తర్వాత రాహుల్ పెళ్లాడక పోవడానికి కూడా అదే కారణంగా చెబుతారు. అప్పట్లో ఎల్. టీ. టీ. ఈ అనే మిలిటెంట్ గ్రూప్ రాజీవ్ గాంధీని హతమార్చిన సంగతి తెలిసిందే. సోనియా ప్రధాని కాకుండా హెచ్చరికలు జారీ చేసి అడ్డుకున్నది కూడా ఎట్టీటీయే అని అప్పట్లో గట్టిగా వినిపించింది.ఈ నేపథ్యంలో రాహుల్ తన తదనంతర వారసులకు ఈ ప్రాణహాని సైతం అనువంశికంగా కల్పించడం ఎందుకు? అన్న కోణంలో ఆలోచించి.. తన పెళ్లి ఊసెత్తలేదని అంటారు. అందుకే రేహాన్ పెళ్లి ద్వారా ఆ ఇంట ఇన్నేళ్లకు ఒక శుభకార్యం జరుగుతుండటంతో హ్యాపీ ఫీలవుతున్నారు కాంగ్రెస్ కార్యర్తలు.
http://www.teluguone.com/news/content/rehan-vadhra-heir-of-gandhi-nehru-family-25-211829.html





