స్వామీ ఏమి ఈ క్రిష్టియ‌న్ ప్రేమ‌! బేసిగ్గా హిందూ ద్వేష భావ‌జాల‌మా?

Publish Date:Apr 21, 2025

Advertisement

సుబ్ర‌హ్మ‌ణ్య స్వామికి  చంద్ర‌బాబు అంటే అంత ద్వేషం ఎందుకు?
జ‌గ‌న్ అంటే వ‌ల్ల‌మాలిన‌ అభిమానం.. కార‌ణ‌మేంటి?
అస‌లు స్వామికి  తిరుమ‌ల తిరుప‌తి అంటే అంత ఇంట్ర‌స్ట్ ఏంటి?
సాటి సామాజిక వ‌ర్గ‌పు జ‌య‌ల‌లిత‌ను వ‌ద‌ల‌ని స్వామి
క్రిష్టియ‌న్ అయిన జ‌గ‌న్ అంటే ప్ర‌త్యేక ప్రేమ క‌న‌బ‌రుస్తారెందుకు?

2021లో ప‌రువు న‌ష్టం దావా..
2023లో శ్రీవాణి విష‌యంలో బాబు, ప‌వ‌న్ పై ఆరోప‌ణ‌లు..
2024లో ల‌డ్డు నెయ్యి క‌ల్తీ వ్య‌వ‌హారంలో బాబు వ్యాఖ్య‌ల ఆధారంగా భ‌ద్ర‌త‌పై ప్ర‌శిస్తూ పిటిష‌న్..
2025లో టీటీడీ చైర్మ‌న్ వ‌య‌సు మ‌ళ్లిన మ‌నుషుల‌కు మ‌ల్లే ఆవులు సైతం చనిపోతాయ‌న్న కామెంట్ల‌పైనా కేసు వేస్తాన‌న‌డం..
అదే జ‌గ‌న్ పాల‌న‌లో క‌నీసం ఒక్క మాట కూడా అన‌ని స్వామి- అంత‌ర్యం ఏమిటి? అని చూస్తే..
పై నాలుగు ఘ‌ట‌న‌ల్లో స్వామి డైరెక్టుగా కానీ.. ఇన్ డైరెక్టుగా కానీ సుబ్రహ్మణ్య స్వామి చంద్ర‌బాబును అటాక్ చేశార‌న‌డానికి మ‌న ద‌గ్గ‌రున్న ఆధారాలు. బీజేపీకి ప్రాతినిథ్యం వ‌హించే స్వామి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్.. త‌మ కూట‌మిలో భాగ‌స్వామ్యం అన్న క‌నీస  జ్ణానం కూడా లేకుండానే కామెంట్లు  ఎందుకు చేస్తుంటారో అర్ధం కాదు..  తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డం మాత్ర‌మే కాకుండా.. ఆపై కేసులు కూడా వేస్తుంటారు.   

ఇదే స్వామికి క్రిష్టియ‌న్ జ‌గ‌న్ అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. అంతులేని ప్రేమతో కూడిన‌ వాత్సల్యాన్ని క‌న‌బ‌రుస్తుంటారు. అదేమంటే జ‌గ‌న్ హ‌యాంలో తాను తిరుమల తిరుపతి దేవస్ధానం ఆదాయ వ్య‌యాల‌పై కాగ్ ఆడిట్ చేయించాల‌ని కోర‌గా.. అందుకు ఆయ‌న‌ ఒప్పుకున్నారు. దీంతో స్వామి..  జ‌గ‌న్ ని ప‌ల్లెత్తు మాట కూడా అన‌ర‌ని చెబుతారు.

