‘గోవిందుడు...’ మీద రూమర్లన్నీ అబద్ధాలే!
Publish Date:Jun 15, 2014
Advertisement
రామ్‌చరణ్, కాజల్ జంటగా, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రధారులుగా కృష్ణవంశీ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా విషయంలో బోలెడన్ని పుకార్లు వచ్చాయి. ఈ సినిమా కథ నచ్చలేదని రామ్‌చరణ్ సినిమా ఆపేశాడని, ఆ తర్వాత ఈ సినిమా కథ మార్చారని, మెగా ఫ్యామిలీ ఇంటర్‌ఫియరెన్స్ వల్ల కృష్ణవంశీ ఇబ్బంది పడుతున్నాడని పుకార్లు వినిపించాయి. ఈ పుకార్లన్నీ పచ్చి అబద్ధాలని నిర్మాత బండ్ల గణేష్ స్పష్టం చేశారు. రామ్ చరణ్‌కి జ్వరం రావడం, ఈ సినిమాలో ప్రధాన పాత్రని ధరిస్తున్న తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ని మార్చడం కారణంగా సినిమా షూటింగ్ ఆగింది తప్పితే మరో కారణమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘గతంలో మా సంస్థ ‘గబ్బర్‌సింగ్’ సినిమా తీస్తున్నప్పుడు ఇలాగే రూమర్లు వ్యాపించాయి. ఆ రూమర్లని అబద్ధాలు చేస్తూ మేము ఘన విజయం సాధించాం. అదే ‘గోవిందుడు అందరివాడేలో’ విషయలో కూడా రిపీట్ అవుతుంది. మొదట మా సినిమాలో ప్రధాన పాత్ర కోసం తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ని తీసుకున్నాం. ఆయనపై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించాం. రాజ్‌కిరణ్ అద్భుతంగా నటించారు. అయితే... ఆయన నటన తెలుగు నేటివిటీకి దూరంగా ఉందని అనిపించింది. అందుకే... ఆయన స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ని తీసుకున్నాం. ఈ చిన్న చిన్న అవాంతరాల కారణంగా చిత్రీకరణలో జాప్యం జరిగింది. అంతేతప్ప ఈ సినిమాని ఆపేయమని చిరంజీవి గారు అన్నారని వచ్చిన వార్తలు రూమర్స్. అసలు చిరంజీవి గారు ఇంతవరకు ఈ సినిమా రషెస్ కూడా చూడలేదు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామానాయుడు సినీ విలేజ్‌లో ప్రత్యేకంగా నిర్మించిన ఇంటి సెట్‌లో జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/ramcharan-32-34841.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





