అమ్మ కేసీఆర్.. ప‌దేళ్ల పాటు సినిమా అవార్డులు ఎందుకివ్వ‌లేదో తెలిస్తే షాక్

Publish Date:May 31, 2025

Advertisement

కేసీఆర్ సినిమా ఇండ‌స్ట్రీని ఎందుకో చిన్న చూపు చూశారేమో అనిపిస్తుంది చాలా మందికి. అయితే సినిమా వారితో మాత్రం కేసీఆర్ కుటుంబం స‌త్సంబంధాలు బాగానే నెరిపారు. ఒక ప‌క్క చూస్తే నాగార్జున భార్య అమ‌ల‌కూ, క‌విత‌కూ స్నేహ‌ముండేద‌ని అంటారు. మ‌రో ప‌క్క చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌మంత సైతం ఈ ప్ర‌భుత్వంతో అంట‌కాగిన‌ట్టు చెబుతారు. ఇక ప్ర‌కాష్ రాజ్ కూడా ఒక దశ‌లో బీఆర్ఎస్ లో చేరుతార‌నే ప్రచారం కూడా జరిగింది. 

ఇక కేసీఆర్ ప్ర‌భుత్వ చివ‌రి  రోజులలో క‌రోనా రావ‌డం. సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా.. శ్రీనివాస యాద‌వ్ హ‌డావిడీ.. దాస‌రి త‌ర్వాత అంత‌టి సినీ ప‌ర్స‌నాల్టీ చిరంజీవి అన్న గౌర‌వ మ‌ర్యాద‌లు.. అంతా బాగుండేది.  కానీ సినిమా అవార్డులు మాత్రం ఇచ్చేవారు కాదు.  బీఆర్ఎస్ హ‌యాంలోనే తెలంగాణ యాస‌లో ఫిదా, బ‌ల‌గం వంటి సినిమాలు రావ‌డం.. ఆపై విజ‌య్ దేవ‌ర‌కొండ‌లాంటి అచ్చ తెలంగాణ‌కు చెందిన ఒక కుర్రాడు ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ బేధాల‌కు అతీతంగా హీరోగా ఎద‌గ‌డం. చాంబ‌ర్లు కూడా వేరు కావ‌డం.. తెలంగాణ ద‌ర్శ‌కులు బాగా పెర‌గ‌డం. ఉదాహ‌ర‌ణ‌కు సందీప్ రెడ్డి వంగ‌, నాగ అశ్విన్.. ఇలా ర‌క‌ర‌కాలుగా తెలంగాణా సినీ అభివృద్ధి పరిఢవిల్లిందనే చెప్పాలి.  

తెలంగాణ సినిమాకు కావ‌ల్సింది అవార్డులు కావు.. వాటికంటూ ఒక పాల‌సీ అంటారు ఇంకొంద‌రు. గ‌తంలో ప్ర‌భుత్వ ప‌రంగా ఏదైనా స‌హాయ స‌హ‌కారాలు వెళ్తే అదంతా ఆంధ్రుల‌కే వెళ్లింద‌న్న అప‌వాదు ఉండేది.  అంతెందుకు ఇదే ఉద్య‌మ కాలంలో కొంద‌రు రాఘ‌వేంద్ర‌రావు వంటి వారు స్టూడియోల‌కు స్థ‌ల‌మిస్తే క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్సులు క‌ట్టార‌న్న గొడ‌వ జ‌రిగింది. అలాగ‌ని కేవ‌లం స్టూడియో మాత్ర‌మే క‌డితే.. అది మ‌రో రామానాయుడు స్టూడియోలా త‌యార‌య్యే ప్ర‌మాదం కూడా ఉంది. ఈ స్డూడియో స‌రిగా న‌డ‌వ‌క‌.. క‌రెంటు చార్జీలు క‌ట్ట‌డానికి కూడా ఇబ్బంది క‌రంగా మారింది. ఇపుడీ స్టూడియోను ఉంచకోలేక‌, తీయ‌లేక సురేష్ అవ‌స్త‌లు ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇలాంటి గొడ‌వ‌లు చాలానే.  

అయితే బీఆర్ఎస్ పాల‌న‌లో ఎన్ శంక‌ర్ వంటి వారికి స్టూడియో నిర్మాణాల‌కు 5 ఎక‌రాల‌ స్థ‌లం ఇచ్చారు. త‌ర్వాత ఎవ‌రికీ పెద్ద‌గా ఈ దిశ‌గా ఎంక‌రేజ్ మెంట్ జ‌ర‌గ‌లేదు. కేసీఆర్ స్వ‌యానా ర‌చ‌యిత‌. తెలుగు సాహితీ  పిపాసి కూడా.  జైబోలో తెలంగాణ వంటి  సినిమాల ద్వారా కూడా ఆయ‌న త‌న ఉద్య‌మాన్ని న‌డిపించారు. అందులో ఒక పాట కూడా రాశారు. అయినా కూడా ఆయ‌నెందుకో తెలుగు సినిమా అవార్డుల‌ని ఇంత పెద్ద ఎత్తున ఇవ్వ‌లేదు. అస్స‌లు ప‌ట్టించుకోలేదు. 

