Publish Date:Nov 26, 2024
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పని అయిపోయింది. ఇప్పట్లో ఆ పార్టీకి ఎటువంటి అవకాశాలూ దక్కే పరిస్థితి లేదు. ఇటు మండలిలో, అటు రాజ్యసభలో తమకు తెలుగుదేశం కూటమి కంటే బలం ఉందని తన భుజాలు తాను చరుచుకుని సంతృప్తిపడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ పార్టీని, మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ ను నమ్మే పరిస్థితులు ఇసుమంతైనా కనిపించడం లేదు.
ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యులు ముగ్గురు పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికీ కూడా రాజీనామా చేసేశారు. దీంతో రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా ప్రకటించేసింది. ఏ విధంగా చూసినా ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలో వైపీపీ అభ్యర్థులను నిలబెట్టే అవకాశాలు లేవు. ఎందుకంటే నిలబెట్టినా గెలిచే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు ఆ మూడు స్థానాలలో కూడా కూటమి అభ్యర్థులే ఎన్నికౌతారు. అయితే తెలుగుదేశం కూటమిలో రాజ్యసభకు వెళ్లేది ఎవరన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యలు వైసీపీ పార్టీకీ, రాజ్యసభ సభ్యత్వాలకూ కూడా రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. రాజీనామా చేసిన ముగ్గురిలో మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావులు తెలుగుదేశం గూటికి చేరారు. అయితే ఆర్. కృష్ణయ్య మాత్రం ఏ పార్టీలోనూ చేరలేదు.. సరికదా, బీజీలకు రాజ్యాధికారం కోసం సొంతంగా పార్టీ ప్రారంభిస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఆయన ధోరణి వేరు. ఆయనను ఒక సీరియస్ పొలిటీషియన్ గా ఎవరూ పరిగణించే పరిస్థితి లేదు. చేరతానన్నా ఏ పార్టీ కూడా ఆయనకు రెడ్ కార్పెట్ వేసి వెల్ కమ్ చెప్పే అవకాశమూ లేదు. అన్నిటికీ మించి ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు తెలుగుదేశం కూటమి మరో చాన్స్ ఇచ్చే అవకాశం ఇసుమంతైనా లేదు. ఆయనను పక్కన పెడితే... ఖాళీ అయిన మూడు స్థానాలలో రెండింటిని.. తాజా మాజీలు, అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తరువాత వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరిన వారికే దక్కే అవకాశాలు ఉన్నాయి. అంటే తెలుగుదేశం మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావులనే తమ పార్టీ తరఫున రాజ్యసభకు పంపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
తెలుగుదేశం కూటమి వర్గాల నుంచీ అదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక ఖాళీ అయిన మూడో స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ స్థానం కోసం కూటమి పార్టీలలో పోటీ తీవ్రంగా ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ఈ స్థానం కోసం బీజేపీ, జనసేనలు గట్టిగా పట్టుబడుతున్నారని కూటమి వర్గాల్లో కూడా ప్రచారం అవుతోంది. కూటమి పార్టీల ఐక్యతకు భంగం వాటిల్లకుండా చంద్రబాబు ఈ విషయంలో ఏం చేస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rajyasabha-by-poll-25-189042.html
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.