కానీ ఇక్క‌డే స్వామిని అనుమానించాల్సి వ‌స్తోంది. ఇదే స్వామి ఇటు నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీల‌ను, అటు అక్ర‌మాస్తుల కేసులో జ‌య‌ల‌లిత వంటి వారిని కోర్టు కీడ్చారు. మ‌రీ ముఖ్యంగా  జ‌య త‌న ప‌ద‌వి వీడేలా చేసిన ఘ‌న‌త సుబ్ర‌హ్మ‌హ్మ‌ణ్య స్వామిది.
సుబ్ర‌హ్మ‌ణ్య స్వామికి టీటీడీ అంటే ఎందుకంత ఆస‌క్తి అంటే తిరుపతి హైంద‌వ ఆధ్యాత్మిక బాంఢాగారం.. అక్క‌డ ఏ చిన్న త‌ప్పిదం జ‌రిగినా ఒక బాధ్య‌త కొద్దీ  తాను స్పందిస్తాన‌ని అంటారాయ‌న‌. స‌రిగ్గా అదే స‌మ‌యంలో సోనియా, జ‌య‌ల‌లిత వంటి వారి విష‌యంలో అవినీతి మ‌కిలిని తుద‌ముట్టించే వ‌ర‌కూ తాను నిద్రించేది లేద‌ని.. అంటారు. బేసిగ్గా తాను అంత‌టి నీతి మంతుడ్న‌ని తెలియ చేస్తుంటారు.

ఇక్క‌డ మ‌రో విచిత్ర‌మైన విష‌య‌మేంటంటే చెన్నై మైలాపూర్ లో పుట్టిన స్వామి   బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. జ‌యల‌లిత‌ సైతం అదే సామాజిక వ‌ర్గానికి చెందిన వారే. అందుకే ఆమె తానెంత‌టి సీఎం స్థాయి వ్య‌క్తినైనా కుంభ‌కోణం వంటి  బ్రాహ్మ‌ణ ఆధిప‌త్యం గ‌ల నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ  చేస్తుంటారు. సాటి సామాజిక వర్గానికి చెందిన  జ‌య అంటే కూడా స్వామికి  ప‌డ‌దు. అదేమంటే ఆమె చుట్టూ పేరుకుపోయిన‌ అవినీతే అస‌లు కార‌ణం అంటారు.

సాటి సామాజికవర్గానికి చెందిన జయలలిత ప‌ట్ల కూడా అంత‌టి విద్వేషం  క‌న‌బ‌ర‌చే స్వామికి జ‌గ‌న్ అవినీతి ఎందుకు క‌నిపించ‌దు? అన్న  ప్ర‌శ్న‌కు స‌మాధానం  వెత‌కాలి. జ‌గ‌న్ పై ఎంత‌టి అవినీతి ఆరోప‌ణ‌లున్నాయో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికీ ఆయ‌న బెయిలుపై తిరుగుతోన్న   అవినీతి కేసుల నిందితుడు. అలాంటి స్వామి క‌నీసం జ‌గ‌న్ మీద రాంగ్ కామెంట్లు కూడా చేయ‌రు.

ఇదే జ‌గ‌న్ తాను క్రిష్టియ‌న్ కావ‌డ‌మే కాదు.. టీటీడీకి కూడా ఒక క్రిష్టియ‌న్ని చైర్మ‌న్ గా చేశారు.  అప్పుడు స్వామికి క‌నీసం నోరు పెగ‌ల‌దు. అంతే కాదు జ‌గ‌న్ ఎప్పుడైనా తిరుమ‌ల‌కు వెళ్తే ఒక క్రిష్టియ‌న్ గా డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌రు. అప్పుడు కూడా స్వామికి ఏదైనా కామెంట్ చేయాల‌న్న ఆలోచ‌న రాదు. జ‌గ‌న్ సాక్షాత్తూ శ్రీవారి ప‌విత్ర‌త‌ను మంట‌గ‌లుపుతూ.. ఇంటి ముందే ఆల‌యం సెట్ వేశారు. అప్పుడు కూడా  స్వామి నోరు మెదపలేదు.

