కందుకూరులో రియాల్టర్ ఆత్మహత్య..!

Publish Date:Sep 10, 2026

Advertisement

రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కందుకూరు మండలం నేదునూరు గ్రామానికి చెందిన రియాల్టర్ బాణాల రామ్‌రెడ్డి వ్యవసాయ పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పులు, వెంచర్‌కు సంబంధించిన భూ వివాదాలు, పెట్టుబడిదారుల ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. నేదునూరు గ్రామానికి చెందిన బాణాల రామ్‌రెడ్డి హైదరాబాద్‌లోని మణికొండలో నివాసం ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 2018లో పటాన్‌చెరువు ప్రాంతంలో సుమారు 250 ఎకరాల భూమిని బల్దేవ్, నరసింహారావు, మూర్తి తదితరుల వద్ద డెవలప్‌మెంట్‌కు తీసుకున్నారు. అయితే ఆ భూమికి సంబంధించి రెవెన్యూ సమస్యలు, లిటిగేషన్‌లు ఉండటంతో వాటిని పరిష్కరించేందుకు భారీగా అప్పులు చేశారు.


2018 నుంచి ఇప్పటివరకు భూమి డెవలప్‌మెంట్ ఆలస్యం కావడంతో పాటు, మరోవైపు భూ యజమానులు భూమిని ఇవ్వబోమంటూ ఒత్తిడి చేయడం, అప్పులు పెరిగిపోవడం, పెట్టుబడిదారుల నుంచి ఒత్తిడి రావడంతో రామ్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నిన్న నేదునూరులోని తన వ్యవసాయ పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రామ్‌రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన కుమార్తె అమెరికాలో ఉండటంతో ఆమె వచ్చే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.


రామ్‌రెడ్డి గచ్చిబౌలిలో సుమారు రూ.16 కోట్ల విలువైన విల్లాలో నివాసం ఉంటుండగా, స్వగ్రామమైన నేదునూరులో సుమారు రూ.3.5 కోట్లతో ఇల్లు నిర్మించుకున్నారు. ఆయనకు నేదునూరులో 16 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. పటాన్‌చెరువులో 250 ఎకరాల భూమిని కొనుగోలు చేసి డెవలప్‌మెంట్ చేపట్టిన రామ్‌రెడ్డి.. ఆ భూమికి సంబంధించిన రెవెన్యూ సమస్యలు, పెట్టుబడిదారుల ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు కందుకూరి పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

 

 

 

(Realtor commits suicide in Kandukur, Ranga Reddy District,  Banala Ram Reddy, Real estate business, Nedunur, Crime news, CP Sajjanar, DGP C.V. Anand, Telugu One, Telugu News) 

By
en-us Political News

  
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
.గరల్స్ హాస్టల్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంలో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్లైంది.
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.