ఇక ఆనాడు ఎన్టీఆర్, ఏఎన్నార్ల‌తో స‌మానంగా తెలుగు తెర‌ను ఏలిన కాంతారావు, కుటుంబం దీన ప‌రిస్థితుల్లో ఉంది. ఈ విష‌యంలో కూడా కేసీఆర్ గానీ, ఆయ‌న కుటుంబ స‌భ్యులుగానీ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. క‌రీంన‌గ‌ర్ కి చెందిన‌ పైడి జ‌య‌రాజ్ అనే ఒక న‌టుడు బాలీవుడ్ స్థాయికి ఎదిగారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా పొందారు. ఆయ‌న కుటుంబాన్నీ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. గ‌తంలో విల‌న్ పాత్ర‌లు వేసిన ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా ఇక్క‌డి వారే. ఆయ‌న అయితే ఏకంగా చిత్ర‌పురి కాల‌నీ కోసం త‌న విలువైన స్థ‌లాన్ని కూడా ఇచ్చారు. ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు.  

టోట‌ల్ గా గ‌ద్ద‌ర్ అవార్డుల వ‌ల్ల మీకు హ్యాపీయేనా అని అడిగితే కొంద‌రు మాత్రం నాట్ హ్యాపీ అంటున్నారు.  ఎందుకంటే ఒక గ‌ద్ద‌ర్ అవార్డును స్మ‌గ్ల‌ర్ పాత్ర‌కు ఇవ్వ‌డం స‌రికాద‌ని చెబుతారు వీరు. అంతే కాదు ఒక రైట్ వింగ్ సినిమా ర‌జ‌కార్ కి లెఫ్ట్ వింగ్ ప్ర‌తీక అయిన గ‌ద్ద‌ర్ అవార్డు ఇవ్వ‌డ‌మేంటి? అస‌లు ఈ అవార్డుల‌న్నీ ఎవ‌రికి వెళ్లాయ్? ఈ అవార్డుల క‌మిటీలోని జ‌య‌సుధ‌, ముర‌ళీ మోహ‌న్ ఎవ‌రు? 

వీరిలో ఎవరికీ కూడా అవార్డు సినిమా గుర్తింపే తెలీదు. వీరి ముందుకు స‌త్య‌జిత్ రే, శ్యాంబెన‌గ‌ల్ సినిమాల‌ను తీసుకొచ్చి పెట్టినా.. వాటిని తీసి ప‌క్క‌న పడేస్తారు. వీరు త‌మ‌కున్న సినిమా ప‌రిజ్ఞానంతో ఈ అవార్డులు ఇవ్వ‌లేదు. త‌మ‌కున్న ప‌రిచ‌యాల‌తో ఇచ్చారు త‌ప్పించి ఇందులో మ‌రేదీ లేదు. కావాల‌ని ప‌ట్టుబ‌ట్టి కావాల‌ని కొన్ని సినిమాల‌కు కొంద‌రు న‌టుల‌కు రాజ‌కీయ ఉద్దేశాల‌ను అనుస‌రించి అవార్డులిచ్చిన ప‌రిస్థితి కూడా ఉందంటూ.. కామెంట్ చేస్తున్నారు కొంద‌రు తెలంగాణ ద‌ర్శ‌కులు.

అందుకే కేసీఆర్ ఈ అవార్డులు ఇవ్వ‌లేద‌ని అంటారు వీరు. ఈ కామెంట్ల‌ను బ‌ట్టి చూస్తే ఒక వేళ అవార్డులే ఇవ్వాల్సి వ‌స్తే అది ఆంధ్రోళ్ల‌కే ఎక్కువ అవార్డులు వెళ్తాయ‌న్న కోణంలో ఈ అవార్డుల‌ను కేసీఆర్ ప‌క్క‌న పెట్టేశార‌ని కంక్లూడ్ చేస్తున్నారు. అంటే కేసీఆర్ కేవ‌లం ఆంధ్ర తెలంగాణ బేధాన్ని క‌ళ‌ల్లోనూ చూపించార‌న్న‌మాట‌. కాబ‌ట్టే ప‌దేళ్ల పాటు సినిమా అవార్డులివ్వ‌లేద‌న్న‌మాట‌. అమ్మ కేసీఆర్ అంటూ ఇప్పుడు నోళ్లు నొక్కుకుంటున్నారు కొంద‌రు.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.