నిన్నటి దాకా ఒకలా నేడు ఇలా... బీజేపీ పట్ల కేసీఆర్ వైఖరి ఎందుకు మారిందంటే?

Publish Date:Apr 22, 2022

Advertisement

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న పార్టీలా కాకుండా...ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పటి దూకుడు ఎందుకు ప్రదర్శిస్తున్నది. అధికారంలో ఉండి హుందాగా వ్యవహరించాల్సింది పోయి...బీజేపీపై ఎందుకు అలా విరుచుకుపడుతోంది?
రాష్ట్రంలో బీజేపీ బలోపేతమౌతున్నదన్న సంకేతాలా టీఆర్ఎస్ వైఖరి మారడానికి కారణమన్నది విశ్లేషకులు చెబుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత అగ్రసివ్ గా ఉండక పోతే మూడో సారి అధికారం కలగానే మిగిలిపోతుందన్న అంచనాకు వచ్చిన పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీజేపీపై ఎదురుదాడి తోనే ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అందుకు అనుగుణంగానే పార్టీ శ్రేణులకు కూడా మార్గనిర్దేశనం చేశారు. ముందస్తు ఎన్నికల ప్రశక్తే లేదని పైకి చెబుతున్నా....ఆయన ప్రకటనలు, హామీలూ, ప్రత్యర్థులపై విమర్శ తీవ్రత పెరగడం చూస్తుంటే ముందస్తుకు మొగ్గు చూపుతున్నారా అనిపించక మానదు.
ఇక తెరాస మంత్రులు, నేతలు  బీజేపీ విమర్శలకు దీటుగా బదులిస్తున్నామన్న పేరుతో భాష మార్చేశారు. గౌరవానికి తిలోదకాలిచ్చేశారు. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలూ సర్వసాధారణమే అయినా, ప్రస్తుతం బీజేపీ- తెరాసల మధ్య మాటల యుద్ధాన్ని విమర్శల పర్వాన్నీ చూస్తుంటే...రాజకీయ మర్యాద అన్న మాటే రెండు పార్టీలూ మరచిపోయాయనిపించక మానదు.  
ఇక రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతున్నదన్న అంచనాకు వచ్చిన కేసీఆర్, బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవాలన్న ఆత్రమో మరోటో కానీ ఆయన రాజకీయంగా పార్టీకి నష్టం కలగించే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులున్నా...సాగు నీరు పుష్కలంగా అందుతుండటంతో రైతులు కేసీఆర్ పట్ల సానుకూలంగా ఉన్నారు. అయితే ధాన్యం కొనుగోలు విషయంలో లేని రాద్ధాంతాన్ని సృష్టించి కేసీఆర్ సృష్టించిన గందరగోళం బూమరాంగ్ అయ్యిందనే చెప్పాలి. యాసంగి ధాన్యం కొనుగోలు చేయబోమనీ, వరి పండిస్తే ఉరే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలు కేసీఆర్ పట్ల, టీఆర్ఎస్ పట్లా రైతుల వ్యతిరేకతకే దోహదపడ్డాయి. 
కేంద్రంపై కాలు దువ్వడానికి అనవసరంగా రైతును లాగి కేసీఆర్ చేతులు కాల్చుకున్నారని పరిశీలకులు విశ్లేషస్తున్నారు.
 ఇటీవలి కాలం వరకూ బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అన్న ముద్ర ఉండింది. దాని నుంచి బయటపడాలన్న యావతోనో.. మరో ఉద్దేశంతోనో కేసీఆర్ మాత్రం తన దుందుడుకు వైఖరీ, హడావుడి నిర్ణయాలతో వరుస తప్పిదాలు చేస్తున్నారు.  ధాన్యం కొనుగోళ్ల వ్యవహారమే తీసుకుంటే...కేంద్రం బాధ్యతారాహిత్యమంటూ విమర్శలు గుప్పించిన కేసీఆర్ కేంద్రం మెట్టు దిగి రాకపోవడంతో తానే కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. ఇది ముందే చేసి ఉంటే రైతులలో ఆయన పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండేది కాదు.
మోడీ సర్కార్ తీసుకు వచ్చిన రైతు చట్టాలను దేశ వ్యాప్తంగా అన్ని బీజేపీయేతర పార్టీలూ వ్యతిరేకిస్తే సమర్ధించిన ఏకైక సీఎం కేసీఆర్. రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి మద్దతు సంగతి అటుంచితే...కనీసం రైతు ఆందోళనపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  మోడీకి ఇంత కాలం వత్తాసుగా ఉన్న కేసీఆర్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని మోడీ వ్యతిరేకత అన్న విధానాన్ని ఎంచుకున్నారు.
   వెూడీ ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలపై కూడా టీఆర్‌ఎస్‌ మొదట తటస్థ వైఖరిని అనుసరించింది. రైతు ఆందోళనలకు మద్దతు ఇవ్వలేదు. చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేయలేదు. ఈ వైఖరి వెూడీ కనుసన్నల్లో కేసీఆర్‌ నడుస్తున్నారనే భావన కలిగించింది. ఈ ఏడేళ్లలో ఈ భావన బలపడింది.
అయితే  హుజురాబాద్‌ ఉప ఎన్నికల ఫలితం తరువాత టీఆర్ ఎస్ లో, కేసీఆర్ వైఖరిలో స్పష్టమైన మార్పు కానవస్తున్నది.  భారతీయ జనతా పార్టీ వర్గాలలో ఫ్రెండ్లీ పార్టీగా పేరున్న తెలంగాణ రాష్ట్ర సమితి చివరకు ఎదరుదాడికి దిగే పరిస్థితి తెచ్చుకోవడం వెనక బిజెపి బలపడకుండా చూడాలన్న లక్ష్యం తప్ప మరోటి కనిపించదు. తెలంగాణలో పెరుగుతున్న బీజేపీ బలానికి నిదర్శనంగా విశ్లేషకులు ఈ పరిణామాలను చూస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో నాలుగు లోకసేభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా బిజెపి పుంజుకుంది. నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి చేతిలో కేసీఆర్‌ కూతురు కవిత ఓటమి పాలైంది. దాంతో టీఆర్‌ఎస్‌ అప్రమత్తమైంది. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శన టీఆర్‌ఎస్‌లో గుబులు రేపింది. ఇటీవల హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఓటమి కేసీఆర్‌ కు పెద్ద షాక అని చెప్పాలి. తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కేసీఆర్‌ ఆందోళనకు కారణం కావచ్చు. ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అంశాల ప్రాతిపదికన పోరాడేందుకు టీఆర్‌ఎస్‌ ఇతర ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపింది.  అయితే ఇంత కాలం కేసీఆర్ సర్కార్ మోడీ అనుకూల వైఖరి కారణంగా బీజేపీయేతర పార్టీల కూటమి ఏర్పాటు ప్రక్రియ అంత సజావుగా సాగడం లేదు. కేసీఆర్ తీరును గమనించినన బీజేపీ యేతర పార్టీలు కేసీఆర్ నాయకత్వంలో సమష్టి కార్యాచరణకు సుముఖత వ్యక్త పరచడం లేదు. ఈ పరిస్థితిలో బీజేపీ వ్యతిరేక వైఖరే తనకు ప్రజాబలంగా మారుతుందన్న ఆశాభావంతో కేసీఆర్ ఉన్నారు.

