పశ్చిమబెంగాల్ లో ఓటెత్తిన జన ప్రభంజనం

Publish Date:Apr 24, 2026

Advertisement

పశ్చిమ బెంగాల్  అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్  గురువారం (ఏప్రిల్ 23)జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్ ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.  గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో ఓటింగ్ శాతం  92 శాతాన్ని అధిగమించింది. ఇది బెంగాల్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ భారీ ఓటింగ్ ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గురువారం (ఏప్రిల్ 23)  జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 152 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా క్యూ లైన్లలో నిలబడ్డారు. తుది గణాంకాల ప్రకారం, ఓటింగ్ శాతం 92.03 శాతంగా నమోదైంది. ముఖ్యంగా దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో అత్యధికంగా 94.98 శాతం ఓటింగ్ జరగగా, కూచ్ బెహార్‌లో 94.75 శాతం, బీర్భూమ్‌లో 93.88 శాతం ఓట్లు నమోదయ్యాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ 82 శాతానికి పైగా పోలింగ్ జరగడం విశేషం.

బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్..  ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.

ఈ భారీ ఓటింగ్ నమోదు కావడంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు కూడా కీలకమని చెప్పవచ్చు.  రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,400 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నప్పటికీ..  పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగడం పట్ల ఎన్నికల ప్రధాన కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత  వాతావరణంలో పోలింగ్ జరగడం వల్లే ప్రజలు ఇంత భారీగా తరలివచ్చారని అధికారులు భావిస్తున్నారు. 

ఓటింగ్ శాతం భారీగా పెరగడంపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ,  ఇతర కూటములు ఈ రికార్డు స్థాయి పోలింగ్‌ను తమకు అనుకూలం అంటే తమకు అనుకూలమని విశ్లేషణలు చేస్తున్నారు.  ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొనగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓటర్ల ఉత్సాహాన్ని అభినందించారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో జరిగిన మార్పులు, సిటిజన్‌షిప్ అంశాలు కూడా ప్రజలను చైతన్యపరిచినట్లు  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
మొదటి దశలో 1,478 మంది అభ్యర్థుల భవిష్యత్తు ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి దశలో కనిపించిన ఈ ఉత్సాహం రెండో దశలోనూ కొనసాగుతుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితం బెంగాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడమే కాకుండా, దేశ రాజకీయాలపై కూడా బలమైన ముద్ర వేసే అవకాశం ఉందంటున్నారు.

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.