జనవరిలో పార్టీ పెడతానన్న రజనీ! ఈసారైనా ఖాయమేనా?    

Publish Date:Dec 3, 2020

Advertisement

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీపై సాగదీత దోరణి కొనసాగిస్తూనే ఉన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్.  మూడేళ్లుగా పెండింగులో ఉన్న పార్టీ ఏర్పాటుకు సంబంధించి తాజాగా ట్వీట్ చేసినా .. అందులోనూ పూర్తి స్పష్టత ఇవ్వలేదు . త్వరలోనే తాను పార్టీ పెట్టబోతున్నానని గతంలో చెప్పినట్లే మళ్లీ చెప్పారు తలైవా. డిసెంబర్ 31 తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ ఆ సస్పెన్స్ ను కొనసాగించారు. వచ్చే  మేలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నా పార్టీ ఏర్పాటుపై సాగదీయడంపై విమర్శలు వస్తున్నాయి. అసలు రజనీకాంత్ కు పార్టీ పెట్టే ఆలోచన ఉందా? పార్టీ పెట్టినా సీరియస్ గా ముందుకు పోతారా లేక నామ్ కే వాస్తాగా మారుస్తారా ? అన్న ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీపై మూడేళ్లుగా నాన్చడం ఏంటనే చర్చ రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.

 

మూడేళ్ల క్రితం రాజకీయ పార్టీపై ప్రకటన చేసినా అది  ప్రచారంగానే మిగిలిపోవడం.. మరో ఐదు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రజనీకాంత్ పార్టీ ఉండకపోవచ్చని దాదాపుగా అందరూ నిర్ణయానికి వచ్చారు. ఇంతలో సడెన్ గా మేల్కొన్న రజనీకాంత్.. నవంబర్ 30న  రజనీ మక్కల్ మండ్రం సభ్యులతో  అత్వవసరంగా సమావేశమయ్యారు. చెన్నైలో జరిగిన ఈ భేటీకి తమిళనాడులోని అన్ని జిల్లాల నుంచి ఆర్ఎంఎం బాధ్యులు, అభిమానులు వచ్చారు. సమావేశం తర్వాత పార్టీపై రజనీకాంత్ ప్రకటన చేస్తారని భావించారు. కాని అప్పుడు కూడా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. రాజకీయ రంగ ప్రవేశంపై వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు.  ఆర్ఎంఎం సభ్యులతో సమావేశం తర్వాత చెప్పినట్లే రాజకీయ పార్టీపై రజనీకాంత్ ప్రకటన చేసినా.. అది క్లారిటీగా లేకపోవడం  అభిమానులను నిరాశ పరిచింది.  

 

2017 డిసెంబర్‌ 31న రాజకీయ పార్టీపై ప్రకటన చేశారు రజనీకాంత్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. రజనీ రాజకీయాలకు వస్తారన్న ప్రకటనతో ఆయన ఫ్యాన్స్  ఆనందంలో మునిగిపోయారు. అయితే పార్టీ పెడతానని ప్రకటించి మూడేళ్లు అయినా... పార్టీ ఏర్పాటుపై పురోగతి కన్పించలేదు.  రజనీ మక్కల్‌ మండ్రం ఏర్పాటు, కార్యవర్గం నియామకం, సభ్యత్వ నమోదుతో సరిపెట్టారు రజనీకాంత్. త్వరలోనే పార్టీ అనే ప్రకటనలతోనే మూడేళ్లు గడిచిపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల కోసం  రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యూ హాలకు పదును పెడుతుండగా.. తమ హీరో  స్పష్టత ఇవ్వకపోవడంతో రజనీకాంత్ అభిమానులు అయోమయంలో పడిపోయారు.  

 

రజనీకాంత్ మౌనంతో ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటుపై వెనక్కి తగ్గారనే ప్రచారం జరిగింది. ఇంతలోనే కొద్ది రోజుల క్రితం రజనీ కాంత్ పేరిట సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం మరింత గందరగోళానికి దారి తీసింది  అనారోగ్య కారణాలతో రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడం లేదన్నది ఆ ప్రచార సారాంశం. వైద్యుల సలహా మేరకు రాజకీయాల నుంచి రజనీకాంత్ తప్పుకుంటున్నారని అందులో ఉంది.  సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన రజనీకాంత్..  అది తన ప్రకటన కాదంటూనే  అందులో పేర్కొన్న ఆరోగ్యపరమైన సమస్యలను  పరోక్షంగానే అంగీకరించారు. మండ్రం నిర్వాహకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. దీంతో తమిళనాట రజనీ పార్టీ ఉండకపోవచ్చనే అంతా భావించారు. 

 

మరోవైపు రజనీకాంత్ రాజకీయ పార్టీపై పూర్తి స్పష్టత లేకపోయినా.. ఆయన అభిమానులు మాత్రం న్యూ ఇయర్ గిఫ్ట్ గా కొత్త పార్టీ వస్తుందని ధీమాగా చెబుతున్నారు. రజనీకాంత్ తాజా ప్రకటనతో తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. పలు జిల్లాల్లో మిఠాయిలు పంచుకుంటూ క్రాకర్స్ కాల్చుతున్నారు.  రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడితో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారతాయని పరిశీలకుల అంచనా.  రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడితే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్లస్ , డీఎంకే మైనస్ కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ పెట్టిన కమల్‌ హాసన్ పెద్దగా ప్రభావం చూపలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రజనీకాంత్ రాజకీయ గమనం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.