Publish Date:Sep 18, 2025
అధికారంలో ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయడం అన్నది తెలుగుదేశం తీరు అయితే.. వైసీపీ విధానం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది. విద్వేష, విధ్వంస, కక్ష పూరిత విధానాలే తమ బలమని వైసీపీ గట్టిగా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. అందుకు ఇటీవలి కాలంలో వైసీపీయులు చేస్తున్న బెంగళూరు భజనను ఉదాహరణగా చూపుతున్నారు పరిశీలకులు. ఇంతకీ వైసీపీ బెంగళూరు భజన ఎందుకు, ఎలా మొదలైందంటే.. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సీఈవో కర్నాటక రాజధాని నగరంలో మౌలిక సదుపాయాలు అత్యంత దారుణమని విమర్శిస్తూ.. ఇలాంటి నగరంలో తమ సంస్థను కొనసాగించడం ఇష్టం లేదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఓ విమర్శ చేశారు. బెంగళూరులో రవాణా కష్టాలు, మౌలిక సదుపాయాల కొరతకు తోడు.. రహదా రుల అధ్వాన పరిస్థితిపై ఆ పోస్టుతో జాతీయ స్థాయిలో చర్చకు తెరలేచింది. బెళ్లందూరు ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న బ్లాక్‌బక్ అరే కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పోస్టు బెంగళూరులో రహదారుల అధ్వాన స్థితికి అద్దం పట్టింది.
తమ కంపెనీ సిబ్బంది కార్యాలయానికి వచ్చి వెళ్లడానికి పట్టే కనీస ప్రయాణ సమయం గంటన్నరకు మించి ఉంటోందనీ, దీనికి తోడు నగరంలో పారిశుద్ధ్యం అధ్వానమనీ ఆయనా పోస్టులో పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదనీ, ఈ పరిస్థితి సమీప భవిష్యత్ లో మెరుగుపడుతుందన్న ఆశ లేదనీ ఆ పోస్టులో పేర్కొన్న సీఈవో ఈ పరిస్థితుల్లో తమ సంస్థను బెంగళూరులో కొనసాగించడం తనకు ఇసుమంతైనా ఇష్టం లేదని పేర్కొన్నారు.
సరిగ్గా ఇక్కడే నారా లోకేష్ రాష్ట్ర ప్రగతి, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ విషయంలో తనకున్న శ్రద్ధను, చిత్త శుద్ధినీ చాటుకున్నారు. బ్లాక్‌బక్ అరే కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజి బెంగళూరులో రవాణా కష్టాలు ప్రస్తావిస్తూ.. కంపెనీని అక్కడ నుంచి తరలించాలని భావిస్తున్నట్లు పోస్టు పెట్టిన గంటల వ్యవధిలో లండన్ పర్యటనలో ఉన్న లోకేష్ స్పందించారు. విశాఖపట్నంను హైలైట్ చేస్తూ.. బెంగళూరు నుంచి మీ సంస్థను తరలించాలని భావిస్తే.. విశాఖకు రావాలని కోరుతూ ఆయనను కోరారు. విశాఖ లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, అద్దాల్లాంటి రహదారులు ఉన్నాయనీ, శాంతి భద్రతల విషయంలో విశాఖ నంబర్ వన్ అని పేర్కొన్నారు.
దీంతో వైసీపీయులు ఒక్కసారిగా బెంగళూరు భజన ప్రారంభించేశారు. బెంగళూరు నుంచి పరిశ్రమను తరలించాలని లోకేష్ కోరడం ఇరు రాష్ట్రాల మధ్యా సత్సంబంధాలను దెబ్బతీయడమేనంటూ విమర్శలు గుప్పించడం ఆరంభించారు. అయినా ఒక రాష్ట్రంలోని కంపెనీని ఏపీకి తరలించాలంటూ ఎలా ఆహ్వానిస్తారంటూ మండిపడుతున్నారు. లోకేష్ చర్యలు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే చర్యగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. అయితే పరిశీలకులు మాత్రం మంత్రి నారాలోకేష్ స్పందన రాష్ట్ర ప్రయోజనాలు, ప్రగతి పట్ల ఉన్న చిత్తశుద్ధికి, శ్రద్ధకు తార్కానంగా విశ్లేషిస్తున్నారు. బెంగళూరు నుంచి తమ కంపెనీని తరలించాలని భావిస్తున్నట్లు సదరు కంపెనీ సీఈవో పేర్కొన్న తరువాతే లోకేష్.. ఏపీ బెస్ట్ చాయిస్ అంటూ ఆహ్వానించారనీ, అందులో తప్పేమిటనీ అంటున్నారు. అయితే ఏపీ అభివృద్ధి పట్ల ఇసుమంతైనా అక్కర లేని వైసీపీ మాత్రం బెంగళూరు నుంచి పరిశ్రమను లోకేష్ ఏపీకి ఆహ్వానించడం ద్వారా రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ గుండెలు బాదేసుకోవడం వెనుక తెలుగుదేశం ప్రభుత్వ ప్రతిష్ట, లోకేష్ ప్రతిష్ఠ పెరుగుతాయన్న దుగ్ధ తప్ప మరో కారణం లేదంటున్నారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/reason-behind-ycp-worry-about-bengalore-39-206397.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.