కమల వ్యూహమా? కాంగ్రెస్ ప్రభావమా? ఆప్ ఓటమికి కారణమేంటి?

Publish Date:Feb 8, 2025

Advertisement

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగంచలేదు. కమల నాథుల  రెండున్నర దశాబ్దాలకు పైబడిన ఎదురు చూపులకు తెరపడింది. ఎట్టకేలకు ఢల్లీలో అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడిక వరుసగా 12 ఏళ్ల పాటు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలపై రివ్యూలు మొదలయ్యాయి. రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఢిల్లీలో ఆప్ పరాజయానికి, కమల నాథుల విజయానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది కమలనాథుల వ్యూహ పటిమ. రెండోది ఒక జాతీయ పార్టీగా మిత్రపక్షాలను కలుపుకు పోవడంలో కాంగ్రెస్ వైఫల్యం. ఈ రెండు కారణాల వల్లే ఢిల్లీలో బీజేపీ పాగా వేయగలిగింది. ముందుగా కమలం పార్టీ అగ్రనాయకత్వం ఢిల్లీపై 2020 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తరువాత నుంచీ ప్రత్యేక దృష్టి పెట్టింది. అప్పటి నుంచీ 2025 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పావులు కదిపింది. ఆప్ ప్రభుత్వం పని చేయకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది.  

ఢిల్లీ మద్యం కుంభకోణం, శీష్ మహల్ అంశాలను హైలైట్ చేసింది. అదే సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడును ప్రోత్సహించింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మనీష్ సిసోడియా అరెస్టుకు ఎల్జీ అనుమతి ఇచ్చారు. ఆ తరువాత కేజ్రీవాల్ కూడా అరెస్టయ్యారు. దీంతో ఆప్ అవినీతికి పాల్పడిందన్న ముద్ర జనంలో పడింది. ఇంటా బయటా అని తేడా లేకుండా ఆప్ అవినీతిపై బీజేపీ క్యాడర్ కాళ్లకు బలపాలు కట్టుకుని ప్రచారం చేశారు. ఇవన్నీ ఆప్ పలుకుబడిని ఓ స్థాయిలో పలుచన చేశాయి. 

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే బీజేపీయేతర పార్టీలకు నాయకత్వం వహించే లక్షణాలు ఆ పార్టీలో కొరవడ్డాయి. ఒక జాతీయ పార్టీగా ప్రభుత్వ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపై నిలపడంలో ఘోరంగా విఫలమైంది. ఇండియా కూటమిగా బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకు రావడానికి ప్రయత్నాలను అయితే ఘనంగా ఆరంభించింది కానీ వాటిని కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్లడంలో ఫెయిలైంది. ఆ కారణంగానే సీట్ల సర్దుబాటు విషయంలో ఆప్ తో సమన్వయం కుదుర్చుకోవడంలో విఫలమైంది. అంతే కాదు.. ఆప్ తో విభేదించి సొంతంగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ కు ఇండియా కూటమిలోని పార్టీలు కూడా మద్దతుగా నిలవలేదు. ఫలితం ఢిల్లీ ఎన్నికలలో ప్రభుత్వ అనుకూల ఓటు భారీగా చీలిపోయింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 46.75శాతం ఓట్లు సాధించి విజేతగా నిలిచింది. ఆప్ కు 43.30శాతం ఓట్లు లభించాయి. 70 స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెట్టిన కాంగ్రెస్ 7 శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. ఆ ఓట్లతో ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు కానీ కనీసం 50 స్థానాలలో ఆప్ విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. కాంగ్రెస్ కు వచ్చిన ఏడు శాతం ఓట్లే ఆప్ ఓటమికి కారణమయ్యాయనడంలో సందేహం లేదు.

 వాస్తవానికి ఆప్ ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీయే. సీట్లు సర్దుబాటు చేసుకోలేక విడివిడిగా పోటీ చేసి రెండు పార్టీలూ దెబ్బతిన్నాయి. దెబ్బతినడమే కాదు పువ్వుల్లో పెట్టి మరీ ఢిల్లీ పీఠాన్ని బీజేపీకి అప్పగించాయి. ఈ రెండింటికీ తోడు ఢిల్లీ మద్యం కుంభకోణం, అవినీతి ఆరోపణలు కూడా ఆప్ ఓటమిలో ప్రధాన భూమిక పోషించాయి.  మొత్తం మీద ఆప్ ఓటమికి బీజేపీ వ్యూహాలు, కాంగ్రెస్ వైఫల్యమే ప్రధాన కారణమని చెప్పాల్సి ఉంటుంది. 

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.