I am a devotee of Lord Venkateswara. Tirumala is not just a temple, it is a national treasure for Hindus,, అని చెప్పే సుబ్ర‌హ్మ‌ణ్య‌ స్వామికి శ్రీవారి భ‌క్తుల‌పైకి చిరుత పులుల‌ను వ‌దులుతుంటే ప‌ట్ట‌దు. ఇక వాటిని త‌ర‌మ‌డానికి చేతి క‌ర్ర‌ల‌ను ఇస్తుంటే చోద్యం చూస్తుంటారు. అదేమంటే శ్రీవాణి విష‌యంలో జ‌రిగే అవ‌క‌త‌వ‌క‌ల గురించి బాబు, ప‌వ‌న్ మాట్లాడితే మాత్రం విరుచుకుప‌డిపోతారు.

క్రిష్టియ‌న్ జ‌గ‌న్ కి బ్రాహ్మిన్ స్వామికీ ఉన్న లింకేంటి? ఇరువురి మ‌ధ్య ఉన్న సంబంధ‌బాంధ‌వ్యాలేంటి?.. శ‌బ‌రిమ‌ల‌, రామ‌సేతు ప‌రిర‌క్ష‌ణ‌పై పిటిష‌న్లు వేసి హిందుత్వం అన్నా హైంద‌వ ఆచార వ్య‌వ‌హారాల‌కు కించిత్ భంగం క‌లిగినా.. కేసుల‌తో విజృంభించే స్వామికి.. తిరుమ‌ల ల‌డ్డూలో నెయ్యి క‌ల్తీ జ‌రిగితే గొడ‌వ‌కు దిగాల్సింది ఎవ‌రితో?  రివ‌ర్స్ లో ఈ విష‌యం వెలుగులోకి తెచ్చిన బాబునే త‌ప్పు ప‌డ‌తారు. ఇదెక్క‌డి విడ్డూరం??? అన్న‌ది శ్రీవారి భ‌క్తుల‌కు వ‌చ్చే అనుమానం. 

టీటీడీ అంటే హిందూ ధార్మిక సంస్థ అయిన‌ప్పుడు అక్క‌డ 2వేల‌కు పైగా అన్య‌మ‌త‌స్తులు ఉద్యోగాలు చేస్తుంటే స్వామికి ఎందుకు ప‌ట్ట‌దు? ఇదే అంశంలో నాటి సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం తీవ్ర స్థాయిలో పోరాడి.. త‌న సీఎస్ వంటి కీల‌క ప‌ద‌విని సైతం కోల్పోయారు. హైంద‌వ ఆల‌యాల్లో అన్య‌మ‌త‌స్తుల‌కు తావు లేద‌న్న పాయింట్ మీద జ‌గ‌న్ తో బ‌రాబ‌ర్ ఫైట్ చేసి.. ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. అంతే త‌ప్ప ఎంత‌కీ త‌ల వంచ‌లేదు.

అలాంటి పేరే గ‌ల సుబ్ర‌హ్మ‌ణ్య స్వామికి జ‌గ‌న్ అన్నా, ఆయ‌న పాల‌న‌లో టీటీడీలో జ‌రిగిన గోల్ మాల్ వ్య‌వ‌హారాల‌న్నా ఎందుకు ప‌ట్ట‌ద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం రావాల్సి ఉంది. ఇదే టీటీడీ గోశాల‌లో స్వ‌దేశీ ఆవులనే ఎక్కువ‌గా పెంచి పోషించాలన్న నిబంధ‌న ఉంది. ఇక్క‌డా ఆ నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడుస్తూ.. జ‌గ‌న్ హ‌యాంలో గో.. గోల్ మాల్ జ‌రిగితే.. స్వామికి క‌నీసం ప్ర‌శ్నించాల‌ని అనిపించ‌దు. ఇది ఎందుకో తేలాల్సి ఉంది. 

జ‌గ‌న్ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి మ‌ధ్య ఏవైనా ఒప్పందాలున్నాయా? లేక మ‌రేదైనా  మ‌త‌ల‌బు దాగి ఉందా? ఆ స్వామివారే వెలికి తీయాలి..  త‌మ‌ కూట‌మి  ప్ర‌భుత్వ పాల‌న అన్న క‌నీస కన్సర్న్ లేకుండా స్వామి చేస్తున్న ఈ ఆధ్యాత్మిక విధ్వంసానికి అడ్డుక‌ట్ట ఎప్పుడో కూడా ఆ వెంక‌టేశ్వ‌రుడే చెప్పాల‌ని అంటున్నారు ప‌లువురు శ్రీవారి భ‌క్తులు.

