Publish Date:Oct 10, 2024
పరిచయం అక్కర్లేని పేరు రతన్ టాటా. రతన్ టాటా వద్ద ఉద్యోగంలో చేరాలంటే పెద్దగా అర్హత అవసరం లేదు. నిజాయితీ, చిత్త శుద్ది ఉంటే రతన్ టాటా వద్ద చేరిపోవచ్చు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన శంతన్ నాయుడు రతన్ టాటావద్ద అసిస్టెంట్ గా చేరాడు. ఒక ఉద్యోగి కంటే ఒక ఫ్రెండ్ మాదిరిగా ఉండిపోయాడు. రతన్ టాటా భుజాల మీద చెయ్యివేసి దిగిన ఫోటోలు చూస్తుంటే శంతన్ నాయుడు ఏ రేంజ్ లో గుర్తింపు పొందాడో అర్థం చేసుకోవచ్చు.శంతన్ నాయుడు పూర్వికులు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారు. బతుకుతెరువు కోసం పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు వలస వెళ్లారు. 1993 లో జన్మించిన శంతన్ నాయుడు పూణే యూనివర్శిటీ నుంచి 2014 లో ఇంజినీనింగ్ పూర్తి చేశాడు. డిజైన్ ఇంజినీర్ గా టాటా గ్రూప్ లో చేరాడు. శంతన్ నాయుడు స్టార్టప్ ద్వారా రతన్ టాటా గుర్తించారు. బాగానే ఇన్వెస్ట్ చేశారు. గుడ్ ఫెలో స్ అనే ఈ స్టార్టప్ కంపెనీలో భారీ పెట్టుబడులు పెట్టిన రతన్ టాటా ఎంత ఇన్వెస్ట్ చేశారో గోప్యంగా ఉంచారు. వృద్దులకు సాయం చేసే ఈ స్టార్టప్ కంపెనీ పూర్తిగా శంతన్ నాయుడుకు చెందినది. వాన ప్రస్థంలో రతన్ టాటాకు అన్నీ తానై బాగా చూసుకున్నాడు ఆయన అసిస్టెంట్ శంతన్ నాయుడు.
ముఖ పరిచయం కూడా లేని శంతన్ నాయుడును తన వద్దే అసిస్టెంట్ గా చేర్చుకుని చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగేవారు. జోకులు పేల్చుకునే వారు. 84 ఏళ్ల రతన్ టాటా 20 ఏళ్ల శంతన్ నాయుడుతో ఫ్రెండ్ షిప్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. బిజినెస్ లో ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరినీ ప్రోత్సహించిన గొప్ప మానవతావాది రతన్ టాటా . శంతన్ నాయుడు కూడా రతన్ టాటా నమ్మకాన్ని వమ్ము చేయకుండా రతన్ టాటా వెంటే ఉన్నారు. ఇష్టానికి కష్టం తోడైతే చిన్న వయసులో పెద్ద విజయం సాధించవచ్చు అని శంతన్ నాయుడు నిరూపించుకున్నాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ratan-tata-assistant-shantan-naidu-is-our-teluguboy-25-186600.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.