By
en-us Political News

  
చిరంజీవి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో రెన్నోవేషన్ పనులు చేపట్టారు. అందులో భాగంగా రిటైన్ వాల్ నిర్మించారు. ఇంటి పునరుద్ధరణలో భాగంగా తాను చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని చిరంజీవి జిహెచ్ఎంసి కి దరఖాస్తు చేసుకున్నారు.
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లొ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం, అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ సీనియర్ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. బుధవారం (జులై 16) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి.
రాష్ట్రీయ సయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్.. ఇంచుమించుగా వారం రోజుల కిందట ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జూలై 9న ప్రధానమంత్రి రిటైర్మెంట్ గురించి, సూచన ప్రాయంగా చేసిన వ్యాఖ్య రాజకీయ సంచలనంగా మారింది.
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్.. అన్నారు చిలకమర్తి వారు. ప్రసన్నయాదవం పద్యకావ్యంలో... నాలుగు పాదాల చంపకమాల పద్యంలో ఇది నాలుగో పాదం. తెలుగు భాషఫై కొద్దిపాటి మక్కువ, కొంచెంగా ప్రవేశం ఉన్న ఎవరికైనా ఈ పద్య పాదం తరచూ గుర్తుకు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా.. డ్రైవర్ సంధ్యారాణి వంటి వారి కథలు విన్నపుడు చిలకమర్తి వారి పద్యం చటుక్కున వచ్చి నాలుక పై వాలుతుంది.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. లైఫ్‌ అండ్‌ లెగసీ ఆఫ్‌ పీవీ అంశంపై సీఎం ఢిల్లీలో ప్రసంగించిన చంద్రబాబు . అనేక పార్టీలను ఒప్పించి పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చారన్నారు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ చెత్త రికార్డ్ నమోదు చేసింది. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో విండీస్ రెండో అత్యల్ప స్కోరు చేస్తే... ఆస్ట్రేలియా టీమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది
లాస్‌ ఏంజెలెస్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు కూడా చోటు దక్కింది. చివరిసారిగా 1900 ఒలింపిక్స్‌లో మాత్రమే క్రికెట్ ఆడారు. ఈ క్రీడా సంరంభంలో భాగంగా 2028 జులై 12 నుంచి క్రికెట్ మ్యాచులు మొదలు అవుతాయి.
ఆశలన్నీ ఆవిరై పోయిన సందర్భంలో.. కేరళ నర్స్‌ నిమిష ప్రియకు ఊరట లభిచింది. మరో కొన్ని గంటల్లో ఉరి కంబం ఎక్కవలసిన ఆమెకు, యెమెన్‌ ప్రభుత్వం ఉరి శిక్షను వాయిదా వేసి, మరో ఆశకు ప్రాణం పోసింది.
తెలంగాణలో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి సంవత్సరన్నరపైగా అవుతుండటం, పరిషత్‌ల గడువు ముగిసి సంవత్సరం పూర్తవుతుండటంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండి, నిధులు రాక అభివృద్ధి కుంటుపడింది.
వైసీపీ సీనియర్ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.
వైయస్సార్ కడప జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో దారుణం జరిగింది.ఇక్కడ ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. హత్య గురైన బాలిక మృతదేహం ముళ్ళపొదల్లో నగ్నంగా పడి ఉండడం చూస్తే హంతకుడు హత్యాచారానికి పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.