రెబల్‌కు పోటీగా రెబల్ స్టార్ భార్య..!

Publish Date:Jun 21, 2023

Advertisement

టాలీవుడ్ ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి రాజకీయాల్లోకి రానున్నారనే ఓ చర్చ   పోలిటికల్ సర్కిల్‌లో తెగ వైరల్ అవుతోంది. రానున్న ఎన్నికల్లో ఆమెను ఎన్నికల బరిలో దింపేందుకు అధికార జగన్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో అందుకు సంబంధించిన బాధ్యతలు పార్టీలోని కీలక నేత, ఓ ఎంపీ భుజస్కందాలపై సీఎం జగన్ పెట్టినట్లు సమాచారం. 

అయితే ఇప్పటికే శ్యామలా దేవితో సదరు ఎంపీ భేటీ అయి... ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దింపితే.. ఆమె గెలుపు నల్లేరు మీద నడక అవుతోందనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం. 

ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు గతేడాది అంటే 2022 సెప్టెంబర్‌ 11న మరణించారు. దీంతో ఆయన మరణించి.. ఇంకా ఏడాది పూర్తి కాలేదు. అలాగే సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది మొదటి మూడు మాసాల్లో జరగనున్నాయి కనుక శ్యామలాదేవి ఎన్నికల బరిలో దిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయనే చర్చ   పోలిటికల్ సర్కిల్‌లో వాయువేగంతో సాగుతోంది.  

అదీకాక శ్యామలాదేవి భర్త కృష్ణంరాజు,.. పలుమార్లు లోక్‌సభకు ఎన్నిక కావడమే కాదు.. వాజ్‌పాయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. అటు నరసాపురం నుంచి.. ఇటు కాకినాడ నుంచి  ఆయన లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందారు. అలాగే ఆయన మంచి నటుడుగా ప్రేక్షకుల ఆదరాభిమానాలనే కాకుండా.. తనదైన శైలిలో ఆయన ప్రజాసేవ చేసి మంచి రాజకీయ నాయకుడిగా ప్రజల మనన్నలు   అందుకొన్నారు. 

అదీకాక నరసాపురంలో కృష్ణంరాజు సామాజికవర్గం ఓట్లు.. అక్కడ బరిలో నిలిచిన అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో అంటే 2019లో ఆదే సామాజిక వర్గానికి చెందిన రఘురామకృష్ణం రాజు అలియాస్ ట్రిపుల్ ఆర్ వైసీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత... పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ. రెబల్‌గా మారిపోయారు. ప్రతీరోజు ఆయన ప్రెస్‌మీట్ పెట్టి రచ్చబండ కార్యక్రమం ద్వారా సొంత పార్టీ అధినేత  జగన్‌తోపాటు ఆయన ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. 

అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన నరసాపురం నుంచి మరో పార్టీ తరఫున పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నట్లు ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో రెబల్ క్యాండెట్‌పై రెబల్ స్టార్ భార్య శ్యామలా దేవిని బరిలోకి దింపితే.. అసలు సిసలు రాజకీయం నరసాపురం వేదికగా జరుగుతోందనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.

By
en-us Political News

  
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.