రాత్రికి రాత్రే... సమాధులు మాయం
Publish Date:Sep 5, 2025
Advertisement
సర్వసాధారణంగా మన బంగారం, వాహనాలు, లేదా ఇంట్లో ఏదైనా వస్తువులు దొంగలు ఎత్తు కెళ్లడం వంటి వార్తలు వింటూ ఉంటాము. కానీ ఓ గ్రామంలో మాత్రం రాత్రికి రాత్రే సమాధులు మాయమవుతున్నాయి...అంతేకాదండోయ్ అందులో ఉన్న ఆస్తి కలు కూడా కనిపిం చకుండా పోవడం తో ఆ గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. ఈ విషయం కాస్త చుట్టు పక్కల ఉన్న గ్రామాలకు తెలిసిందీ. దీంతో ఎవరైనా క్షుద్ర పూజలు చేయడానికా అంటూ ఓ పెద్ద చర్చ మొదలైంది. అనంతరం అసలు కథ బయటపడడంతోగ్రామస్తులందరూ విస్తుపోయారు. ఈ కథ వెనుక ఓ మూవీ డిస్ట్రిబ్యూ టర్ ఉన్నాడని తెలిసింది. అయితే ఇది సినిమా కోసం మాత్రం కాదండోయ్ దాని వెనుక ఓ పెద్ద కథే ఉంది. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలంలో ఉన్న డబిల్ గూడా గ్రామంలోసర్వేనెంబర్ 24 లో ఉన్న దళిత కుటుంబానికి చెందిన నాలుగు సమాధులు ఆ స్థలంలో ఉన్నాయి. జన్య పాగ కుటుంబ సభ్యులు 2006వ సంవత్సరంలో మూడు ఎకరాల, ఐదు గుంటలు తమ భూమిని అమ్మారు. ఆ సమయంలో సమాధుల కోసం వారు ఒక గుంట భూమిని తమ వద్ద పెట్టుకున్నారు. అయితే వారి భూమిని ఓ సినిమా డిస్ట్రిబ్యూటర్ కొన్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అక్కడ ఉన్న నాలుగు సమాధులు కనిపించకుండా పోయాయి ఆ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నేరుగా విలపించసాగారు.
తాము కొన్న స్థలా నికి సమాధులు అడ్డుగా వస్తున్నా యని... ఆ స్థలాన్ని కొన్న సినీ నిర్మాత,రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ సమాధులను రాత్రికి రాత్రే తొలగించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా చివరకు సమాధి లోపల ఉన్న అస్థికలు కూడా లేకుండా చేశాడని.... తమ పూర్వీకుల అస్థికలను తమకు కావాలని కుటుంబ సభ్యులు సమా ధుల వద్ద బోరున విలపించసాగారు. కబ్జాదారుల నుండి మా పూర్వీకుల అస్తికలను ఇవ్వవలసిందిగా భూమి పట్టాదారు జన్య పగా బాలమణి పోలీసులను కోరింది. లేదంటే ఆ సమాధిల వద్దే ఆందోళన చేస్తామని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఈ ఘటనపై స్థానిక పలు పార్టీల నేతలు స్పందించి బాధితు లకు అండగా నిలి చారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ranga-reddy-district-25-205651.html