By
en-us Political News

  
ఏపీలో మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గోన్నారు.
పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని రాజ్యసభ నేత కపిల్ సిబల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉపా చట్టాన్ని ఉపయోగించాలని ఆయన సూచించారు.
భారత్‌, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ నేటి నుంచి పున:ప్రారంభం కానుంది. పఠాన్‌ కోట్‌, జమ్ములో పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడుల నేపథ్యంలో మే 8న ధర్మశాలలో దిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో.. తొమ్మిది రోజుల అనంతరం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పునఃప్రారంభం కానుంది.
ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. 138 దేశాలతో పోటీపడి ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలవడంపై సీవీ ఆనంద్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబుకు హైదరాబాద్‌ నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. 2017లో కాళేశ్వరం ప్రాజెక్టుకు భూసేకరణ సమయంలో ఆయనపై నమోదైన కేసును కొట్టిసింది.
విజయవాడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ వల్లభనేని వంశీకి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. వివిధ కేసుల్లో రిమాండ్‌ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీ మీద తాజాగా మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. గన్నవరంలో భారీగా అక్రమ మైనింగ్‌ కేసుకు పాల్పడ్డారని ఆరోపణల మీద ఒక కేసు, నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలతో మరో కేసును నమోదు చేశారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ... ఇస్రో శ్రీహరికోట నుంచి ఇప్పటివరకు 100 రాకెట్లను ప్రయోగించింది. 101వ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. విజయం పరంపరంలో కొనసాగుతున్న ఇస్రో ఈ ప్రయోగాన్ని కూడా విజయవంతం అయ్యేందుకు శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారు.
మిస్ వరల్డ్ పోటీల సందర్బంగా హైదరాబాద్ సచివాలయం దగ్గర కలకలం చోటుచేసుకుంది. సెక్రటేరియట్ వద్ద వివిధ దేశాల జెండాలు ఏర్పాటు చేయగా ఇజ్రాయిల్ జెండాను జకీర్ అనే వ్యక్తి తొలగించాడు
ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తమదైన బ్రాండ్ ఉన్న నేతల్లో ప్రస్తుత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ పేరు చెప్పగానే టీడీపీ అధికారంలోకి రావడానికి తొలిమెట్టు ఆయనే అని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. వైసీపీ అధికారంలో ఉండగా ఎన్నికలకు సుమారు ఏడాది ముందు అధికార పార్టీలో ఉండి అసమ్మతి బావుటా ఎగురవేశారు. దాంతో అప్పటి అధికార పార్టీ సందిగ్ధంలో పడింది. ఆయన విమర్శలను కట్టడి చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. మరో వైపు ఈడీ కూడా రంగ ప్రవేశం చేసింది. ఇప్పటికే ఈ కేసులో జగన్ కు అత్యంత సన్నిహితుడైన రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారేందుకు రెడీ అయ్యారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఈడీ కూడా రాజ్ కేసిరెడ్డిని విచారించి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
బుకాయించడానికి, బొంకడానికి పాక్ కు ఇక ఏ అవకాశమూ లేకుండా పోయింది. అందుకే పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎలాంటి శషబిషలకూ తావులేకుండా, తటపటాయించకుండా భారత్ పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై దాడులు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించేశారు. అత్యంత కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ క్షిపణి దాడులకు చేసిందని బాహాటంగా ఒప్పేసుసున్నారు.
తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే బీఆర్ఎస్ లో ఏం జరుగుతోందన్నదే. అసలు పార్టీ కర్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు హరీష్ రావు నివాసానికి వెళ్లి రెండు గంటల పాటు ఏం చర్చించారన్న దానిపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తొందరపాటు నిర్ణయాల వల్ల ఆయనకు, ఆయన పార్టీకీ తీరని డ్యామేజ్ జరిగిందన్నది వాస్తవం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.