రాందేవ్ వర్సెస్ ఐఎంఏ.. ఎవరూ తగ్గట్లే!

Publish Date:May 29, 2021

Advertisement

ఆధునిక వైద్యంగా పిలవబడే అలోపతి వైధ్యం గురించి యోగా గురు  రాందేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రేపిన   దుమారం ఇంకా సర్దు మణగలేదు. రాందేవ్ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం , ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఐఎంఏ ఫిర్యాదు మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్, రాందేవ్ బాబాకు ఘాటైన లేఖ రాసిన విషయం  కూడా, అంతే, అందరికీ తెలిసిందే. అదే విధంగా  ఆ లేఖలో కేంద్ర మంత్రి సూచించిన విధంగా రాందేవ్ బాబా తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఐఎంఏతో పాటుగా అలోపతి వైద్యులకు క్షమాపణలు కూడా చెప్పారు. అక్కడితో ఆ వివాదానికి చుక్క పెట్టారు. 

అయితే రాందేవ్ బాబా, తగ్గినట్టే తగ్గి మళ్ళీ అలోపతికి కొత్త సవాళ్ళు విసిరారు.  వివాదాన్ని మరో మలుపు తిప్పారు. అలోపతి వైద్యంలో ఉన్న లొసుగులను ఎత్తి చూపుతూ, బీపీ, మధుమేహం సహా కొన్ని రోగాలకు  అలోపతిలో శాశ్వత చికిత్స ఎందుకు లేదంటూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ)కు 25 ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ట్విటర్‌లో బహిరంగ లేఖ రాశారు.బాబా ప్రశ్నలకు ఐఎంఎ ఎదుకనో సమాధానం అయితే ఇవ్వలేదుగానీ, రాందేవ్’ బాబా క్షమాపణలతో ముగిసింది అనుకున్న పాత సంగతులను పైకితీసి అయన మీద కేసులు పెట్టింది. అంతే కాదు ఓ వెయ్యి కోట్ల రూపాయలకు పరవు నష్టం దావా కూడా వేసింది. సోషల్ మీడియాలో రాందేవ్ బాబాకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నెటిజన్లు ఆయపై  దుమ్మెత్తి పోశారు. ఆయన పై దేశద్రోహం కేసు పెట్టాలని , ఆయన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని సోషల్ మీడియా హోరెత్తి పోయింది. అయితే రాందేవ్ బాబా, ఆ విషయాన్ని లైట్’ గా తీసుకున్నారు. ఎవరూ తనను అరెస్ట్ చేయలేరని, పరోక్షంగా, ఆయన్ని అరెస్ట్ హేయాలని కోరుతూ కొందరు ప్రధాని మోదీకో లేఖరాయడాన్ని ఎద్దేవా చేశారు.

అదలా ఉంటే’ ఇప్పుడు తాజాగా, ఐఎంఏ కేసులు , పరవు నష్టం దావా విషయంలో ఒకడుగు వెనకు వేసింది. రాందేవ్ బాబా కొవిడ్ 19 వాక్సిన్, ఆధునిక వైద్యం పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే కేసులు, పరవు నష్టం దావా వెనక్కి తీసుకుంటామని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు, డాక్టర్ జే ఏ జయలాల్. పేర్కొన్నారు. అయితే, కొవిడ్ వాక్సిన్, ఆధునిక వైద్యంపై చేసిన వ్యాఖ్యలను, రాందేవ్ బాబా ఇప్పటికే వెనక్కి తీసుకున్నారు. క్షమాపణలు కూడాచెప్పారు.  అయినా ఇప్పుడు మళ్ళీ మరోమారు అవే డిమాండ్స్ చేయడం ఏమిటన్న ప్రశ్నకు, ఐఎంఏ అధ్యక్షుడు, ‘అలాకాదు, ఆయన తమ వ్యాఖ్యలను సంపూర్ణంగా ఉపసంహరించుకోవాలని, క్షమ్పణలు చెప్పాల’ని అంటున్నారు. అయితే, రాందేవ్ బాబా,  ఫ్రెష్’గా సంధించిన 25 ప్రశ్నలకు సమాధానాలు లేకనో లేక చేపప్డం ఇష్టం లేక పోవడం వల్లనో,  ఐఎంఏ, అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తోందని రాందేవ్ బాబా ఫాలోయర్స్ అంటున్నారు. అయితే, ఏది ఏమైనా అలోపతి, ఆయుర్వేదం, అలోపతి మరో వైద్య విధానం మధ్య వివాదాలు, వాదోపవాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలకు ఇది సమయం కాదు. కానీ, ఎప్పుడో ఒకప్పుడు జాతీయ వైద్య విధానంపై లోతైన చర్చ జరగవలసిన అవసరం అయితే వుంది. అప్పుడు, భారతీయ వైద్య విధానంపై లోతైన చర్చ అవసరం అవుతుందని, అంటున్నారు  భారతీయ వైద్య విధానం పట్ల విశ్వాసం ఉన్న వైద్యులు.

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.