రావల్సిండి బాల్యఛాయలో 95 ఏళ్ల రీనా వర్మ
Publish Date:Jul 22, 2022
Advertisement
పిల్లాడిని ఊరు నించి పంపేయవచ్చేమోగాని, పిల్లాడి మనసులోంచి ఊరుని విడదీయలేమని ఆంగ్లంలో ఓ సామెత. ఇది అక్షర సత్యం. పుట్టిపెరిగిన ఊరు అనగానే తెలీకుండానే ఏదో ఆనందపు కెరటం కేరింతలు కొట్టిస్తుంది. దీనికి వయసుతో సంబంధం లేదు. తమ ఊరు నుంచి బయటపడి ఎన్నేళ్లయినా, వయసు మీదపడినా ఒక్కసారి ఆ ఊరి కబురు వినాలనే ఉంటుంది. అదో బాల్య ఆనందం, అదో తీపి మధురస్మృతి, అదో అద్భుతం, అదో మనసు తేలిక పరిచే ఔషధం. వృత్తి ఉద్యోగాలు, వ్యాపార హడావుడిలో బిజీగా గడిపేస్తున్న ఈ కాలంలో ఎక్కడో ఒకచోట మన ఊరువాళ్లు ఒక్కరు కలిసినా, పోనీ ఆ మాటలు విన్నా పని ఒత్తిడి తాలూకు టెన్షన్ అంతా కొంతసేపు మనల్ని ఒదిలేస్తుంది. దానికి అంత మహత్తుంది. అలాంటిది 75 ఏళ్ల తర్వాత రీనా వర్మ తన స్వగ్రామం వెళితే ఇంకెంత ఆనందం ఉరకలేసి ఉంటుందో ఆలోచించండి. రీనా వర్మ 90 ఏళ్ల వృద్ధురాలు, పూణె నివాసి. ఆమె పుట్టి పెరిగిందంతా పాకిస్తాన్ రావల్‌పిండి. ఎప్పుడో డెబ్బయ్ ఐదేళ్ల క్రితం దేశ విభజన తర్వాత నుంచి ఆమె పూణెలోనే ఉండిపోయారు. ఆమె మూడు నెలల వీసా సంపాదించి సొంతూరుకి వెళ్లింది. అదీ ఇప్పటి పాకిస్తాన్ రావల్పిండికి. అక్కడికి వెళ్లగానే ఆ గాలి, ఆ ప్రజల్ని, ఆ వీధులు చూస్తూ ఒక్కసారిగా రీనా తన బాల్యాన్ని పాఠం చెప్పినట్టు అలసట లేన్నట్టు చుట్టూ చేరినవారికి కథలు కథలుగా చెప్పింది. కాదు.. ఆ వూరే ఆమెను కావలించుకుని చెప్పించింది. అమె తన స్వగ్రామానికి వస్తున్నట్టు ఫేస్‌బుక్ ద్వారా భారీ ప్రచారమే జరిగింది. అక్కడి ఝాంగ్, రావల్సిండిలలో గడిపిన జీవితాన్ని ఆమె నెమరేసుకుంది. అక్కడి వారి పొలాలు, పంటలు, పుస్తకాల దుకాణాలు, ఇతర చిరు వ్యాపారాల గురించి రీనా ఒక పుస్తకం రాయదగ్గ సమాచారాన్ని ఆ 90 యేళ్ల వయసులోనూ చిన్నపిల్లలా చెబుతూనే ఉందని ఆమె మనవరాలు మీడియాతో చెప్పి బుగ్గలు నొప్పిపుట్టేలా నవ్వుకుంది. తనకంటే ఓ అమ్మమ్మ భారతదేశంలో ఉందని తెలుసుగాని ఆమెను ఫోటోలోనే చూడటం ఇప్పుడు చూడటమే కాదు ఆమెతో రావల్సిండీ వీధుల్లో తిరగడం, తెలిసినవారికి ఆమెను పరిచయం చేయడం.. అదంతా ఓ అద్భుతం.. నిజానికి చూసి తీరాల్సిన బాంధవ్య దృశ్యం. నిజానికి రీనా రావల్సిండికి వెళ్లాలని అందర్నీ కనుమూసేలా చూడాలని తెగ ఆరాటపడ్డారు. వీసా కోసం 1965 నుంచి ప్రయ త్నిస్తున్నారు. కానీ ప్రయత్నిస్తున్నారట. 1945లో దేశ విభజన సమయంలో తప్పనిస్థితిలో మహారాష్ట్ర పూణెకి రావలసి వచ్చింది. మొన్న కోవిడ్ సమయంలో ఆమె రావల్సిండి వెళ్లాలని ఎంతో అనుకు్న్నారు. ఆమె తమ జీవితం తొలి 15 ఏళ్లు గడిపిన ఆ పట్టణానికి వెళ్లిపోవాలని ఎంతో ఆరాటపడ్డారు. తన కోరికను తెలియజేస్తూ కోవిడ్ సమయంలో పంజాబ్ హెరిటేజ్ ఫేస్ బుక్ పేజీలో తెలియజేశారు. రెండు దేశాల సరిహద్దులకు రెండు వేపులా వున్న పంజాబీలు ఒక్కటి కావాలని ఆమె ఎంతో ఆకాంక్షిస్తున్నారు. ఆమెది రావల్సిండికి వెళ్లాలన్న పసిపిల్ల ఆరాటంతో పాటు, పంజాబీలంతా ఒక్కటిగా ఉండాలన్న దేశభక్తి కూడా! ఆమె కథ తెలిసిన రావల్సిండి వ్యక్తి సజ్జద్ భాయ్ ఆమె బాల్యంలో గడిపిన ఇంటి వివరాలు, ఫోటోలు ఆమెకు చేరేలా చేశాడు. ఆమె కుమార్తె సోలాన్ అనే ప్రాంతంలో ఉంటున్నారు. విభజన తర్వాత తిరిగి వెళ్లాలని అనుకున్నారు కానీ సాధ్య పడలేదు. రీనా మూడు మాసాలు రావల్సిండిలో వదిలేసిన బాల్యాన్ని వీధుల్లో వెతుక్కుంటూ ఆ జా్ఞపకాలతో, ఆ ఇంటి పరిసరాల్లో తిరుగుతూ గంపెడు గొప్ప అనుభూతుల్ని, జ్ఞాపకాలను మనకోసం తీసుకువస్తారేమో!
http://www.teluguone.com/news/content/reena-varma-in-memory-travel-25-140335.html





