మిథున్ రెడ్డి కాషాయ తీర్థం.. జాప్యానికి కారణమేంటంటే?

Publish Date:Jan 18, 2026

Advertisement

వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ర రెడ్డి కమలం గూటికి చేరుతాడంటూ గత ఐదారు నెలలుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా మద్యం కుంభకోణంలో జైలు కెళ్లి బయటకు వచ్చిన మిథున్ రెడ్డి ఇక బీజేపీ తీర్థం పుచ్చుకోవడమ లాంఛనమేననీ, అయితే మిథున్ రెడ్డి కంటే ముందు మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజ‌య‌సాయిరెడ్డి  కూడా కమలం కండువా కప్పుకుంటారనీ గట్టిగా వినిపించింది. అయితే ఆ ప్రచారం ఇప్పటికీ ప్రచారంగానే మిగిలిపోయింది. ఇంతలో  విజ‌య‌సాయిరెడ్డి సొంతంగా  కొత్త  పార్టీ  పెడ‌తార‌ంటూ ప్రచారం మొదలైంది. ఆ మాట స్వయంగా విజయసాయిరెడ్డే చెప్పారు. 

అది పక్కన పెడితే  మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్ల‌డానికి ఆటంక‌మేంటి? అన్న చర్చ ఆరంభమైంది.   మిథున్ రెడ్డి  తండ్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి  వైసీపీలో అత్యంత కీలకమైన నేత. మిథున్ రెడ్డికి 2014- 24 మ‌ధ్య 500 శాతానికిపైగా ఆస్తుల పెరుగుద‌ల ఏమంత సులువుగా  జ‌ర‌గ‌లేదు. జ‌గ‌న్ కి అత్యంత స‌న్నిహితుడు మిథున్ రెడ్డి. స‌రిగ్గా అదే స‌మ‌యంలో జ‌గ‌న్ హయాంలో ఆయన కేబినెట్ లో పెద్దిరెడ్డి చాలా ముఖ్యుడు.  భారీ ఎత్తున‌ భూక‌బ్జాలు, అట‌వీ  భూముల ఆక్ర‌మ‌ణ‌లు, ఆపై ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ వంటి కార్య‌క‌లాపాలు య‌ధేచ్చ‌గా సాగాయనీ, తండ్రీ కొడుకులు పెద్దరెడ్డి, మిథున్ రెడ్డిలు కోట్లాది రూపాయ‌లు అక్రమంగా సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారన్న మరక ఉన్నందున మిథున్ రెడ్డి ఎంట్రీ విషయంలో బీజేపీ ముందువెనుకలాడుతోందని పరిశీలకులు అంటున్నారు.

అవినీతి మరక ఉన్నప్పటికీ బీజేపీ ఎంట్రీకి అదేమంత అడ్డంకి కాదని గతంలో పలువురి విషయంలో రుజువైంది. అయితే మిథున్ రెడ్డి విషయంలో మాత్రం కమలనాథులు కండీషన్లు పెట్టారనీ, అందుకే మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్ పడటానికి కారణమంటున్నారు. ఇంతకీ బీజేపీ పెట్టిన కండీషన్స్ ఏమిటంటే.. మిథున్ రెడ్డి బీజేపీ గూటికి చేరిన తరువాత ఇక జగన్ తో ఎటువంటి సంబధాలూ ఉండకూడదు.  లోపాయికారీ ఒప్పందాలేవీ చేసుకోకూడ‌దు. ఈ కండీషన్స్ కారణంగానే   మిథున్ రెడ్డి బీజేపీలో చేరికకు బ్రేక్ పడిందని అంటున్నారు. అంతే కాకుండా కేవలం మిథున్ రెడ్డి మాత్రమే కాకుండా ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో అనుచరులను కూడా తీసుకురావాలని బీజేపీ షరతు విధించిందనీ, అది కూడా మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీ జాప్యం కావడానికి కారణమంటున్నారు.  

ఇప్ప‌టికే వైసీపీలో కొంద‌రు సీనియ‌ర్లు.. సైలెంట్ మోడ్ లోకి వెళ్లి  పోయారు. అలాంటి వారితో క‌ల‌సి మిథున్ బీజేపీలోకి వ‌స్తే.. ఏపీలో కూడా పార్టీ బ‌ల‌ప‌డుతుంది. కాబ‌ట్టి.. అలా చేయ‌గ‌లిగితే త‌మ‌కేం అభ్యంత‌రం లేద‌ని కేంద్ర క‌మ‌ల‌నాయ‌క‌త్వం భావిస్తోంద‌ట‌. దీంతో ఇటు మిథున్ తో పాటు అటు విజ‌య‌సాయి  కూడా ఇలాంటి క‌మ‌లం బాట ప‌ట్టే వారి  కోసం తీవ్రంగా  య‌త్నిస్తున్నార‌ట‌. దీంతో మిథున్ బీజేపీ ఎంట్రీకి జాప్యం అవుతోందనీ, బీజేపీ కండీషన్లన్నిటినీ నెరవేర్చి  మిథున్ రెడ్డి బీజేపీకి వెళ్లేలోపు   2029 ఎన్నిక‌లు కూడా వ‌చ్చేలా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.