ఆన్ లైన్ వెనక గ్రేటర్ ప్లాన్! విపక్ష నేతలే టార్గెటా? అమ్మ కేసీఆర్..

Publish Date:Oct 7, 2020

Advertisement

తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ సాగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో జనాల ఆస్తుల లెక్క తేల్చే పనిలో పడ్డారు అధికారులు. అయితే సరైన మార్గదర్శకాలు లేకుండా హడావుడిగా సర్కార్ ఆదేశాలివ్వడంతో.. ఫీల్డ్ లో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తుల కొలతలపై ప్రభుత్వం దగ్గరే క్లారిటీ లేకపోవడంతో.. ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గందరగోళంగా, అయోమయంగా ఉన్న ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియను ఇంత హడావుడిగా ఎందుకు చేపట్టారన్న చర్చ జనాల్లో జరుగుతోంది. కొన్నేండ్లుగా కొత్త రెవిన్యూ చట్టం తెస్తామని మాత్రమే ముఖ్యమంత్రి చెబుతూ వచ్చారు. కొత్త రెవిన్యూ బిల్లును అసెంబ్లీలో పాస్ కూడా చేయించుకున్నారు. తర్వాత సడెన్ గా ఎవరూ ఊహించని రీతిలో ఆస్తుల ఆన్లై న్ చేపట్టాలని నిర్ణయించారు. అంతే హడావుడిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంతో క్లిష్టమైన ఆస్తుల ఆన్ లైన్ పై కేసీఆర్ కు ఎందుకంత తొందర అన్న విమర్శలు వస్తున్నాయి. 
                   

ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ వెనక కేసీఆర్ పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే టార్గెట్ గా ఆయన ఈ ప్రక్రియను చేపట్టారని సమాచారం. గ్రేటర్ ఎన్నికలకు గడువుకన్నా ముందే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రేటర్ ఎన్నికల కసరత్తును కూడా ప్రారంభించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. జీహెచ్ఎంసీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం. అధికార పార్టీకి మరింత ప్రాధాన్యం. జీహెచ్ఎంసీ పరిధిలో కోటి జనాభా, దాదాపు 70 లక్షల మంది ఓటర్లున్నారు. అంటే రాష్ట్రం మొత్తం జనాభాలో నాలుగో వంతు మంది ఇక్కడే ఉన్నారు. రాష్ట్రంలోని 25 శాతం మంది ప్రజల తీర్పు గ్రేటర్ లో రాబోతోంది. గ్రేటర్ లో వ్యతిరేక ఫలితాలు వస్తే.. అధికార పార్టీపై రాష్ట్రంలోని మెజార్టీ వర్గం అసంతృప్తిగా ఉన్నట్లే. అది తర్వాత ఆ పార్టీకి గండంగా మారుతుంది. అందుకే  బల్దియా ఎన్నికలను సవాల్ తీసుకున్న కేసీఆర్.. ఎలాగైనా మరోసారి పాగా వేసేలా పావులు కదుపుతున్నారు.  గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయబోయే విపక్ష నేతలను టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియను తెరపైకి తెచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

 

గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీ చేస్తే కోట్ల రూపాయల్లోనే ఖర్చు చేాయాల్సి వస్తోంది. పది నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు కూడా కొందరు వెనుకాడరు. గ్రేటర్ లో పోటీ చేయాలనుకునే అశావాహులు.. ఖర్చు కోసం తమ ఆస్తులను అమ్ముతుంటారు. ప్రతి ఎన్నికల ముందు ఇదే జరుగుతుంది. ఈ విషయం తెలిసిన కేసీఆర్.. తెలివిగా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియను తెచ్చారని చెబుతున్నారు. అందరి ఆస్తులు ఆన్ లైన్ చేస్తారు కాబట్టి... ఎవరూ తమ ఆస్తులు అమ్మినా ఇట్టే సర్కార్ కు తెలిసిపోతుంది. దీంతో విపక్ష నేతలెవరు ఆస్తులు అమ్ముతున్నారో తెలుసు కోవచ్చు. తర్వాత వారికి చెక్ పెట్టవచ్చు. తమ దారికి తెచ్చుకోవచ్చు. వినకపోతే అక్రమాస్తులు ఉన్నాయంటూ వేధించవచ్చు. మొత్తంగా తమకు పోటీగా ఉంటారని భావించే నేతలకు ఇలా చెక్ పెట్టవచ్చని కేసీఆర్ ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. అందుకే గ్రేటర్ ఎన్నికలకు ముందు హఠాత్తుగా ఈ ప్రక్రియను తెరపైకి తీసుకువచ్చారని విపక్ష పార్టీల నేతలు కూడా ఆరోపిస్తున్నారు. 
 

రెవిన్యూ సంస్కరణలు,  కొత్త రెవిన్యూ చట్టం, ఆస్తుల ఆన్ లైన్ విధానాలపై సీఎం కేసీఆర్  ఏకపక్షంగా వెళుతున్నారనే చర్చ ఐఏఎస్ ల్లో  జరుగుతుందని చెబుతున్నారు. వీటిపై ఉన్నతాధికారులతోన సీఎం సమగ్రంగా  చర్చిచంలేదని, తన ఆలోచనల ప్రకారమే ఆయన ముందుకు పోతున్నారని తెలుస్తోంది. కేసీఆర్ చేపట్టబోయే పథకాల గురించి విన్న కొందరు అధికారులు.. సరైన మార్గదర్శకాలు లేకుండా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ చేపడితే చాలా సమస్యలు వస్తాయని సీఎంకు చెప్పాలని చూసినా ఆయన స్పందించలేదట.  అందుకే కొందరు సీనియర్ అధికారులు ముందే జాగ్రత పడి బదిలీపై వేరే శాఖలకు వెళ్లినట్లు చెబుతున్నారు. సిన్సియర్ అధికారిగా పేరున్న సీనియర్ ఐఏఎస్ చిరంజీవులు కూడా కేసీఆర్ చేస్తున్న పనులు నచ్చకే వేరే శాఖకు వెళ్లారనే చర్చ తెలంగాణ సచివాలయంలో ఉంది. హడావుడిగా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ చేపడితే  సమస్యలు వస్తాయని సహచర అధికారులతో చిరంజీవులు చెప్పినట్లు చెబుతున్నారు. 

 

గ్రేటర్ ఎన్నికలే టార్గెట్ గా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియను కేసీఆర్ చేపట్టారనే ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. విపక్ష నేతలను ఇబ్బంది పెట్టేందుకు అస్తవ్యస్థ విధానాలు చేపట్టడమేంటనే ప్రశ్న ప్రజా సంఘాల నుంచి వస్తోంది. ప్రజలకు ఆస్తులంటే సెంటిమెంట్. అలాంటి సున్నితమైన విషయంలో హడావుడిగా ముందుకు పోతే మొదటికే మోసం వస్తుందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.